E-Paper
Advertisement

Hyderabad: హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద కారుకు మంటలు.. పూర్తిగా దగ్దం అయిన కారు

Hyderabad: హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద కారుకు మంటలు.. పూర్తిగా దగ్దం అయిన కారు
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఆదివారం ఓ ఎలక్ట్రిక్ కారు (EV)లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు నుండి దట్టమైన పొగలు, మంటలు ఎగిసిపడటంతో సమీపంలో ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. కారు నంబర్ ప్లేట్ (TS09GD1262) ఆకుపచ్చ రంగులో ఉండడంతో, మంటలు అంటుకున్నది ఎలక్ట్రిక్ వాహనమేనని స్పష్టమైంది.

పొగలు ఎగసిపడటం గమనించిన స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. గాంధీ నగర్ ట్రాఫిక్ పోలీసులు, దోమలగూడ పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ నియంత్రించారు. అయితే కారు అప్ప‌టికే పూర్తిగా దగ్దం కాగా, మరో కారు పాక్షికంగా దగ్ధం అయింది.

Advertisement

అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు, కేవలం వాహనానికి మాత్రమే నష్టం కలిగింది. బ్యాటరీ సమస్య వల్ల మంటలు చెలరేగాయా లేక ఇతర సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Read Also: Car Fire Accident: కారు బీభత్సం.. బైక్, ట్యాంకర్‌ను ఢీ కొని దగ్ధమైన వాహనం..

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×