E-Paper
Advertisement

Ind vs Eng 2nd Semi-Final: సూర్య‌ సీన్ రిపీట్, అక్ష‌ర్ కిరాక్ క్యాచ్‌…ఫైన‌ల్స్ లో అడుగుపెట్టిన టీమిండియా

Ind vs Eng 2nd Semi-Final: సూర్య‌ సీన్ రిపీట్, అక్ష‌ర్ కిరాక్ క్యాచ్‌…ఫైన‌ల్స్ లో అడుగుపెట్టిన టీమిండియా
Advertisement

Ind vs Eng 2nd Semi-Final:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ రెండో సెమీ ఫైనల్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ రెండో సెమీ ఫైనల్ లో టీమిండియా, ఇంగ్లాండ్ రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో నువ్వా నేనా అన్న రేంజిలో రెండు జట్లు ఢీ కొట్టుకున్నాయి. కానీ చివరికి ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియానే విజయం సాధించింది. ఈ రెండో సెమీ ఫైనల్ లో టీమిండియా, నిర్ణీత 20 ఓవ‌ర్లు ఆడింది. ఈ త‌రుణంలోనే 7 వికెట్లు న‌ష్ట‌పోయి, 253 ప‌రుగులు సాధించింది టీమిండియా. ఇక ఈ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఇంగ్లాండ్ పోరాడి ఓడింది. టీమిండియా విధించిన 254 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో 20 ఓవర్లు ఆడింది ఇంగ్లాండ్. ఈ క్రమంలో ఏడు వికెట్లు నష్టపోయిన ఇంగ్లాండు కేవలం 246 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో టీమిండియా ఏడు పరుగులతో విజయం సాధించి, వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. అటు ఇంగ్లాండ్ ఇంటిదారి పట్టింది. దీంతో మార్చి ఎనిమిదో తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ ఉండనుంది.

Also Read: SA vs NZ 1st Semi-Final: టీమిండియా కోసం జై షా కుట్ర‌లు…ద‌క్షిణాఫ్రికాను కావాల‌నే ఇంటికి పంపార‌ని ట్రోల్స్ !

బాపు ఖ‌త‌ర్నాక్ క్యాచ్..ఫైన‌ల్స్ లో అడుగుపెట్టిన టీమిండియా

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ రెండో సెమీఫైనల్ లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో టీమిండియా బాపుగా పిలుచుకునే అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్ లు అందుకున్నాడు. ముఖ్యంగా విల్ జాక్స్ కొట్టిన బంతిని బౌండరీ గేటు దగ్గర అందుకొని… శివం దూబేకు అందించాడు. ఇక అప్పటి నుంచి మ్యాచ్ మొత్తం టర్న్ అయింది. లేకపోయి ఉంటే వీల్ జాక్స్, జాకబ్ బెతెల్ ఇద్దరు ఇంగ్లాండ్ ను గెలిపించేవాళ్లు. కానీ బాపు అందుకున్న క్యాచ్ ల కారణంగా టీమిండియా విజయం సాధించింది. అటు ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ డేంజర్ ఆటగాడు జాకబ్ బెతెల్ ఇండియాకు చుక్కలు చూపించాడు. ఒకానొక సమయంలో ఇండియా ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ హార్దిక్ పాండ్యా అతన్ని రనౌట్ చేశాడు. అప్పటికి 48 బంతుల్లో 105 పరుగులు సాధించాడు జాకబ్ బెతెల్. ఇందులో ఏడు సిక్సర్లు అలాగే 8 బౌండరీలు ఉన్నాయి. 218 స్ట్రైక్ రేటుతో ఇండియాకు నరకం చూపించాడు. కానీ టీమిండియా బౌలర్లు చివరలో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో… ఇంగ్లాండ్ ఓటమిపాలైంది. ఇక ఫైనల్స్ లో న్యూజిలాండ్ తో టీమ్ ఇండియా తలపడనుంది.

 

సంజు శాంసన్ ఊచకోత ఇన్నింగ్స్

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం టీం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. అయినప్పటికీ మరో ఓపెనర్ సంజు శాంసన్ ఇరగదీశాడు. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ.. 89 పరుగులతో రాణించాడు. అటు ఇషాన్ కిషన్ తన వంతు సాయంగా 18 బంతుల్లో 39 పరుగులతో రెచ్చిపోయాడు. అటు మరో ఆల్ రౌండర్ శివం దుబే 25 బంతుల్లో 43 పరుగులు చేసి దుమ్ము లేపాడు. హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ముఖ్యంగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ చేసిన 21 పరుగులు మ్యాచ్ కు కీలకంగా మారాయి.

Also Read: Pak Players: ఆయ‌న‌వి ఒంటెద్దు పోక‌డులు, కీలు బొమ్మ‌లాగా ఆడుకున్నాడు..కోచ్ పై ఫిర్యాదు చేసిన‌ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×