E-Paper
Advertisement

Hyderabad Major Fire: మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన ఫర్నిచర్ షాపు, ఏం జరిగింది?

Hyderabad Major Fire: మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన ఫర్నిచర్ షాపు, ఏం జరిగింది?
Advertisement

Hyderabad Major Fire:  ఎండకాలం రావడంతో అగ్నిప్రమాదాలు జోరందుకున్నాయి.  హైదరాబాద్ సిటీలో వారానికి రెండు లేదా మూడు అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని మియాపూర్‌ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ ఫర్నీచర్ షాపు తగలబడింది. చందానగర్ జాతీయ రహదారిపై ఉన్న అను ఫర్నిచర్ షోరూమ్‌లో ఈ ఘటన జరిగింది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దాదాపు నాలుగు గంటల తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అసలేం జరిగింది?

అర్ధరాత్రి మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం

Advertisement

హైదరాబాద్‌లోని మియాపూర్‌ ఏరియాలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఏం జరిగిందో తెలీదుగానీ అను ఫర్నీచర్ షాపుని మంటలు చుట్టేశాయి. అర్ధరాత్రి ఘటన జరగడంతో అప్పటికే షాపులో మూసి వుంది. ఐదు అంతస్తులను మంటలు చుట్టుముట్టాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి.

ప్రమాదం గురించి ఓనర్‌కి తెలియగానే ఆయన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చేసరికి మంటలు షాపును చుట్టేశాయి. ఆరు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో షోరూమ్‌‌లోని ఫర్నిచర్ అంతా కాలి బుడిదైంది. భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.

Advertisement

తగలబడిన అను ఫర్నిచర్ షాపు.. భారీగా ఆస్తి నష్టం

షోరూమ్ జాతీయ రహదారిపై పక్కనే ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి పోలీసులు నానా ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనపై బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి మాట్లాడారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం రాగానే వెంటనే ఫైర్ సిబ్బందిని అలర్ట్ చేశామన్నారు. వారు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారని సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు.

చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశామన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ప్రాపర్టీ డ్యామేజ్ బాగానే జరిగిందన్నారు షాపు ఓనర్. వేరే భవనాలకు డ్యామేజ్ కాకుండా చర్యలు చేసినట్టు తెలిపారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ: ఫిరాయింపుల చరిత్ర మీ నాయన సృష్టించిందే.. కేటీఆర్‌పై ఎంపీ చామల ఫైర్

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×