E-Paper
Advertisement

10x ఆప్టికల్ జూమ్, 200MP కెమెరా.. ఈ ఫోన్ మీ చేతిలో ఉంటే ఇక మీరూ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫరే!

10x ఆప్టికల్ జూమ్, 200MP కెమెరా.. ఈ ఫోన్ మీ చేతిలో ఉంటే ఇక మీరూ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫరే!
Advertisement

Oppo Find X9 Ultra: స్మార్ట్‌ఫోన్ ద్వారానే DSLR కెమెరా లెవల్ ఫొటోలు తీయడం ఒకప్పుడు అసాధ్యమే. కానీ ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రముఖ టెక్ సంస్థ ఒప్పో.. తమ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ‘Oppo Find X9 ultra’లో భారీ మార్పులు చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎక్కడో దూరంగా ఉన్న వస్తువులను కూడా కంటికి కనిపిస్తున్నంత క్లియర్‌గా క్యాప్చర్ చేసేలా దీనిని రూపొందించారు. ఈ నెల 21న మార్కెట్లోకి రాబోతున్న ఈ Oppo Find X9 ultra ద్వారా చాలామంది ప్రొఫెషనల్ ఫొటోలు తీయాలనే తమ కోరికను కచ్చితంగా నెరవేర్చుకుంటారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

ఎంత దూరమున్నా జూమ్ చేసేయడమే..

సాధారణంగా ఏదైనా జంతువునో లేక దూరంగా ఉన్న సీనరీనో ఫొటో తీయాలంటే సాధారణ ఫోన్ కెమెరాలు సరిపోవు. కానీ ఈ ఒప్పో ఫైండ్ X9 అల్ట్రాలో ఇన్‌బిల్ట్ 10x ఆప్టికల్ జూమ్ ఫీచర్‌ను ఇస్తున్నారు. దీనినే ‘టెలిఫోటో ఫ్రీడమ్’ అంటున్నారు. అంటే.. మనం ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా సరే, ఎక్స్టర్నల్ లెన్స్‌లతో పని లేకుండానే అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చు. హ్యాసెల్‌బ్లాడ్ కంపెనీతో కలిసి తయారు చేసిన ఈ కెమెరా సిస్టమ్.. సహజమైన రంగులతో ఫొటోలను చాలా రిచ్‌గా చూపిస్తుంది.

Advertisement

Also Read: 9000mAh భారీ బ్యాటరీతో రంగంలోకి OnePlus Nord 6.. ఫీచర్లు, ధర వివరాలు మీ కోసం!

ప్రొఫెషనల్స్ కోసం స్పెషల్ లెన్స్ కిట్..

ఈ ఫోన్‌లో ఉన్న కెమెరా దాదాపు అన్ని విధాలుగా సరిపోతుంది. కానీ, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌లా ఫొటోలు తీయాలి అనుకునే వారి కోసం ఒప్పో ఒక ప్రత్యేకమైన ఎక్స్టర్నల్ టెలిఫోటో కిట్‌ను కూడా తీసుకొస్తోంది. ఇది మామూలు లెన్స్ లాంటిది కాదు.. 16 రకాల హై క్వాలిటీ ఎలిమెంట్స్‌తో తయారైన ఒక కంప్లీట్ ఆప్టికల్ సిస్టమ్. ఫోన్‌లోని 3x కెమెరాతో ఇది జత కలిస్తే.. ఇక అవుట్‌పుట్ మామూలుగా ఉండదు. హ్యాసెల్‌బ్లాడ్ కెమెరా లెన్స్‌లు ఎలా ఉంటాయో.. అదే మెటల్ బాడీతో దీన్ని అంత స్ట్రాంగ్‌గా డిజైన్ చేశారు.

ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే..

Advertisement

ఇకపోతే ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. దీనిలో 50MP టెలిఫోటో కెమెరా ఉంది. ఇది 10x ఆప్టికల్ జూమ్ మాత్రమే కాదు.. గింబల్ లాంటి స్టెబిలైజేషన్ ఇస్తుంది. దీంతో నడుస్తూ ఫొటో తీసినా అస్సలు షేక్ అవ్వదు. అలాగే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను వాడారు. దీంతోపాటు రోజంతా ఛార్జింగ్ టెన్షన్ లేకుండా వాడటానికి 7050mAh భారీ బ్యాటరీని ఇస్తున్నారు. స్క్రీన్ కూడా చాలా స్మూత్‌గా ఉండేలా 144Hz రిఫ్రెష్ రేట్‌ను జోడించారు.

Also Read: వచ్చేస్తోంది Oppo F33 సిరీస్.. ఫీచర్లు, ధర వివరాలు తెలిస్తే ఇప్పుడే బుక్ చేసేసుకుంటారు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×