E-Paper
Advertisement

Plants: శీతాకాలంలో మొక్కల సంరక్షణకు ఈ జాగ్రత్తలు మస్ట్.. లేదంటే ఎదుగుదలపై తీవ్ర ప్రభావం!

Plants: శీతాకాలంలో మొక్కల సంరక్షణకు ఈ జాగ్రత్తలు మస్ట్.. లేదంటే ఎదుగుదలపై తీవ్ర ప్రభావం!
Advertisement

Plants: గ్రామం నుంచి నగరవాసుల వరకు మొక్కలు పెంచడం ఇప్పుడు ఫేవరెట్ హాబీగా మారిపోయింది. ఇంట్లో మొక్కలు పెంచుకుంటే.. మనసు ప్రశాంతంగానూ ఉంటుంది. అంతేకాదు.. ఇంటి అలంకరణలోనూ ఇండోర్ ప్లాంట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, మొక్కలు నాటడం వరకు బాగానే ఉన్నా.. వాటి సంరక్షణ విషయంలో మాత్రం కొద్దిమంది అజాగ్రత్తగా ఉంటారు. అంతేకాదు మొక్కల్ని కాలానికి తగట్టు సంరక్షించుకోవడం కూడా తెలిసుండాలి. ముఖ్యంగా శీతాకాలంలో చలి నుంచి మొక్కలను ఎలా కాపాడుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

* కాలంతో వచ్చే మార్పులు మనుషులనే కాదు మొక్కలనూ ఇబ్బంది పెడతాయని విషయం గుర్తుంచుకోవాలి. వాటిని గుర్తించి సమస్యను నివారిడంచం మీద దృష్టి పెడితే.. ఇండోర్ ప్లాంట్స్ చూడటానికి అందంగానే కాదే.. అవి ఆరోగ్యంగానూ ఉంటాయి.
* ముఖ్యంగా శీతాకాలంలో గులాబీ, జినియా, బెగోనియా, మందారంతో పాటు టొమాటో, దోస వంటి మొక్కల్లో బూడిద తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని నివారించడానికి ఒక టీస్పూన్‌ బేకింగ్‌ సోడా, అర టీస్పూన్‌ డిష్‌ సోప్, లీటరు నీరు కలిపి వారానికి రెండు సార్లు మొక్కలపై పిచికారి చేస్తే సరిపోతుంది.
* చాలామంది ఇప్పుడు ఇంట్లోనూ కూరగాయలు పండిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇంటితోటలో పెంచే ఆకుకూరలతోపాటు ముల్లంగి, క్యారెట్ వంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా చలికాలంలో ఆకుతొలుచు పురుగు కూరగాయలను ఆశిస్తుంది. ఇండోర్‌ ప్లాంట్స్‌ కూడా వీటి ప్రభావానికి గురవుతాయి. కాబట్టి.. వెల్లుల్లి కషాయం చల్లడం ద్వారా దీన్ని నివారించవచ్చు.

Advertisement

Read Also: ఇంట్లోనే మినీ వ్యాయామశాల.. బాడీ ఫిట్‌నెస్‌పై దిగులేలా!

చలి తీవ్రత పెరిగితే:

మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేవంటూ కొన్ని మొక్కల్ని ఇంటిలోపల పెడుతుంటాం. ముఖ్యంగా టొమాటో, మెంతికూర, గులాబీ, మల్లె.. వంటి వాటిని ఏసీ వార్మ్‌మోడ్, హీటర్‌ ఉన్న గదుల్లో కానీ, తక్కువ వెంటిలేషన్‌ ఉన్నా, గాలి ప్రసరించనంత దగ్గరగా పెట్టినా ఈ ఎర్రనల్లి సమస్య వస్తుంది. ఈ సమస్యను తగ్గించాలంటే.. మొక్కల అడుగు భాగంలో ఉండే ట్రేలో గులకరాళ్లు వేయాలి. నీటిని గాల్లోకి స్ప్రే చేసి ఆ వాతావరణంలో తేమ పెంచాలి. అలాగే ఆకుల వెనక భాగంలో ఉన్న గుడ్లను.. ఆకు తీసేసి పారేయడం ద్వారా లేదా గోరువెచ్చని నీళ్లల్లో కాస్త లిక్విడ్‌ సోప్, వేపనూనె కలిపి స్ప్రే చేయడం ద్వారా పోగొట్టవచ్చు. దీంతో ఇంటితోట ఆరోగ్యంగా ఎదుగుతుంది.

Advertisement

Read Also: ఉదయాన్నే పొట్టలో ఏదోఒకటని తోసేస్తున్నారా?.. బ్రేక్‌ఫాస్ట్‌పై హార్వర్డ్ నిపుణుల సలహా ఇదే!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×