E-Paper
Advertisement

టయోటా To నిస్సాన్.. ఏప్రిల్ లో లాంచ్ కాబోయే ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

టయోటా To నిస్సాన్.. ఏప్రిల్ లో లాంచ్ కాబోయే ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Advertisement

Upcoming EVs in April 2026: ఏప్రిల్ 2026లో ఇండియన్ ఆటో మార్కెట్‌ లోకి పలు కొత్త ఎలక్ట్రిక్ కార్లు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ కార్లు లగ్జరీ నుంచి మాస్ మార్కెట్ వరకు అన్ని వర్గాల వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడ్డాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ కొత్తఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారులలో ఆసక్తి పెరుగుతోంది. ఇంతకీ వచ్చే నెలలో మార్కెట్ లోకి అడుగు పెట్టబోయే ఈవీ కార్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మెర్సిడెస్-బెంజ్ CLA ఎలక్ట్రిక్

మెర్సిడెస్-బెంజ్ CLA ఎలక్ట్రిక్ ప్రీమియం సెడాన్‌ ఏప్రిల్ 15న మార్కెట్ లోకి విడుదల కానుంది. దీని ధర సుమారు రూ. 59 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారులో 14 అంగుళాల డిస్‌ ప్లే, గ్లాస్ రూఫ్,  అత్యాధునిక లగ్జరీ ఫీచర్లతో రానుంది. దీని రేంజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఒకే ఛార్జ్ తో ఏకంగా 450 కిలో మీటర్లకు పైగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.

⦿ టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఎలక్ట్రిక్

Advertisement

టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఎలక్ట్రిక్ SUV కూడా ఏప్రిల్ 15నే విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఇది మారుతి సుజుకి ఇ-విటారా ప్లాట్‌ ఫామ్ ఆధారంగా  తయారైంది. ఈ SUVలో 49 kWh, 61 kWh బ్యాటరీ ప్యాక్ లు ఉండబోతున్నాయి. మంచి రేంజ్‌తో పాటు, మాస్ మార్కెట్ వినియోగదారులను టార్గెట్ చేసుకుని అందుబాటులోకి రాబోతోంది. దీని ధర సుమారు రూ. 21 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు.

⦿ విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్

ఏప్రిల్ లో మార్కెట్ లోకి అడుగు పెట్టబోయే మరో క్రేజీ ఎలక్ట్రిక్ కారు విన్‌ ఫాస్ట్ లిమో గ్రీన్. ఏప్రిల్ 20 ఈ కారు రిలీజ్ కానుంది. 5+2 సీటింగ్ కెపాసిటీతో కూడిన క్రాస్‌ ఓవర్ MPVగా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతోంది.  ఇందులో 60.1 kWh బ్యాటరీ ఉంటుంది. ఒకే ఛార్జ్ తో సుమారు 450 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. పెద్ద కుటుంబాలకు, సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. దీని ధర సుమారు రూ. 24 లక్షలు ఉంటుంది.

⦿ నిస్సాన్ టెక్టన్

Advertisement

నిస్సాన్ టెక్టన్ అనే కొత్త SUV కూడా 2026 ఏప్రిల్‌ లో వచ్చే అవకాశముంది. ఇది కొత్త రెనాల్ట్ డస్టర్ ఆధారంగా రూపొందించినట్లు తెలుస్తోంది. స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది.

ఈ కార్లతో పాటు ఈ ఏడాది మరికొన్ని ఎలక్ట్రిక్ కార్లు విడుదలకు రెడీ అవుతున్నాయి. టాటా సఫారీ ఈవీ మిడ్ ఇయర్ లో విడుదల కానుంది. ఇది ప్రీమియం SUV సెగ్మెంట్‌లో కీలక పాత్ర పోషించనుంది. టాటా సియెర్రా EV కూడా మార్కెట్ లోకి రానుంది. MG నుంచి కొత్త కాంపాక్ట్ EV కూడా రానుంది. ఈ ఏడాది లగ్జరీ నుంచి మొదలుకొని బడ్జెట్ రేంజ్ వరకు అన్ని వర్గాల వినియోగదారులకు అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.

Read Also:  కియా నుంచి అతి చిన్న ఎలక్ట్రిక్ SUV, రేంజ్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వుద్ది!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×