E-Paper
Advertisement

West Bengal Governor: వెస్ట్ బెంగాల్ గవర్నర్ రాజీనామా.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిగ్ ట్విస్ట్!

West Bengal Governor: వెస్ట్ బెంగాల్ గవర్నర్ రాజీనామా.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిగ్ ట్విస్ట్!
Advertisement

West Bengal Governor: ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌ కీలక పరిణామాలు చేసుకుంటున్నాయి. వెస్ట్ బెంగాల్ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ రాజీనామా చేశారు. గవర్నర్ రాజీనామా చేసినట్లు వెస్ట్ బెంగాల్ లోక్‌భవన్‌ వెల్లడించింది. ఆనంద బోస్‌ తన రాజీనామాకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. గురువారం ఉదయమే ఆనంద బోస్‌ తన రాజీనామాను రాష్ట్రపతికి పంపించినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా ఆనంద బోస్ నవంబర్‌ 17, 2022న బాధ్యతలు చేపట్టారు. దాదాపు మూడున్నరేళ్లు పాటు ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పనిచేశారు. నూతన గవర్నర్‌గా ఆర్‌ఎన్‌ రవి రానున్నట్లు కేంద్ర హోంశాఖ నుంచి సమాచారం అందిందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు.

కొత్త గవర్నర్ గా ఆర్ఎన్ రవి

సీఎ మమతా బెనర్జీతో విభేదాలతో వార్తల్లో నిలిచిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాజీనామా చేశారు. బోస్ స్థానంలో ప్రస్తుతం తమిళనాడుకు గవర్నర్‌గా ఉన్న ఆర్‌ఎన్ రవి పశ్చిమ బెంగాల్ కు గవర్నర్ గా నియమితులవుతారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. నియామకానికి ముందు కేంద్రం తనను సంప్రదించలేదని, కేంద్రం తీసుకున్న నిర్ణయం ” ఏకపక్ష నిర్ణయమని ఆరోపించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య సంప్రదాయాలను, రాష్ట్రాల గౌరవాన్ని దెబ్బతీస్తుందని ఆమె అన్నారు.

Advertisement

అయితే ఆనంద బోస్ రాజీనామా పునర్వ్యవస్థీకరణలో భాగమని, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా కూడా రాజీనామా చేశారని కేంద్ర వర్గాలు అంటున్నారు. అనేక రాష్ట్రాలలో గవర్నర్లను మార్చమచ్చని, కొత్త గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల జాబితాను రాష్ట్రపతి భవన్ త్వరలో విడుదల చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.

Also Read:  ఈడీ దాడులు.. భగ్గుమన్న మమతా బెనర్జీ.. దర్యాప్తు అడ్డుకుంటారా? మమతా తీరుపై ఈడీ విస్మయం!

కేంద్ర హోంమంత్రి ఒత్తిడి!

Advertisement

గవర్నర్ రాజీనామా తనను షాక్ కు గురి చేసిందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఆయన రాజీనామా వెనుక గల కారణాలు ప్రస్తుతానికి తనకు తెలియవన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చడానికి గవర్నర్ పై కేంద్ర హోంమంత్రి నుంచి కొంత ఒత్తిడి ఉందని తెలిసి తాను ఆశ్చర్యపోనని మమతా బెనర్జీ ఎక్స్ పోస్టు పెట్టారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×