// // Air Fryer Omelette: ఎయిర్ ఫ్రైయర్ ఆమ్లెట్ ట్రై చేశారా? -->
E-Paper
Advertisement

Air Fryer Omelette: హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇదే.. ‘ఎయిర్ ఫ్రైయర్’ ఆమ్లెట్ ఎప్పుడైనా ట్రై చేశారా?

Air Fryer Omelette: హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇదే.. ‘ఎయిర్ ఫ్రైయర్’ ఆమ్లెట్ ఎప్పుడైనా ట్రై చేశారా?
Advertisement

Air Fryer Omelette: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కోసం ఏదైనా హెల్దీ వంటకం అది కూడా చాలా త్వరగా అయిపోవాలంటే ఈ ఎయిర్ ఫ్రైయర్ బెస్ట్ ఆప్షన్. సాధారణంగా ఆమ్లెట్ వేయాలంటే పెనం వేడి చేయడం, అది మాడిపోకుండా జాగ్రత్తగా తిరగేయడం వంటి తలపోట్లు ఉంటాయి. కానీ ఎయిర్ ఫ్రైయర్‌లో ఆ కష్టమే ఉండదు. వేడి గాలి అన్ని వైపులా సమానంగా తగలడం వల్ల ఆమ్లెట్ భలేగా ఉబ్బి, స్పాంజ్ లాంటి మెత్తదనంతో నోరూరిస్తుంది. డైట్ చేసే వారికి, తక్కువ నూనెతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోరుకుళ్లే దీనిని ఓసారి ట్రై చేయొచ్చు.

కావలసిన పదార్థాలు:

ఎయిర్ ఫ్రైయర్ ఆమ్లెట్ కోసం 2 లేదా 3 గుడ్లు, మరింత సాఫ్ట్‌నెస్ కోసం ఒక టేబుల్ స్పూన్ పాలు సిద్ధం చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా కారం తీసుకోండి. ఇక పోషకాల కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలు, క్యాప్సికమ్ లేదా పాలకూర వంటి కూరగాయ ముక్కలను సిద్ధం చేసుకోవాలి. మీకు చీజ్ ఇష్టమైతే కొద్దిగా గ్రేటెడ్ చీజ్ కూడా వాడుకోవచ్చు.

Advertisement

Also Read: పక్కా అమ్మమ్మ స్టైల్లో తలకాయ కూర.. వేడి వేడి అన్నంలోకి అదిరిపోయే టేస్ట్!

తయారీ విధానం:

ఒక గిన్నెలో గుడ్లు, పాలు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమంలో తరిగిన కూరగాయ ముక్కలను కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్‌లో పట్టేంత ఒక చిన్న కేక్ టిన్ లేదా సిలికాన్ బౌల్ తీసుకుని, దానికి కొద్దిగా నూనె లేదా వెన్న రాయండి. రెడీ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని అందులో పోసి, కావాలనుకుంటే పైన చీజ్ చల్లుకోండి. ఎయిర్ ఫ్రైయర్‌ను 180°C వద్ద సెట్ చేసి, 8 నుండి 10 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. పైన గోల్డెన్ కలర్ వచ్చి, లోపల పూర్తిగా ఉడికిన తర్వాత బయటకు తీస్తే.. వేడివేడి ఫ్లఫ్ఫీ ఆమ్లెట్ రెడీ అయినట్టే.

Advertisement

Also Read: మొదటిసారి చేసేవారు కూడా అదిరిపోయేలా చేసే గోంగూర పులిహోర రెసిపీ!

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×