E-Paper
Advertisement

Travis Head: ఐపీఎల్ ఇక చాలు..PSLలో ఆడ‌తా, కాటేర‌మ్మ కొడుకు హెడ్ ప్ర‌క‌ట‌న !

Travis Head: ఐపీఎల్ ఇక చాలు..PSLలో ఆడ‌తా, కాటేర‌మ్మ కొడుకు హెడ్ ప్ర‌క‌ట‌న !
Advertisement

Travis Head: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} కి పోటీగా ప్రారంభమైన పాకిస్తాన్ సూపర్ లీగ్ {PSL} కి ఆశించిన మేర ప్రేక్షకాధరణ లభించలేదు. కానీ పాకిస్తాన్ ఆటగాళ్లు, అభిమానులు మాత్రం పాకిస్తాన్ సూపర్ లీగ్ ని తరచుగా ఐపీఎల్ తో పోలుస్తూ ఉంటారు. తమదే గొప్ప లీగ్ అన్నట్లు వాదిస్తారు. ఇది విన్న భారత క్రీడాభిమానులు నవ్వుకుంటూ ఉంటారు. ఐపీఎల్ ఆర్థికంగా, ప్రజాదారణలో ఎంతో ముందుంది. ఇది బిలియన్ డాలర్ల విలువతో ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్ లలో ఒకటిగా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆదాయం 12 బిలియన్ల విలువతో.. వార్షికంగా $ 1.2 బిలియన్ల ఆదాయంతో ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రీడా లీగులలో ఒకటి.

Also Read: Sunil Gavaskar: హ‌ర్షిత్ రాణా, ప్రసిద్ ల‌ను ఆడిస్తే, 500ల టార్గెట్ పెట్టినా ఓడిపోతాం

Advertisement

ప్రపంచంలోని టాప్ స్టార్ ఆటగాళ్లు ఈ లీగ్ లో పాల్గొంటారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ ని ఐపీఎల్ తో పోలిస్తే.. పీఎస్ఎల్ ఆదాయం కేవలం $ 100 మిలియన్లు. ఈ పీఎస్ఎల్ కేవలం పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ అభిమానులలో మాత్రమే ప్రజాదారణ పొందింది. ఈ లీగ్ విదేశీ ఆటగాళ్ల లభ్యతలో సమస్యలు, భద్రతా సమస్యలు ఎదుర్కొంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి చాలామంది విదేశీ ఆటగాళ్లు ప్రాధాన్యత ఇస్తారు. అయితే తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని కాదని ఓ ఆస్ట్రేలియా క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ కి ప్రాధాన్యత ఇస్తా అంటున్నాడు. అతడు మరెవరో కాదు ట్రావిస్ హెడ్.

 

ఐపీఎల్ చాలు.. పీఎస్ఎల్ ఆడతా:

Advertisement

ఐపీఎల్ – పిఎస్ఎల్ ప్రేమికుల మధ్య చర్చకు తెరలేపేలా ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ హెడ్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐపీఎల్ – పిఎస్ఎల్ లీగ్ లపై హెడ్ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా ఈ వార్త వైరల్ అవుతుంది. ఇంతకీ హెడ్ ఏమన్నాడంటే.. ” పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లో నిజమైన ప్రతిభ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాత్రం ఎక్కువగా డబ్బు ఆధారంగా నడుస్తుంది. ఈ క్రమంలో 2038లో నేను ఐపిఎల్ ని వదిలి పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లో చేరతాను” అన్నాడు. దీంతో హెడ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై క్రీడాభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇక హెడ్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లోను, ఐపీఎల్ లోను కీలక ఆటగాడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

 

ఐపీఎల్ లో హెడ్ అద్భుత ఆటగాడు:

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో హెడ్ ఓ అద్భుత ఆటగాడు. ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ ఐన హెడ్ తన అద్భుత బ్యాటింగ్ తో ఐపిఎల్ ప్రాంచైజీలకు తలనొప్పిగా మారాడు. 2025 ఐపీఎల్ సీజన్ లో తన అద్భుతమైన బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. పవర్ ప్లే లో అతడి దూకుడు, బౌండరీల వర్షం, భారీ సిక్స్ లతో అతడు ఆరంభంలోనే జట్టుకు మెరుగైన స్థితిని అందించేందుకు కృషి చేశాడు.

Also Read: Mysterious Lady: అందమైన భామతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇంతకీ ఎవరీ అందాల తార?

కానీ ఆ తర్వాత విఫలమయ్యాడు. గత సీజన్లో 13 మ్యాచ్లలో 374 పరుగులు మాత్రమే చేశాడు. 2024 ఐపీఎల్ లో 15 మ్యాచ్లలో 567 పరుగులు చేశాడు. కానీ గత సీజన్ లో మాత్రం పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలో హెడ్ ని ముంబైకి అప్పగించి.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మని సన్రైజర్స్ లోకి తెచ్చుకోవాలని యాజమాన్యం యోచిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×