E-Paper
Advertisement

Gadwal Politics: షాకిచ్చిన ఫార్వర్డ్ బ్లాక్.. సీఎం రేవంత్ సమక్షంలో ‘హస్తం’ గూటికి 8 మంది కౌన్సిలర్లు

Gadwal Politics: షాకిచ్చిన ఫార్వర్డ్ బ్లాక్.. సీఎం రేవంత్ సమక్షంలో ‘హస్తం’ గూటికి 8 మంది కౌన్సిలర్లు
Advertisement

Gadwal Politics: జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) కౌన్సిలర్లు మూకుమ్మడిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకోవడంతో స్థానిక రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వడ్డేపల్లి శ్రీను నాయకత్వంలో ఈ కౌన్సిలర్లు తమ మద్దతుదారులతో కలిసి హైదరాబాద్‌కు తరలివచ్చారు.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 10 వార్డులకు గాను.. ఏకంగా 8 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ఘనవిజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే.. మున్సిపాలిటీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ చేరికతో వడ్డేపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ పూర్తి పట్టు సాధించడమే కాకుండా.. జిల్లాలో ఆ పార్టీ బలం గణనీయంగా పెరగనుంది.

Advertisement

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న నేతలు.. ఆయన సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వడ్డేపల్లి శ్రీను ఆధ్వర్యంలో తరలిన ఈ బృందానికి ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలికి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అధికార పార్టీలో చేరడం ద్వారా తమ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయవచ్చని కౌన్సిలర్లు భావిస్తున్నారు.

మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలు ఉన్న నేతలు కాంగ్రెస్‌లోకి రావడంతో గద్వాల జిల్లాలో ప్రతిపక్షాల బలం మరింత క్షీణించే అవకాశం ఉంది. ఈ పరిణామం రానున్న రోజుల్లో స్థానిక సంస్థల బలోపేతానికి తోడ్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం ఎనిమిది మంది కౌన్సిలర్లు ఒకేసారి పార్టీ మారడం అనేది జిల్లా రాజకీయాల్లో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్‌గా నిలిచింది.

Advertisement

Also Read: మున్సిపల్ ఫలితాలపై కేటీఆర్ మార్క్ విశ్లేషణ.. కాంగ్రెస్‌కు అసంతృప్తి.. బీజేపీకి సెటైర్లు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×