E-Paper
Advertisement

ఇంస్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ విమర్శలపై స్పందించిన అనన్య… అందుకే పెట్టానంటూ క్లారిటీ!

ఇంస్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ విమర్శలపై స్పందించిన అనన్య… అందుకే పెట్టానంటూ క్లారిటీ!
Advertisement

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ఇలా అనన్య సినిమాలలో వెబ్ సిరిస్ లలో నటిస్తూ డబ్బు సంపాదించడమే కాకుండా యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇటీవల కాలంలో సబ్ స్క్రిప్షన్(Subscription)పేరుతో పెద్ద ఎత్తున ఆదాయం పొందుతున్నారు. ఇలా ప్రతినెలా 399 సబ్ స్క్రిప్షన్ ద్వారా పలువురు నటీనటులు, ఇన్ఫ్లుయెన్సర్లు లక్షల్లో ఆదాయం అందుకుంటున్నారు.

సబ్ స్క్రిప్షన్ పై అనన్య క్లారిటీ..

ఈ నేపథ్యంలోనే సబ్ స్క్రిప్షన్ గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనగా మారింది.. ఇప్పటికే యాంకర్ విష్ణు ప్రియ (Vishnu Priya)ఇలా సబ్ స్క్రిప్షన్ ద్వారా ప్రతినెల 10 లక్షల కు పైగా ఆదాయం పొందుతున్నారు. ఇక ఈమె ఈ ఇంస్టాగ్రామ్ ద్వారా బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ ఆదాయం పొందుతున్న నేపథ్యంలో ఈమెపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఈమె తరహాలోని మరో నటి అనన్య నాగళ్ళ (Ananya Nagalla)కూడా ఇలా సబ్ స్క్రిప్షన్ ద్వారా మంచిగా సంపాదిస్తున్నారు అంటూ ఈమె పట్ల కూడా వార్తలు హల్చల్ చేశాయి.

నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవటం..

Advertisement

ఇలా అనన్య సబ్ స్క్రిప్షన్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈమె స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోని ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ నిజానికి తాను ఈ సబ్ స్క్రిప్షన్ పెట్టినప్పుడు ఒక కారణంతోనే పెట్టానని తెలిపారు. ప్రతిరోజు మీతో కాంటాక్ట్ లో ఉండాలి, మీ అందరితో కనెక్ట్ అవ్వాలని అలాగే మనమందరం కలిసి జీవితంలో గ్రో అవ్వాలి అంటే నాకు తెలిసిన యూస్ ఫల్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్ చేసిన డైలీ రొటీన్స్ మీతో షేర్ చేయాలని భావించాను. అలాగే మీ నుంచి కూడా కొన్ని మంచి విషయాలు నేర్చుకోవాలని అనుకున్నాను.

?igsh=NzBnc2x4amZtM3d1

Advertisement

ఇలా ఈ ఇంస్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ ద్వారా వచ్చే డబ్బుతో ప్రతి నెల ఈ సొసైటీకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోనే ఏర్పాటు చేశానని దీని గురించి తాను గత ఏడాది ఒక వీడియో కూడా చేశాను. ఇది ఇప్పుడు ప్రారంభించింది కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. అలాగే గత 15 రోజులుగా ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నప్పటికీ నాకు కుదరకపోవడం వల్ల ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను అంటూ తాజాగా అనన్య ఇంస్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ గురించి క్లారిటీ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈమె సబ్ స్క్రిప్షన్ వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలియచేయడంతో కొందరు ఈమెకు మద్దతుగా కామెంట్లు చేయగా, మరికొందరు విమర్శలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై చిరంజీవి అప్డేట్.. క్షేమంగా ఉన్నాడంటూ పోస్ట్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×