E-Paper
Advertisement

Dinner at 7 PM daily: రాత్రి 7 గంటల్లోపు డిన్నర్ చేస్తే ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే అస్సలు మిస్ చేయరు!

Dinner at 7 PM daily: రాత్రి 7 గంటల్లోపు డిన్నర్ చేస్తే ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే అస్సలు మిస్ చేయరు!
Advertisement

Dinner at 7 PM daily: సంపూర్ణ ఆరోగ్యం కోసం పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమని మనందరికీ తెలుసు. కానీ, సరైన సమయంలో ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలామంది ఆరోగ్య నిపుణులు రాత్రి 7 గంటల్లోపు భోజనం చేస్తే.. ఆరోగ్యానికి చాలా మంచిదని సిఫార్సు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 7 గంటల్లోపు భోజనం చేయడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.

మెరుగైన జీర్ణవ్యవస్థ:

సాయంత్రం 7 గంటల్లోపు భోజనం చేయడం వల్ల ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేసుకోవడానికి తగినంత సమయం ఉంటుంది. అలాగే భోజనానికి, నిద్రపోవడానిక మధ్య ఎక్కువ సమయం ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆహారాన్ని సమర్థవంతంగా జీర్ణం చేసుకోగలదు. దీంతో అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు దరిచేరవు.

బరువు తగ్గవచ్చు:

Advertisement

రాత్రి 7 గంటల్లోపు భోజనం ముగించడం వల్ల మన శరీరం కేలరీలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. ఈ పద్ధతి బరువు పెరగడాన్ని నియంత్రించగలదు. దీంతో అధిక బరువు ముప్పును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గుండె జబ్బుల ప్రమాదం తగ్గడం:

సాయంత్రం ముందుగా భోజనం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఓ గంట అటూ ఇటూ అయితే పర్లేదు కానీ..
9 గంటల తర్వాత భోజనం తీసుకుంటే.. స్ట్రోక్, గుండె సమస్యలు వచ్చే అవకాశం నిపుణులు ఉందని చెబుతున్నారు. రాత్రి 7 గంటల్లోపు తింటామో.. అప్పుడు 28 శాతం గుండె సమస్యల నుంచి తప్పించుకున్నవారవుతామని సూచిస్తున్నారు.

గుండెల్లో మంట తగ్గడం:

Advertisement

రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కొంతమంది వెంటనే నిద్రకు ఉపక్రమిస్తుంటారు. ఇలా చేయడం వల్ల నిద్రలో యాసిడ్ రిఫ్లక్స్ (గుండెల్లో మంట) సంభవించవచ్చు. కాబట్టి.. రాత్రి 7 గంటల్లోపు భోజనం ముగించేస్తే.. పడుకోవడానికి కనీసం 3 గంటల సమయం దొరుకుతుంది. దీంతో గ్యాస్, అసిడిటీ వంటివి ఉండవు. కడుపు తేలిగ్గా మారి మంచి నిద్ర మీ సొంతమవుతుంది.

నాణ్యమైన నిద్ర:

సాయంత్రం త్వరగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ నిద్రాభంగం కలిగించకుండా.. గాఢమైన నిద్రకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అదే విధంగా.. ఎవరైతే పడుకోవడానికి కనీసం 3 నుంచి 4 గంటల ముందుగా డిన్నర్‌ని పూర్తిచేస్తారో.. వారికి ప్రశాంతమైన నిద్ర సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

జీవక్రియ ఆరోగ్యం మెరుగు:

సరైన సమయంలో భోజనం చేయడం వల్ల జీవక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయాం చేయడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. రాత్రి త్వరగా భోజనం చేయడం వల్ల జీవక్రియ ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు చేకూరుతాయి.

చక్కెరస్థాయి అదుపులో:

రాత్రి గడిచేకొద్దీ.. మన శరీరంలో ఇన్సులిన్ ప్రభావం తగ్గుతుంది. దీంతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే రాత్రి భోజనం త్వరగా తినేస్తే.. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచి అలవాటు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

అధిక రక్తపోటు నియంత్రణ:

పడుకోవడానికి, రాత్రి భోజనానికి మధ్య రెండు గంటల గ్యాప్ కచ్చితంగా ఉండాలి. లేట్ నైట్స్ భోజనం చేసేవారు హైపర్‌టెన్షన్ తో బాధపడే అవకాశం ఉంది. రాత్రి త్వరగా భోజనం చేయడం వల్ల అధిక రక్తపోటు నియంత్రించవచ్చు. లేదంటే ఒత్తిడి పెరిగి, గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×