E-Paper
Advertisement

Mobile Addiction: పిల్లల్లో మొబైల్ వ్యసనానికి చెక్ పెట్టాలా? పేరెంట్స్ పాటించాల్సిన సింపుల్ టిప్స్ ఇవే!

Mobile Addiction: పిల్లల్లో మొబైల్ వ్యసనానికి చెక్ పెట్టాలా? పేరెంట్స్ పాటించాల్సిన సింపుల్ టిప్స్ ఇవే!
Advertisement

Mobile Addiction: నేటి ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్ అనేది మన జీవితంలో భాగమైపోయింది. ఫోన్ లేకుండా ఒక్క రోజును ఊహించుకోవడం కూడా కష్టంగా మారింది. మొదట పెద్దల అవసరంగా ఉన్న ఈ పరికరం.. ఇప్పుడు చిన్నపిల్లల రోజువారీ జీవితంలో కూడా ప్రధాన భాగంగా మారుతోంది. ఆన్‌లైన్ క్లాసులు, గేమ్స్, వీడియోలు, సోషల్ మీడియా.. ఇలా అన్నింటికీ మొబైల్ వాడకం పెరిగిపోవడంతో, పిల్లలపై దీని ప్రభావం గురించి తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది.

చాలా ఇళ్లలో పిల్లలు గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చుని ఉండటం కనిపిస్తోంది. ఫోన్ ఇవ్వకపోతే చిరాకు పడటం, కోపంగా ప్రవర్తించడం, ఏదో కోల్పోయినట్టుగా అనిపించడం వంటి లక్షణాలు కనబడితే.. అది సాధారణ అలవాటు కాదని, క్రమంగా వ్యసనంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు.

అతిగా వాడితే ఏమౌతుంది?

Advertisement

పిల్లలు అతిగా మొబైల్ వాడటం వల్ల వారి రోజువారీ జీవనశైలి నెమ్మదిగా మారిపోతుంది. చదువుపై ఆసక్తి తగ్గడం, ఆటల పట్ల నిర్లక్ష్యం, తోటి పిల్లలతో కలవడానికి ఇష్టపడకపోవడం వంటి ప్రవర్తనా మార్పులు కనిపించవచ్చు. వైద్యుల మాటల్లో చెప్పాలంటే.. ఎక్కువ స్క్రీన్ టైమ్ వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గడం, నిద్ర సరిగా పట్టకపోవడం, మానసిక ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కంటి అలసట, తలనొప్పి, చిరాకు వంటి శారీరక ఇబ్బందులు కూడా క్రమంగా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు.

ఫోన్ వాడకాన్ని తగ్గించాలంటే:

పిల్లల్లో మొబైల్ వినియోగాన్ని తగ్గించాలంటే.. ముందుగా తల్లిదండ్రులు ఓపికతో వ్యవహరించాలి. ఒక్కసారిగా ఫోన్‌ను పూర్తిగా నిషేధించడం వల్ల పరిస్థితి మరింత ఆందోళనగా మారే అవకాశం ఉంటుంది. అందుకే.. మొదట స్మార్ట్‌ఫోన్ వల్ల కలిగే దుష్ప్రభావాలను పిల్లలకు అర్థమయ్యేలా, స్నేహపూర్వకంగా వివరించడం ముఖ్యం. మొబైల్ ఎక్కువగా వాడితే ఆరోగ్యం, చదువు, మానసిక స్థితిపై ఎలా ప్రభావం పడుతుందో సులభమైన మాటల్లో చెప్పాలి. అంతేకాదు.. పిల్లల మాటలను కూడా శ్రద్ధగా వినాలి. వారు చెప్పేది అర్థం చేసుకున్నప్పుడే, తల్లిదండ్రులు చెప్పే నిబంధనలను పిల్లలు స్వీకరిస్తారు.

ప్రత్యామ్నాయాలు అనేకం:

Advertisement

పిల్లలు మొబైల్‌కు అతుక్కుపోకుండా ఉండాలంటే.. వారికి ఆసక్తి కలిగించే ఇతర ప్రత్యామ్నాయాలు ఉండాలి. బయట ఆడే ఆటలు, కుటుంబంతో కలిసి ఆడే గేమ్స్, పుస్తకాలు చదవడం, డ్రాయింగ్, సంగీతం వంటి అభిరుచులను ప్రోత్సహిస్తే.. ఫోన్‌పై ఆధారపడటం క్రమంగా తగ్గుతుంది. అయితే ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. పిల్లలతో కలిసి సమయం గడపటం, వారి ఆసక్తులను ప్రోత్సహించడం, రోజువారీ విషయాలపై మాట్లాడటం వల్ల పిల్లలు సహజంగానే మొబైల్‌కు దూరమవుతారు.

పిల్లలకు ఆదర్శం తల్లిదండ్రులే:

సాధారణంగా పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందటే.. మనం చెప్పిన మాటల కంటే.. వాళ్లు మనలో చూసే ప్రవర్తనను ఎక్కువగా అనుసరిస్తారు. అందుకే తల్లిదండ్రులు కూడా తమ మొబైల్ వినియోగాన్ని నియంత్రించుకోవాలి. ఫోన్‌ను పక్కన పెట్టి పిల్లలతో మాట్లాడటం, ఆడుకోవడం, సమయం గడపటం.. వంటివి చేస్తేనే పిల్లలకు కూడా మారుతారు. దీంతోపాటు పిల్లలు నిర్ణయించిన సమయానికి మాత్రమే మొబైల్ వాడినప్పుడు వారిని మెచ్చుకోవడం, ప్రోత్సహించడం కూడా చాలా అవసరం. ఇలా చేస్తే వారిలో బాధ్యతాభావం పెరుగుతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×