E-Paper
Advertisement

IND vs SA 1st test: 5 వికెట్లతో రెచ్చిపోయిన బుమ్రా.. సౌతాఫ్రికా ఆలౌట్.. స్కోర్ ఎంతంటే

IND vs SA 1st test: 5 వికెట్లతో రెచ్చిపోయిన బుమ్రా.. సౌతాఫ్రికా ఆలౌట్.. స్కోర్ ఎంతంటే
Advertisement

IND vs SA 1st test: భారత్ – సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ సమరం నేటి నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు తొలి టెస్ట్ {IND vs SA 1st test}  ప్రారంభమైంది. మొదటి టెస్ట్ లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మొదట బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా జట్టుకి ఆది నుండే ఎదురుదెబ్బ తగిలింది.

Also Read: Temba Bavuma – Pant: తెంబా బ‌వుమా ఓ మ‌ర‌గుజ్జుగాడు.. బాడీ షేమింగ్ కామెంట్స్ చేసిన పంత్‌

5 వికెట్లతో రెచ్చిపోయిన బుమ్రా:

Advertisement

టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. బుమ్రా దెబ్బకు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో మార్క్రమ్ {31} టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక మల్డర్ 24, రికెల్టన్ 23, జోర్జి 24, వెర్రెన్నె 16, స్టబ్స్ 15, బవుమా 3 పరుగులు చేశారు. ఇక మిగతా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరరో 2 వికెట్లు తీశారు. ఇక అక్షర పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు. కాగా మరి కాసేపట్లో టీమ్ ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ని ప్రారంభించనుంది.

సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ప్రారంభించగానే ఓపెనర్లు మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్ ని బూమ్రా బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ 10.3 ఓవర్ లో 23 పరుగులు చేసిన రికెల్టన్ ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన బవుమా ఆచితూచి ఆడుతుండగా.. మరో ఎండ్ లో ధాటిగా ఆడుతున్న మార్క్రమ్ ని బుమ్రా పెవిలియన్ చేర్చాడు. ఇన్నింగ్స్ 12.1 వ ఓవర్ లో 31 పరుగులు చేసిన మార్క్రమ్.. వికెట్ కీపర్ పంత్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా ని కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు.

Advertisement

Also Read: PAK VS SL: పాకిస్తాన్ లో శ్రీలంక ప్లేయ‌ర్ల‌కు VVIP సెక్యూరిటీ.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేయలేకపోయారు:

అనంతరం 24 పరుగులు చేసిన ముల్డర్ ని కుల్దీప్ యాదవ్ ఎల్బిడబ్ల్యూ చేశాడు. అలా సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చారు. ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేయలేకపోయారు. కాగా బుమ్రా తన అద్భుత బౌలింగ్ తో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసి.. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ని పడగొట్టాడు. తొలి రోజు కేవలం 55 ఓవర్ల పాటు ఆడిన సఫారీలు.. ఇలా తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. ఇక టెస్టులలో బుమ్రా 5 వికెట్లు పడగొట్టడం ఇది 16వసారి.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×