E-Paper
Advertisement

Ind vs sa : ఈ దద్దమ్మ గంభీర్ వల్ల 7 సిరీస్ లు ఓడిన టీమిండియా..

Ind vs sa : ఈ దద్దమ్మ గంభీర్ వల్ల 7 సిరీస్ లు ఓడిన టీమిండియా..
Advertisement

Ind vs sa :భారత క్రికెట్ చరిత్రలో కోల్‌కతా టెస్ట్ మ్యాచ్‌ను అభిమానులు అందరూ త‌ప్ప‌క‌ గుర్తుంచుకుంటారు. సౌతాఫ్రికా జట్టు భారత్‌ను తొలి టెస్ట్‌లో 30 పరుగుల తేడాతో ఓడించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. దీంతో భారత్ ఈ సిరీస్‌ను గెలిచే అవకాశం లేదు. చివరి మ్యాచ్ గెలిచినా కేవలం డ్రా మాత్రమే చేయగలదు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడానికి కేవలం 124 పరుగుల లక్ష్యం మాత్రమే ఉన్నా, టీమిండియా కేవలం 93 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఘోర పరాజయం కారణంగా భారత్ ఖాతాలో మూడు అనవసరమైన రికార్డులు వచ్చి చేరాయి. దీనికంత‌టికి కార‌ణం కోచ్ గౌత‌మ్ గంభీర్ అని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

Also Read : Ganguly: మీరు అడిగిన పిచ్ ఇచ్చారు.. కానీ ఎందుకు గెలవలేదు రా..!

గంభీర్ వల్ల 7 సిరీస్ లు ఓడిన టీమిండియా..!

Advertisement

ముఖ్యంగా గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, భారత జట్టు అనేక సిరీస్‌లను కోల్పోయింది. శ్రీలంకతో వన్డే సిరీస్, న్యూజిలాండ్‌తో హోమ్ టెస్ట్ సిరీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వంటివి కోల్పోయింది. అయినప్పటికీ T20 సిరీస్‌లో మాత్రం గంభీర్ నేతృత్వంలో టీమిండియా ఓడిపోలేదు. గంభీర్ కోచ్‌గా టీమిండియా ఓడిపోయిన సిరీస్‌లు ఒక‌సారి ప‌రిశీలించిన‌ట్ట‌యితే.. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో27 సంవ‌త్స‌రాల త‌రువాత‌ టీమిండియా ఓడిపోయింది. అలాగే న్యూజిలాండ్‌తో హోమ్ టెస్ట్ సిరీస్‌లో 36 సంవ‌త్స‌రాల త‌రువాత‌ వైట్‌వాష్ అయింది. దాదాపు ప‌ది సంవ‌త్స‌రాల త‌రువాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. 12 సంవ‌త్స‌రాల త‌రువాత న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ లాస్, అలాగే ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా ఓటమి పాలైంది. అదేవిధంగా గంభీర్ కోచింగ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను కూడా భారత్ కోల్పోయింది. 15 సంవ‌త్స‌రాల త‌రువాత తాజాగా సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ మ్యాచ్ ను కోల్పోయింది టీమిండియా.

సోష‌ల్ మీడియాలో గంభీర్ పై సంచ‌ల‌న కామెంట్స్

దీంతో సోష‌ల్ మీడియాలో గంభీర్ ను ఏకి పారేస్తున్నారు. ఈ ద‌ద్ద‌మ్మ వ‌ల్ల ఏకంగా 7 సిరీస్ లు కోల్పోయింది అంటూ కామెంట్స్ చేయ‌డం విశేషం.టీమిండియా 124 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక‌పోయింది. ఈ విష‌యం పై టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిష‌బ్ పంత్ ఓట‌మి పై స్పందించాడు. “ఒత్తిడిలో తాము చిత్తు అయ్యామ‌ని పేర్కొన్నాడు. కాస్త మెరుగ్గా ఆడి ఉంటే ల‌క్ష్యాన్ని ఛేదించే వాళ్ల‌మ‌ని త‌మ వైఫ‌ల్యాన్నీ అంగీక‌రించాడు. 124 ప‌రుగుల టార్గెట్ ను మేము ఛేదించాల్సింది. కానీ రెండో ఇన్నింగ్స్ మాపై ఒత్తిడి బాగా పెరిగింది. మేము దానిని అధిగ‌మించ‌లేక‌పోయాం. తెంబా, బాష్.. అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. త‌మ భాగ‌స్వామ్యంతో మ్యాచ్ ను త‌మ వైపున‌కు తిప్పేసుకున్నారు. వాస్త‌వానికి ఇలాంటి పిచ్ పై 120 ప‌రుగులు చేయ‌డం అంత తేలికైన విష‌యం ఏమి కాదు. రెండో టెస్ట్ కి తిరిగి పుంజుకుంటామ‌నే న‌మ్మ‌కం ఉంది “అని పేర్కొన్నాడు. ముఖ్యంగా గంభీర్ పై సోష‌ల్ మీడియాలో కామెంట్స్ మాత్రం వైర‌ల్ అవుతున్నాయి. గంభీర్ రాజీనామా చేయాల‌ని కొంద‌రూ కామెంట్స్ చేయ‌డం విశేషం.

Advertisement

Also Read : Vaibhav Suryavanshi: 200 పరుగులు చేసినా, మా అయ్య ఊరుకోడు

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×