E-Paper
Advertisement

David Warner Arrest: డ్రంకెన్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్ అరెస్ట్..PSL కు దూరం

David Warner Arrest: డ్రంకెన్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్ అరెస్ట్..PSL కు దూరం
Advertisement

David Warner Arrest:  ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వివాదంలో చిక్కుకున్నాడు. మద్యం తాగి వాహనం నడిపినందుకుగాను డేవిడ్ వార్నర్ ను సిడ్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నుంచి ఇటీవల వెకేషన్ లో భాగంగా సిడ్నీకి వచ్చాడు డేవిడ్ వార్నర్. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో దొరికిపోయి, అరెస్ట్ అయ్యాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నుంచి పూర్తిగా డేవిడ్ వార్నర్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read:  Tanveer Ahmed On MI: ఇంకా ఎన్ని అవ‌మానాలు భ‌రిస్తావ్..ముంబైని వ‌దిలి PSLలోకి వ‌చ్చేసేయ్‌.. రోహిత్ శ‌ర్మ‌పై త‌న్వీర్ సంచ‌ల‌నం

డ్రంకెన్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్ అరెస్ట్

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నుంచి వెకేషన్ లో భాగంగా ఆస్ట్రేలియాకు వెళ్ళాడు డేవిడ్ వార్నర్. ఈ క్రమంలో సిడ్నీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో అడ్డంగా దొరికిపోయాడు డేవిడ్ వార్నర్. సిడ్నీలోని మురుబ్రా ప్రాంతంలో పోలీసులకు దొరికాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కారు నడుపుతుండగా, తనిఖీలు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా బ్రీత్ టెస్ట్ లో 0.104 రీడింగ్ నమోదు అయినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా సర్కార్ చట్టాల ప్రకారం.. ఇది పరిమితి కంటే రెండు రేట్లు ఎక్కువ అని సమాచారం. ఈ క్ర‌మంలో రూల్స్ బ్రేక్ చేసిన నేపథ్యంలో వెంటనే డేవిడ్ వార్నర్ ను పోలీసులు అరెస్టు చేసి, జైలుకు తరలించారు. ఇక ఈ నెల 7వ తేదీన అంటే ఇవాళ సాయంత్రం డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో డేవిడ్ వార్నర్ హాజరు కాబోతున్నాడు. ఒకవేళ రిమాండ్ విధిస్తే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటుకు దూరం అవుతాడు.

PSL కు డేవిడ్ వార్నర్ దూరం అయ్యే ప్ర‌మాదం !

పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ తాజాగా కిడ్నీలో అరెస్ట్ అయ్యాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో అరెస్ట్ అయిన డేవిడ్ వార్నర్ కు రిమాండ్ విధించే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు నుంచి అతడు వైదొలిగే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ కొనసాగుతున్నాడు. ఈ జట్టు వరుస విజయాలతో దూసుకు వెళ్తోంది. అయితే రెండు రోజుల కిందట ఫ్యామిలీతో గడిపేందుకుగాను పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాడు డేవిడ్ వార్నర్. ఈ సందర్భంగా కక్కుర్తి పడ్డ డేవిడ్ వార్నర్, పీకల దాకా తాగాడు. ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు. ఈ క్రమంలోనే సిడ్నీ పోలీసులకు అడ్డంగా దొరికిన డేవిడ్ వార్నర్ , ఇప్పుడు చిప్పకూడు తింటున్నాడు. ఇవాళ సాయంత్రం అతడికి రిమాండ్ విధించే ప్రమాదం పొంచి ఉంది. ఇదే జరిగితే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటుకు డేవిడ్ వార్నర్ దూరం అవుతాడు.

Advertisement

 

Also Read: Shardul Thakur overthrow: శార్దూల్ ఠాకూర్ ఓవర్‌త్రో వివాదం..4 ప‌రుగులు కూడా వ‌ద‌ల‌లేదు, ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం !

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×