E-Paper
Advertisement

Ban On SRH: SRHపై 5 ఏళ్ల‌ పాటు నిషేధం..? షాక్ లో కావ్య పాప‌

Ban On SRH: SRHపై 5 ఏళ్ల‌ పాటు నిషేధం..? షాక్ లో కావ్య పాప‌
Advertisement

Ban On SRH: ఐపీఎల్ టోర్నమెంట్ లో అద్భుతంగా దూసుకు వెళ్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad) ఇప్పుడు ప్రమాదంలో పడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పై ఐదు సంవత్సరాల పాటు బ్యాన్ విధించాలని సోషల్ మీడియాలో అభిమానులు గోల పెడుతున్నారు. కావ్య పాప తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయం కారణంగా ఈ గొడవ తెరపైకి వచ్చింది. ఇంగ్లాండ్ నిర్వహిస్తున్న ది హ‌డ్రెండ్ వేలంలో ( The Hundred 2026 Auction ) పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ( abrar ahmed )ను కావ్య పాప ఏరి కోరి కొనుగోలు చేసింది. దీంతో భారతీయ అభిమానులు ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. కావ్య పాప జట్టు స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్ పైన ఐదు సంవత్సరాల పాటు బ్యాన్ విధించాలని బీసీసీఐని కోరుతున్నారు జనాలు. పాకిస్తానోడిని దూరం కొడుతుంటే.. కావ్య మారన్ ( Kavya Maran) మాత్రం డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడం ఏంటని నిలదీస్తున్నారు. దీనిపై వెంటనే బీసీసీఐ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు అభిమానులు.

Also Read: T20 World Cup 2026: కొంప‌ముంచిన‌ గిల్ సెల‌క్ష‌న్…గంభీర్, అగార్క‌ర్ మ‌ధ్య గొడ‌వ‌లు, టీమిండియాలో ప్ర‌కంప‌న‌లు !

SRHపై 5 ఏళ్ల‌ పాటు నిషేధం..?

Advertisement

లండన్ వేదికగా ది హ‌డ్రెండ్ లీగ్ కు ( The Hundred 2026 Auction ) సంబంధించిన వేలం తొలిసారిగా నిర్వహించారు. ఇందులో కావ్య పాప కూడా పాల్గొన్నారు. ఈ టోర్నమెంటులో సన్రైజర్స్ లీడ్స్ పేరుతో కావ్య పాపకు సంబంధించిన ఒక జట్టు బరిలోకి దిగుతోంది. అయితే ఈ జట్టులో ప్లేయర్లను కొనుగోలు చేయడంలో భాగంగా పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను 2.34 కోట్లకు కొనుగోలు చేశారు కావ్య మారన్. ఇండియాకు సంబంధించిన ఏ ప్రాంచైజీ కూడా పాకిస్తాన్ ప్లేయర్లను కొనుగోలు చేయలేదు. కానీ కావ్య పాప మాత్రం ఎగబడి ఈ పాకిస్తానోడిని కొనుగోలు చేసింది. దీంతో కావ్య పాప పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పై బ్యాన్ విధించాలని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏకంగా ఐదు సంవత్సరాలపాటు ఐపిఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడకుండా చేయాలని బీసీసీఐని కోరుతున్నారు.

2008 నుంచి పాకిస్తాన్ క్రికెటర్లపై నిషేధం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో మొదట పాకిస్తాన్ క్రికెటర్లు ఆడారన్న సంగతి తెలిసిందే. అయితే 2008 సంవత్సరంలో ముంబైలో ఉగ్రదాడులు జరిగాయి. దీంతో ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య బంధాలు తెగిపోయాయి. ఈ ఎఫెక్ట్ పాకిస్తాన్ క్రికెటర్ల పైన పడింది. దీంతో అప్పటి నుంచి పాకిస్తాన్ ప్లేయర్లు ఐపిఎల్ ఆడడం లేదు. ఈ మేరకు బీసీసీఐ అప్పట్లోనే బ్యాన్ విధించింది. అలాగే ద్వైపాక్షిక సిరీస్ లు కూడా ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో భాగంగా ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. అది కూడా తటస్థ వేదికల్లో మాత్రమే మ్యాచులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కావ్య పాప తీసుకున్న నిర్ణయం పైన భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×