// // CMR College: ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా! -->
E-Paper
Advertisement

మీ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: భాస్కర్ యాదవ్!

మీ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: భాస్కర్ యాదవ్!
Advertisement

CMR College: స్వేచ్ఛ బ్యూరో: సీఎంఆర్ కళాశాలపై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని మాజీ గ్రంధాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ సవాల్ విసిరారు. సీఎంఆర్ కళాశాల నుండి వచ్చే డ్రైనేజ్ నీరూతో సుతారిగూడ చెరువు కలుషితమయితుందని కొందరు రాజకీయ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ ఆవరణలో ఎస్ టి పి ఏర్పాటు చేసిన ప్లాంట్ ను భాస్కర్ యాదవ్ మీడియా ప్రతినిధులకు చూపించారు.

సుతారిగూడ చెరువులో..

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి సీఎంఆర్ క్యాంపస్‌లో STP ప్లాంట్ల ఏర్పాటు చేశారని వాటి నుండి వచ్చే నీరు కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చెట్లకు ఉపయోగిస్తున్నారని చెప్పారు. సుతారిగూడ చెరువులో కలిసే నీరు కండ్లకోయ గ్రామపంచాయతీ మురికి నీరు అని గతంలో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలను సమస్యల తీర్చేందుకు తన కళాశాల నుండి డ్రైనేజీ పైప్లైన్ ఏర్పాటు చేశారని చెప్పారు. మల్లారెడ్డి కుటుంబం మొత్తం ప్రజా సేవకే అంకితం అయ్యారని అన్నారు. అలాంటి మల్లారెడ్డి ప్రజలకు ఎలా హాని కలిగించే పని చేస్తారని ప్రశ్నించారు.

Advertisement

Also Read: పసిడి ప్రేమికులకు పండగే.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే!

మల్లారెడ్డి పై అసత్య ఆరోపణలు

అంతేకాకుండా మేడ్చల్లో నీటి కష్టాలు ఉంటే సీఎంఆర్ నీరు తీసుకెళ్తున్నారని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి కళాశాలలో ఎలాంటి నీటి కనెక్షన్ లేదని చెప్పారు. ఇప్పటికైనా మల్లారెడ్డి పై అసత్య ఆరోపణలు మానుకోవాలని లేని పక్షంలో భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భాస్కర్ యాదవ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు నవీన్ రెడ్డి, కళాశాల చైర్మన్ గోపాల్ రెడ్డి, విట్టల్ ,జంగారెడ్డి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also read: గుదిబండగా మారిన స్టిక్కరింగ్.. ఆటో డ్రైవర్ల బతుకు చిద్రమేనా..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×