// // Maganti Sunitha - రౌడీలతో రిగ్గింగ్.. నీదీ ఓ గెలుపేనా? ఓటమిపై సునీత రియాక్షన్ -->
E-Paper
Advertisement

Maganti Sunitha: రౌడీలతో రిగ్గింగ్.. నీదీ ఓ గెలుపేనా? ఓటమిపై సునీత రియాక్షన్

Maganti Sunitha: రౌడీలతో రిగ్గింగ్.. నీదీ ఓ గెలుపేనా? ఓటమిపై సునీత రియాక్షన్
Advertisement

Maganti Sunitha: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల ఫలితంపై బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత స్పందించారు. కాంగ్రెస్ విజయం ప్రకటించిన నేపథ్యంలో ఆమె చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ ఎన్నికలు రౌడీ రాజ్యంలో జరిగాయని, ప్రతిపక్షం అడ్డదారులు తొక్కుతూ అన్యాయంగా గెలిచిందని సునీత వ్యాఖ్యానించారు.

జూబ్లిహిల్స్‌లో నైతిక విజయం తనదే అని మాగంటి సునీత అన్నారు. అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో రైడీలతో భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. రౌడీల రాజ్యం మొదలైంది. ఎన్నికలు జరిగిన రోజున రిగ్గింలు, గొడవలు చేశారు. నాలుగు, ఐదు పార్టీలు కలిసి గెలిచారు. అది గెలుపు కాదు.. బీఆర్ఎస్ పార్టీ అనే ప్రతి ఒక్క నాయకుడిని బెదిరించారని సునీత పెర్కొన్నారు. నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీనే గెలించింది. మాగంటి సునీతనే గెలిచింది అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకీ ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల కమిషన్ అట్టర్ ప్లాప్.. ఆడ బిడ్డను ఎంత హింస పెట్టారో అంత పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. తనను ఓడించేందుకు అందరూ ఏకమయ్యారంటూ మాగంటి సునీత వ్యాఖ్యానించారు.

Advertisement

నేను మాట్లాడినా, నవ్వినా తప్పే అన్నట్టు చేశారని ఆరోపణలు చేశారు. దీన్ని గెలుపు అనరు.. అఢ్డదారిలో గెలిచారు. నైతికంగా నాదే గెలుపు అన్నారు. అన్ని పార్టీలు కలిస్తే.. వాళ్లకు వచ్చిన మెజార్టీ.. మేము సింగిల్‌గా పోటీ చేశాం. కౌంటర్ సెంటర్లో కూడా ర్యాగింగ్ చేశారని సునీత ఆరోపించారు. వాళ్లు ఇచ్చిన చీరలు కట్టుకున్నట్లుగా మాట్లాడారు. గోపీనాథ్ ఉన్నప్పుడు ఎలకల్లా ఉన్న వారంతా.. ఇప్పుడు రౌడీయిజం చెలాయిస్తున్నారని సునీత ఆరోపించారు.

కాగా.. స్వర్గీయ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి ఆశయాలను నెరవేర్చేందుకు, జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా నిలబడేందుకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నాపై నమ్మకంతో నాకు ఓటేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఎంతగానో కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రతీ ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ.. ఈ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ అదే అంకితభావంతో ప్రజా సేవలో ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను అంటూ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×