E-Paper
Advertisement

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్
Advertisement

Romantic Comedy Drama: మనసారా ప్రేమించిన అమ్మాయి భార్యగా దొరకడం ఎంత అదృష్టమో కదా. కానీ అందరికీ ఆ అద్భుతమైన అవకాశం దక్కదు. అలాంటప్పుడు మరో జన్మలో అయినా ఆ కోరిక తీరాలని అనుకుంటారు చాలామంది. మరి తీరదు అనుకున్న ఆ కోరిక ఇదే జన్మలో, కానీ వేరే ప్రపంచంలో తీరితే ఎలా ఉంటుంది ? అది తెలియాలంటే ‘ఆదియే’ (Adiyae) సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు ? కథ ఏంటి ? అన్న వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

సినిమాలో మన హీరో పేరు జీవా. జీవితంలో దేనిలోనూ సక్సెస్ కాలేక, తీవ్రమైన డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. జీవాకు స్కూల్ రోజుల్లోనే సెంథాళిని అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ ఆమెకు తన ప్రేమను ఎప్పుడూ ధైర్యంగా చెప్పలేకపోతాడు. ప్రస్తుతం సెంథాళిని ఒక పెద్ద పాపులర్ సింగర్‌గా మారిపోతుంది. చనిపోయే ముందైనా ఆమెను కలిసి తన మనసులోని మాట చెప్పాలని జీవా బయలు దేరుతాడు.

Advertisement

సెంథాళినిని కలవడానికి వెళ్తున్న క్రమంలో జీవాకు ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత కళ్ళు తెరిచిన జీవా ఒక ఊహించని వింత లోకంలోకి ప్రవేశిస్తాడు. అది మన భూమి లాంటిదే కానీ, అక్కడ అన్నీ తలకిందులుగా ఉంటాయి. ఆ ప్యారలల్ వరల్డ్ లో జీవా ఇంతకు ముందులా లూజర్ కాదు, అతనొక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. అంతేకాదు, ఆ ప్రపంచంలో సెంథాళిని అతని భార్య. అక్కడ ఆమెతో కలిసి జీవా ఎంతో సంతోషంగా, ఒక ఐడియల్ లైఫ్ గడుపుతుంటాడు. కానీ ఆ కొత్త ప్రపంచంలో కూడా సమస్యలు లేకపోలేదు. సెంథాళినికి మేనేజర్‌గా ఉన్న సైకో సెంథిల్ వల్ల వారిద్దరి మధ్య కొన్ని సమస్యలు వస్తాయి.

ఆ కొత్త ప్రపంచంలో జీవితాన్ని ఆస్వాదిస్తున్న తరుణంలో, విధి అతడిని మళ్లీ ఒక ట్విస్ట్ ద్వారా తన పాత ప్రపంచంలోకి నెట్టేస్తుంది. ఒక ప్రపంచం నుండి మరో ప్రపంచంలోకి జీవా మారుతూ, తీవ్రమైన గందరగోళానికి గురవుతాడు. ఈ రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య చిక్కుకున్న జీవా, అసలు తనకు ఈ పరిస్థితి ఎందుకు ఎదురైందో తెలుసుకుంటాడు. చివరకు ఈ టైమ్ అండ్ స్పేస్ గందరగోళాన్ని దాటుకుని, తన నిజ జీవితంలో సెంథాళిని ప్రేమను ఎలా గెలుచుకున్నాడు ? తన డిప్రెషన్ నుండి ఎలా బయట పడ్డాడు ? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

తెలుగులోనూ స్ట్రీమింగ్

Advertisement

ప్యారలల్ ప్రపంచాల మధ్య చిక్కుకున్న ఈ లవ్ స్టోరీ… హృదయాన్ని కదిలించే సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ డ్రామాలా సాగుతుంది. అద్భుతంగా తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఆదియే’ సినిమాలో జి.వి. ప్రకాష్ కుమార్, గౌరీ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తమిళ సినిమాలో మొదటిసారి ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్‌ను సక్సెస్ ఫుల్ గా తీశారు. Sony LIVలో ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా చూసిన తర్వాత జీవితం గురించి కొత్తగా ఆలోచించాలని తోస్తుంది.

Read Also: శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×