E-Paper
Advertisement

OTT Movie : అరుదైన పాండాను కిడ్నాప్ కి అంతర్జాతీయ ముఠా ప్లాన్… సైలెంట్ గా ఓటీటీలోకి జాకీ చాన్ మూవీ

OTT Movie : అరుదైన పాండాను కిడ్నాప్ కి అంతర్జాతీయ ముఠా ప్లాన్… సైలెంట్ గా ఓటీటీలోకి జాకీ చాన్ మూవీ
Advertisement

OTT Movie : జాకీ చాన్ నటించిన ‘పాండా ప్లాన్’ ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చింది. గత ఏడాది చైనాలో విడుదలైన ఈ యాక్షన్ కామెడీ కథ ఒక అరుదైన పాండా పిల్లను రక్షించడం చుట్టూ తిరుగుతుంది. చివరిసారిగా కరాటే కిడ్: లెజెండ్స్‌లో కనిపించిన జాకీ చాన్, ఈ సినిమాలో మరో సారి తన ప్రతిభని చాటారు. 71 సంవత్సరాల వయసులో కూడా స్టంట్స్ చేస్తూ, తనకి తానే సాటి అని నిరూపించుకుంటున్నాడు. జాకీ చాన్ అభిమానులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. చిన్న పిల్లలతో కలసి, ఫ్యామిలితో సహా ఈ వీకెండ్ ను ఈ యాక్షన్ హీరో సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే..

లయన్స్‌గేట్ ప్లేలో స్ట్రీమింగ్

“పాండా ప్లాన్” (Panda Plan) అనేది యాక్షన్ స్టార్ జాకీ చాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ చిత్రం. ఈ సినిమా ల్యూ జియాంగ్ దర్శకత్వంలో తెరకెక్కింది. 2024 అక్టోబర్ 1న చైనాలో థియేటర్లలో కి వచ్చిన ఈ సినిమా, 2025 నవంబర్ 14 నుంచి ఇండియాలో లయన్స్‌గేట్ ప్లే (Lionsgate play) లో డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చింది.

కథ ఏమిటంటే

Advertisement

ఈ సినిమాలో జాకీ చాన్ ఒక మారుమూల ద్వీపంలోని నోహ్ అనే జంతువుల జూను సందర్శించి, అక్కడ అంతరించిపోతున్న ఒక అరుదైన ‘హు హు’ అనే బుల్లి పాండా పిల్లను దత్తత తీసుకుంటాడు. హుహు అనే ఈ జంతువు కంటి చుట్టూ ఒకే ఒక నల్లటి వలయం కలిగి ఉండటం వల్ల ఇంటర్నెట్‌లో ప్రసిద్ధి చెందింది. ఈ పాండా పిల్ల యాంటిక్యూస్ (పురాతన వస్తువులు)ను గుర్తించగల ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇదే సమయంలో ఒక పెద్ద వ్యాపార వేత్త , పాండాను కిడ్నాప్ చేయడానికి అంతర్జాతీయ నేరాల సిండికేట్‌కు భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో పరిస్థితులు మలుపు తిరుగుతాయి.

Read Also : కిట్టి పార్టీలో ఖిలాడీ లేడీస్… కితకితలు పెట్టే పంజాబీ క్రైమ్ కామెడీ డ్రామా

దాదాపు 100 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ. 800 కోట్లకు పైగా) డబ్బు ఆఫర్ కోసం, కిరాయి గూండాలు పాండా పిల్లను పట్టుకోవడానికి విపరీతంగా ప్రయత్నిస్తారు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన జాకీ చాన్, పాండా పర్యవేక్షకురాలు సు జియావోజుతో కలిసి ఆ సిండికేట్ ప్లాన్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. చివరికి జాకీ చాన్ ఆ బుల్లి పాండాను కాపాడతాడా ? అది నెరస్థుల చేతిలోకి వెళ్లిపోతుందా ? అనే విషయాలను, ఈ సినిమాను ఈ యాక్షన్ కామెడీ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Advertisement

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×