E-Paper
Advertisement

Honda Gold Wing Bike: ఐదు దశాబ్దాలు అద్భుత ప్రయాణం, ఇప్పటికీ ఈ బైక్ స్కూటర్ హాట్ కేక్ లా అమ్ముడవుతోంది!

Honda Gold Wing Bike: ఐదు దశాబ్దాలు అద్భుత ప్రయాణం, ఇప్పటికీ ఈ బైక్ స్కూటర్ హాట్ కేక్ లా అమ్ముడవుతోంది!
Advertisement

Honda Gold Wing 2026 Bike: హోండా గోల్డ్ వింగ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విలాసవంతమైన టూరింగ్ బైక్. 2026 నాటికి ఈ బైక్, ఆధునిక టెక్నాలజీ, అసాధారణమైన సౌకర్యంతో టూరింగ్ బైక్‌ల రారాజుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది.  ఈ బైక్ తొలిసారి అక్టోబర్ 1974లో కొలోన్ మోటార్ సైకిల్ షోలో ప్రదర్శించారు. ఇప్పటి వరకు మొత్తం అమ్మకాలు 6, 40,000 కంటే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో ఎక్కువగా అమెరికాలోనే ఉన్నాయి. 1980 నుంచి 2010 వరకు ఒహియోలోని మేరీస్‌ విల్లేలో గోల్డ్ వింగ్స్‌ ను అసెంబుల్ చేశారు. అదే సమయంలో ఈ బైక్ ఉత్పత్తిని నిలిపివేశారు.  2011లో జపాన్‌లోని కుమామోటో ప్రిఫెక్చర్‌ లో ఉత్పత్తి తిరిగి ప్రారంభమైంది.

జపనీస్ ఆటోమోటివ్ టెక్నాలజీలో ల్యాండ్ మార్క్

జపాన్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ సొసైటీ 1974లో తయారు  చేసిన హోండా గోల్డ్ వింగ్ GL1000ను జపనీస్ ఆటోమోటివ్ టెక్నాలజీ 240 ల్యాండ్‌ మార్క్‌ లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2012 వరకు, హోండా GL మోడల్స్ ప్రపంచ బెస్ట్ బైకుల లిస్టులో 18 సార్లు చోటు దక్కించుకుంది. గోల్డ్ వింగ్ చాలాసార్లు డిజైన మార్పులకు గురయ్యింది. 1975లో 999 cc ఫ్లాట్ ఫోర్ ఇంజిన్‌ తో ప్రారంభమైంది. 2001 నాటికి  1,832 cc  ఫ్లాట్ సిక్స్‌ కు పెరిగింది. 2012 మోడల్‌ లో యాంటీ లాక్ బ్రేకింగ్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ అసిస్టెడ్ రివర్స్ గేర్, అడిషనల్ ఎయిర్‌ బ్యాగ్, హీటింగ్‌తో కూడిన ఫెయిరింగ్, సర్దుబాటు చేసుకునే విండ్‌ స్క్రీన్, పిలియన్ బ్యాక్‌ రెస్ట్, సాట్‌నావ్, MP3, iPod కనెక్టివిటీతో కూడిన 6 స్పీకర్ రేడియో, ఆడియో సిస్టమ్ ఉన్నాయి.

2026 హోండా గోల్డ్ వింగ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు  

Advertisement

⦿ ఇంజిన్:  2026 మోడల్ లో శక్తివంతమైన 1833cc, 6 సిలిండర్ బాక్సర్ ఇంజిన్ ఉంది. ఇది 126 PS పవర్, 170 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

⦿ ట్రాన్స్‌ మిషన్: ఇది 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ తో వస్తుంది. ఇది గేర్ షిఫ్టింగ్‌ ను చాలా మృదువుగా చేస్తుంది.

Advertisement

⦿ టెక్నాలజీ: 7-అంగుళాల TFT డిస్‌ ప్లే, వైర్‌ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ కనెక్టివిటీని కలిగి ఉంది.

⦿ భద్రత: ఇందులో ఎయిర్‌ బ్యాగ్ సిస్టమ్, డ్యూయల్ ఛానల్ ABS, స్మార్ట్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లాంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

⦿ రైడింగ్ మోడ్స్: టూర్, స్పోర్ట్, ఎకాన్, రెయిన్ అనే నాలుగు రకాల రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.

భారత్ లో హోండా గోల్డ్ వింగ్ ధర  

భారత్ లో హోండా గోల్డ్ వింగ్ ధర వేరియంట్, సిటీని బట్టి మారుతూ ఉంటుంది. ఈ బైక్ సుమారు రూ.39.90 లక్షల నుంచి రూ. 42.82 లక్షల వరకు ఉంటుంది. మార్చి 2026 నాటికి హైదరాబాద్‌లో దీని ఆన్ రోడ్ ధర సుమారు రూ. 46.86 లక్షలు గా ఉంది.

Read Also: యమహా Tmax 560 సూపర్ స్కూటర్, దీని స్పీడ్ ఎంతో తెలుసా భయ్యా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×