E-Paper
Advertisement

TTD: శ్రీవారి లడ్డు బరువు తగ్గిందా?.. టీటీడీ క్లారిటీ..

TTD: శ్రీవారి లడ్డు బరువు తగ్గిందా?.. టీటీడీ క్లారిటీ..
Advertisement

TTD: తిరుపతి లడ్డు. అత్యంత పవిత్రం. అత్యంత రుచికరం. ఆ కలియుగ దేవుడు వెంకన్న స్వామి ఎంత ఫేమసో.. ఆయన లడ్డూ ప్రసాదం కూడా అంతే పాపులర్. ఏళ్లుగా అదే నాణ్యత. అంతే రుచి. అంతే పరిమాణం. అలాంటిది లడ్డు సైజు తగ్గిందంటూ ఇటీవల వివాదం తలెత్తడం కలకలం రేపింది. తాను తీసుకున్న లడ్డు బరువు తక్కువగా ఉందంటూ ఓ భక్తుడు టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగడం.. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో.. విషయం తీవ్ర వివాదాస్పదమైంది. తాజాగా, లడ్డు బరువు వివాదంపై టీటీడీ స్పందించింది. అసలేం జరిగిందో క్లారిటీ ఇచ్చింది.

భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సోషల్‌ మీడియాలో వస్తున్న అపోహలు నమ్మవద్దని టీటీడీ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఆలయ నిబంధనల ప్రకారం లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుంచి 180 గ్రాములు బరువు ఉంటుందని తెలిపింది. కానీ, ఇటీవల ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూలు తూకం వేయగా.. 90 నుంచి 110 గ్రాముల బరువు మాత్రమే ఉన్నాయి. ఇదే వివాదానికి కారణం. దీనిపైనే టీటీడీ క్లారిటీ ఇచ్చింది.

Advertisement

వేయింగ్‌ మిషన్‌లో సాంకేతిక సమస్య కారణంగా, కాంట్రాక్టు సిబ్బంది అవగాహన లోపం వల్లే అలా జరిగిందని టీటీడీ తెలిపింది. లడ్డూ బరువు కచ్చితంగా 160 గ్రాములు ఉంటుందని స్పష్టం చేసింది. కొన్ని వందల ఏళ్ల నుంచి రాజీ లేకుండా లడ్డూ ప్రసాదాన్ని నాణ్యతతో అందిస్తున్నామని.. లడ్డు సైజు, బరువులో కూడా ఎలాంటి తేడా లేదని వివరించింది. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది టీటీడీ.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×