E-Paper
Advertisement

Prabhas: ప్రభాస్‌కు ఆదిపురుష్ కంటే ఎక్కువ నష్టం మిగిల్చిన రాజా సాబ్

Prabhas: ప్రభాస్‌కు ఆదిపురుష్ కంటే ఎక్కువ నష్టం మిగిల్చిన రాజా సాబ్
Advertisement

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ది రాజా సాబ్ సినిమా ఒక పెద్ద డిజాస్టర్ వైపు.. పరుగులు తీస్తోంది అని చెప్పడంలో.. సందేహం లేదు. ఈ సినిమా ప్రభాస్‌కు గతంలో వచ్చిన ఆదిపురుష్ కంటే కూడా ఎక్కువ నష్టం చేసిందనే అభిప్రాయం ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. బాక్సాఫీస్ పరంగా చూస్తే ది రాజా సాబ్ ..కలెక్షన్లు ఆదిపురుష్‌తో పోలిస్తే దాదాపు సగం మాత్రమే వచ్చాయి. కానీ అసలు సమస్య కలెక్షన్లకన్నా వేరే చోటే ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ సినిమాలో వాడిన వీఎఫ్ఎక్స్, ఏఐ ఫేస్ టెక్నాలజీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభాస్ ముఖం సహజంగా లేకుండా కనిపించిందని.. కొన్ని సీన్లలో ఫేస్ స్వాప్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోందని ప్రేక్షకులు కామెంట్లు చేశారు. థియేటర్ ప్రింట్ నుంచే కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం సినిమాకు మరింత నష్టం చేసింది.

Advertisement

ఇక బాడీ డబుల్స్, డూప్స్ వాడటం అనేది ప్రతి హీరో సినిమాల్లో సాధారణమే. కానీ ది రాజా సాబ్ లో మాత్రం చాలా సాధారణ సీన్లలో కూడా డూప్స్‌ను వాడారని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా హై బడ్జెట్ సినిమా అయినప్పటికీ..ప్రేక్షకులు డూప్ సీన్లను సులభంగా గుర్తించగలిగారు. ఇది అభిమానులను నిరాశకు గురి చేసింది.

బాక్సాఫీస్ గణాంకాలు కూడా సినిమాకు వచ్చిన నెగటివ్ టాక్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. 20 రోజులకే సినిమా రోజువారీ వసూళ్లు చాలా తక్కువ స్థాయికి పడిపోయాయి. తెలుగు, హిందీ, మలయాళం అన్ని భాషల్లోనూ వసూళ్లు గణనీయంగా తగ్గాయి. దీని వల్ల సినిమా థియేటర్లలో..ఈ సినిమా ప్రయాణాన్ని దాదాపు ముగించినట్టే అని చెప్పవచ్చు.

Advertisement

ఇప్పుడు మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే..ఓటీటీ రిలీజ్ తర్వాత వచ్చే రియాక్షన్. థియేటర్లలోనే ఇంత నెగటివ్ టాక్ వచ్చినప్పుడు.. డిజిటల్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

దీంతో ది రాజా సాబ్ ప్రభాస్ కెరీర్‌కు ఒక వార్నింగ్ బెల్ లాంటిదని చెప్పొచ్చు. కథ, టెక్నాలజీ, ఎగ్జిక్యూషన్ విషయంలో రాజీ పడితే, స్టార్ ఇమేజ్ ఉన్న హీరోకైనా ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా మరోసారి చూపించింది. ఇకపై ప్రభాస్ సినిమాల విషయంలో మరింత జాగ్రత్త అవసరమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

ALSO READ: Fauzi Release Date: ప్రభాస్ ఫౌజీ విడుదల తేదీ ఫిక్స్..మరోసారి పండగ స్లాట్ బుక్ చేసుకున్న రెబల్ స్టార్..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×