E-Paper
Advertisement

Taraka Ratna: తారకరత్న సేఫేనా? హాస్పిటల్ కు నందమూరి ఫ్యామిలీ..

Taraka Ratna: తారకరత్న సేఫేనా? హాస్పిటల్ కు నందమూరి ఫ్యామిలీ..
Advertisement

Taraka Ratna: తారకరత్న. 23 రోజులుగా హాస్పిటల్ లోనే ఉన్నారు. మెరుగైన చికిత్స అందిస్తున్నా ఆయన కోలుకోవడం లేదు. అప్పటికీ ఇప్పటికీ పెద్దగా మార్పేమి లేదంటున్నారు. విదేశాల నుంచి వైద్యులను పిలిపించారు. వారి సూచనలతో బెంగళూరు నారాయణ హృదయాలయలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. చికిత్సకు ఆయన శరీరం అంతగా స్పందించడం లేదని తెలుస్తోంది.

బెయిన్ తోనే మేజర్ ప్రాబ్లమ్. హార్ట్ స్ట్రోక్ వచ్చాక.. చాలాసేపటి వరకూ బ్లడ్ పంపింగ్ ఆగిపోయింది. బ్రెయిన్ కు రక్తం నిలిచి.. మెదడు పని తీరు దెబ్బతింది. దీంతో కోమాలోకి వెళ్లిపోయారు తారకరత్న. అందుకే, ప్రధానంగా బ్రెయిన్ కి సంబంధించిన చికిత్సలే చేస్తున్నారు వైద్యులు.

Advertisement

గురువారం తారకరత్నకు ఎం.ఆర్‌.ఐ స్కానింగ్‌ చేశారు వైద్యులు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. మెదడుకు సంబంధించిన వైద్య సేవలు కొనసాగించారు. అయితే, శనివారం కల్లా తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది.

విషయం తెలిసి నందమూరి బాలకృష్ణ బెంగళూరు వెళ్లారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో మాట్లాడారు. తారకరత్న కుటుంబ సభ్యులు సైతం ఆసుపత్రిలోనే ఉన్నారు. వారిలో అలజడి పెరిగింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×