E-Paper
Advertisement

Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం.. కొండగట్టు సాక్షిగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం.. కొండగట్టు సాక్షిగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ జిల్లాలో చేపట్టిన పాదయాత్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పర్యటన సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి కృతజ్ఞతగా, కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గం , నూతనంగా ఎన్నికైన బీజేపీ సర్పంచులతో కలిసి బండి సంజయ్ కొండగట్టు అంజన్న సన్నిధికి పాదయాత్ర చేపట్టారు. సుమారు 40 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన వస్తామని మొక్కుకున్నామని, ఆ మొక్కు తీర్చుకోవడానికే ఈ కార్యక్రమం అని స్పష్టం చేశారు.

Advertisement

దేవాలయాల అభివృద్ధి విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొండగట్టు వంటి పుణ్యక్షేత్రాల అభివృద్ధికి బీఆర్ఎస్ సహకరించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్’ పథకం కింద నిధులు కేటాయించినా, రాష్ట్ర ప్రభుత్వం సరైన చొరవ చూపలేదని విమర్శించారు.

రాష్ట్రంలో కుల, మత విద్వేషాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే కారణమని బండి సంజయ్ మండిపడ్డారు. ముఖ్యంగా తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. నిజమైన క్రిస్టియన్లు ఎవరూ అలా మాట్లాడరని పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు పిలుపునిచ్చారు.

Also Read:ఒకే ఒక్క నిమిషంలో చక్క బెట్టేశారు, ఎంతో తెలుసా? షాకింగ్ ఫుటేజ్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×