E-Paper
Advertisement

Varanasi Glimpse : అవతార్: ఫైర్ అండ్ యాష్ తో వారణాసి గ్లింప్స్ రిలీజ్ ..

Varanasi Glimpse : అవతార్: ఫైర్ అండ్ యాష్ తో వారణాసి గ్లింప్స్ రిలీజ్ ..
Advertisement

Varanasi Glimpse: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి(S.S.Rajamouli) ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)తో వారణాసి(Varanasi) అనే సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి నిర్వహించిన గ్లోబ్ ట్రాటర్ వేడుకకు ఏకంగా ఇంటర్నేషనల్ మీడియా కూడా హాజరు కావడంతో సినిమా పట్ల మంచి అంచనాలే పెరిగాయి. అలాగే చిత్ర బృందంతో ఇంటర్నేషనల్ మీడియా ప్రత్యేకంగా ఇంటర్వ్యూలను కూడా నిర్వహించారు.

జేమ్స్ కామెరూన్ తో జక్కన్న చర్చలు..

ఇదిలా ఉండగా తాజాగా వారణాసి సినిమాకి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా నుంచి త్వరలోనే గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా గ్లింప్ అవతార్ 3 సినిమాతో పాటు థియేటర్లలో ప్రసారం కానున్నట్టు సమాచారం. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవతార్ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవతార్ ప్రపంచం నుంచి అవతార్ ఫైర్ అండ్ యాష్ అంటూ మూడో భాగం డిసెంబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

అవతార్ 3 తో వారణాసి గ్లింప్స్..

Advertisement

ఇలా ఈ సినిమా డిసెంబర్ 19వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో తెలుగులో కూడా ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి . ఈ క్రమంలోనే రాజమౌళి అవతార్ టీంతో కోలాబరేట్ అవుతూ ఈ సినిమా విడుదల సమయంలోనే వారణాసి గ్లింప్స్ కూడా విడుదల చేసే విధంగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అవతార్ 3 తో పాటు వారణాసి గ్లింప్ రాబోతుందని తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు సినిమాకు ఏ స్థాయిలో ప్రమోషన్లు అవసరమో అదే విధానంగా ఈ సినిమాని తనదైన శైలిలోనే ప్రమోట్ చేస్తున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

వారణాసి షూటింగ్ కు బ్రేక్…

Advertisement

మరి వారణాసి గ్లింప్స్ గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం ఈ వార్తలపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ వీడియో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ వీడియో కాస్త సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగుకు చిన్న బ్రేక్ ఏర్పడిందని తెలుస్తోంది. ఇటీవల ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి కావడంతో మహేష్ బాబు కూడా బ్రేక్ తీసుకొని వెకేషన్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు.

Also Read: 1 Year for Pushpa 2: పుష్ప 2 స్పెషల్ షో.. థియేటర్ దగ్గర మళ్లీ గందరగోళం

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×