E-Paper
Advertisement

Virosh Wedding: విరోష్ జంటకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు.. ఫొటోలు వైరల్!

Virosh Wedding: విరోష్ జంటకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు.. ఫొటోలు వైరల్!
Advertisement

Virosh Wedding: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. పెళ్లి అనంతరం ఈ జంట చేసిన ప్రతి పని వైరల్ అవుతూనే ఉంది. బుధవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలెందరో హాజరై, ఈ నూతన జంటను ఆశీర్వదించారు. అంతకు ముందు ఈ వేడుకకు రావాలని ప్రముఖులందరినీ ఈ జంట ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి స్వయంగా రష్మిక మందన్నా వెళ్లడంతో, అక్కడామెకు తెలుగు సాంప్రదాయం చూపించి.. చీర పెట్టి మరీ సత్కరించారు. ఇక వారి రిసెప్షన్‌కు హాజరు కాలేకపోయిన సీఎం రేవంత్ రెడ్డి.. స్వయంగా వారి ఫ్యామిలీని కలిసి, నూతన జంటకు అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

Also Read- Vijay and Trisha: విజయ్-త్రిష అడ్డంగా దొరికేశారు.. ఒకే కారులో పెళ్లికి.. వీడియో వైరల్!

నూతన జంటకు సీఎం అభినందనలు

Advertisement

విశేషం ఏమిటంటే.. విజయ్ దేవరకొండ నివాసానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం. రిసెప్షన్ కార్యక్రమం సమయంలో ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గురువారం ప్రత్యేకంగా విజయ్ దేవరకొండ నివాసానికి వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా ముచ్చటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తమ నివాసానికి వచ్చి అభినందించడంతో విజయ్ ఫ్యామిలీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ, రష్మిక సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read- Virosh wedding: విరోష్ వెడ్డింగ్ ఖర్చు ఎంతో తెలుసా..పెళ్ళి ఖర్చు మొత్తం తనదేనా?

మీ ప్రేమకు కృతజ్ఞతలు సార్

Advertisement

‘‘గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సాయంత్రం మా ఇంటికి విచ్చేసి, మా వివాహ వేడుకలో మమ్మల్ని ఆశీర్వదించడం నా హృదయాన్ని తాకింది. వారు ఎల్లప్పుడూ చూపే ఈ ప్రేమ, అనురాగాలకు నేను ఎంతో కృతజ్ఞుడను’’ అని విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తన సంతోషాన్ని తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. విజయ్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ.. ‘మమ్మల్ని ఆశీర్వదించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు!’ అని పోస్ట్ చేశారు. ఇక ఈ ఫొటోలను చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. బ్యూటీఫుల్ మూమెంట్.. మీ జంటకు శుభాకాంక్షలు అంటూ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Read- Avika Gor: తల్లి కాబోతున్న చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్…వీడియో వైరల్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×