E-Paper
Advertisement

Shaking Hands: వణుకుతున్న చేతులు, తిమ్మిర్లు పట్టే వేళ్లు.. మీ శరీరం ఏం చెబుతుందో తెలుసా ?

Shaking Hands: వణుకుతున్న చేతులు, తిమ్మిర్లు పట్టే వేళ్లు.. మీ శరీరం ఏం చెబుతుందో తెలుసా ?
Advertisement

Shaking  Hands: మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఖరీదైన పరీక్షలు అవసరం లేదు. కొన్నిసార్లు మన చేతులను గమనిస్తే చాలు. అరచేతుల రంగు, వేళ్ల ఆకృతి, గోళ్లపై మచ్చలు వంటివి శరీరంలోని అంతర్గత అనారోగ్య సమస్యలకు అద్దం పడతాయి. మెడిటల్  చేతులను “ఆరోగ్య కిటికీలు” అని కూడా అంటారు. మీ చేతులు మీ ఆరోగ్యం గురించి చెబుతున్న 7 ముఖ్యమైన సంకేతాలను గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

మన శరీరంలో ఏదైనా అనారోగ్యం తలెత్తినప్పుడు, అది బయటపడకముందే కొన్ని సూచనలను ఇస్తుంది. ముఖ్యంగా మన చేతులు ,గోళ్లు మన అంతర్గత అవయవాల పని తీరును ప్రతిబింబిస్తాయి. గుండె జబ్బుల నుంచి కాలేయ సమస్యల వరకు, థైరాయిడ్ నుంచి రక్త హీనత వరకు అనేక ఆరోగ్య పరిస్థితులను చేతుల ద్వారా గుర్తించవచ్చు. మీ చేతుల్లో కనిపించే.. మార్పులను నిర్లక్ష్యం చేయకుండా.. సరైన సమయంలో స్పందించడం ద్వారా పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.

Advertisement

చేతులు వెల్లడించే 7 ఆరోగ్య సమస్యలు:

1. క్లబ్బింగ్ ఫింగర్స్ (వేళ్లు ఉబ్బడం) – ఊపిరితిత్తుల సమస్యలు:
మీ వేలి కొనలు వెడల్పుగా మారి.. గోళ్లు వంగిపోయి “డ్రమ్ స్టిక్” లా కనిపిస్తుంటే దానిని ‘క్లబ్బింగ్’ అంటారు. ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటానికి సంకేతం. ఇది ప్రధానంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు లేదా దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులకు సూచన కావచ్చు.

Advertisement

2. ఎర్రటి అరచేతులు – కాలేయ వ్యాధి:
అరచేతులు అకస్మాత్తుగా ఎర్రగా మారితే.. అది కాలేయ వ్యాధికి సంకేతం కావచ్చు. కాలేయం సరిగ్గా పని చేయనప్పుడు శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, రక్త నాళాలు వెడల్పు అవుతాయి. దీని వల్ల అర చేతులు ఎర్రగా కనిపిస్తాయి. గర్భిణీలో ఇది సాధారణం కావొచ్చు కానీ.. ఇతరులు జాగ్రత్త వహించాలి.

3. వణుకుతున్న చేతులు – పార్కిన్సన్ లేదా థైరాయిడ్:
చేతులు విపరీతంగా వణుకుతుంటే.. అది కేవలం ఒత్తిడి వల్ల మాత్రమే కాక పోవచ్చు. ఇది పార్కిన్సన్ వ్యాధికి ప్రాథమిక సంకేతం.. కావచ్చు. ఒకవేళ చేతులు వణకడంతో పాటు నిద్ర లేమి, బరువు తగ్గడం వంటివి ఉంటే అది ‘హైపర్ థైరాయిడిజం’ (థైరాయిడ్ గ్రంధి అతిగా పనిచేయడం) కావచ్చు.

4. గోళ్ల రంగు మారడం – కిడ్నీ, రక్తహీనత:
గోళ్లు తెల్లగా మారితే అది రక్తహీనత లేదా ఐరన్ లోపానికి సంకేతం. ఒక వేళ గోళ్లు సగం తెల్లగా, సగం బ్రౌన్ కలర్‌లో ఉంటే అది కిడ్నీ వ్యాధులను సూచిస్తుంది. గోళ్లపై పసుపు రంగు కనిపిస్తే.. అది ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా కాలేయ సమస్య కావచ్చు.

5. వేళ్లలో తిమ్మిర్లు – కార్పల్ టన్నెల్ సిండ్రోమ్:
బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలులో తరచుగా తిమ్మిర్లు లేదా మంటగా అనిపిస్తే.. అది ‘కార్పల్ టన్నెల్ సిండ్రోమ్’ కావచ్చు. ఇది చేతిలోని నరాల మీద ఒత్తిడి పడటం వల్ల వస్తుంది. అలాగే విటమిన్ B12 లోపం ఉన్నవారిలో కూడా చేతులు తిమ్మిర్లు రావడం సహజం.

6. పట్టు కోల్పోవడం – గుండె ఆరోగ్యం:
వస్తువులను పట్టుకోవడంలో బలం లేకపోవడం లేదా హ్యాండ్‌ షేక్ చేసేటప్పుడు.. పట్టు బలహీనంగా ఉండటం మీ గుండె ఆరోగ్యం బాలేదని చెప్పడానికి ఒక గుర్తు. బల హీనమైన ‘గ్రిప్ స్ట్రెంత్’ భవిష్యత్తులో గుండె పోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశాలను సూచిస్తుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.

7. వేళ్ల కీళ్ల వాపు – రుమటాయిడ్ ఆర్థరైటిస్:
వేళ్ల కీళ్లు ఉబ్బిపోయి, నొప్పిగా ఉంటే.. అది కీళ్ల వాతానికి సంకేతం. ముఖ్యంగా.. ఉదయం నిద్ర లేవగానే వేళ్లు బిగుసుకుపోయినట్లు అనిపిస్తే.. అది శరీరంలో ఇన్ఫ్లమేషన్ (వాపు) ఎక్కువగా ఉందని అర్థం.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×