// // Youtube Pixel 10 Discount| పిక్సెల్ 10 సిరీస్ ఫోన్ల‌పై 40 శాతం డిస్కౌంట్.. కానీ చిన్న కండిషన్ పెట్టిన గూగుల్ -->
E-Paper
Advertisement

Youtube Pixel 10 Discount: పిక్సెల్ 10 సిరీస్ ఫోన్ల‌పై 40 శాతం డిస్కౌంట్.. కానీ చిన్న కండిషన్ పెట్టిన గూగుల్

Youtube Pixel 10 Discount: పిక్సెల్ 10 సిరీస్ ఫోన్ల‌పై 40 శాతం డిస్కౌంట్.. కానీ చిన్న కండిషన్ పెట్టిన గూగుల్
Advertisement

Youtube Pixel 10 Discount| 2025 గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ విడుదల చేసింది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ చాలా ఖరీదు. ఈ కారణంగా చాలా మంది మిడ్ రేంజ బడ్జెట్ యూజర్లు పిక్సెల్ ఫోన్స్ కొనుగోలు చేయాలంటే వారికి సాధ్యం కాదు. అయితే గూగుల్ మిడ్ రేంజ్ యూజర్లందరికీ అందుబాటులోకి పిక్సెల్ ఫోన్స్ తీసుకురావాలని ఒక విన్నూత్న ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కారణంగా కొత్త పిక్సెల్ 10 సిరీస్ ఫోన్ల ధరపై 40 శాతం తగ్గింపు లభిస్తుంది. కానీ ఈ ఆఫర్ లో ఫోన్ కొనాలంటే గూగుల్ ఒక కండిషన్ పెట్టింది. ఇదేదో కష్టమైన కండీషన్ చాలా సులభం.

యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లకు స్పెషల్ ఆఫర్

యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు గూగుల్ భారీ బెనిఫిట్ ప్రకటించింది. ఎలిజిబుల్ యూజర్లు పిక్సెల్ 10 సిరీస్ ఫోన్‌లపై 40 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఇది ఈ ఏడాది అతి పెద్ద పిక్సెల్ ఆఫర్‌లలో ఒకటి. ఈ డీల్ లిమిటెడ్ టైమ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

పిక్సెల్ 10 డిస్కౌంట్ ఎలా పని చేస్తుంది?

Advertisement

గూగుల్ ఈ ఆఫర్‌ను అధికారిక ఈమెయిల్ ద్వారా షేర్ చేస్తోంది. ఈమెయిల్‌లో ప్రతి యూజర్‌కు యూనిక్ డిస్కౌంట్ కోడ్ ఉంటుంది. చెక్‌అవుట్ సమయంలో ఈ కోడ్ యాప్లై చేయాలి. కోడ్ లేకుండా డిస్కౌంట్ రాదు.

ఈ ఆఫర్‌కు ఎవరు ఎలిజిబుల్?

ఈ ఆఫర్ పెయిడ్ యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే. ఫ్రీ యూట్యూబ్ యూజర్లకు ఈ డీల్ లభించదు. అమెరికాలోని చాలా మంది యూజర్లకు ఈమెయిల్ వచ్చింది. ఇతర దేశాలకు కూడా త్వరలోనే గూగుల్ ఈ ఆఫర్ ను విస్తరించనుంది.

ఏ పిక్సెల్ 10 మోడల్స్‌కు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది?

Advertisement

40 శాతం డిస్కౌంట్ పూర్తి పిక్సెల్ 10 సిరీస్‌కు వర్తిస్తుంది. పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL వంటివి ఉన్నాయి. ఏ స్టోరేజ్ లేదా కలర్ వేరియంట్ అయినా ఎంచుకోవచ్చు. ట్రేడ్-ఇన్ బెనిఫిట్స్ ముందు ఈ డిస్కౌంట్ అప్లై అవుతుంది.

అమెరికాలో డిస్కౌంట్ తర్వాత ధరలు ఎలా ఉంటాయి?

ఈ ఆఫర్‌తో పిక్సెల్ 10 ధరలు చాలా తగ్గుతాయి. పిక్సెల్ 10 సుమారు 359 డాలర్లు (భారత కెరెన్సీలో దాదాపు రూ.32,500)కు వస్తుంది. పిక్సెల్ 10 ప్రో 449 డాలర్లు (దాదాపు రూ.40,500). పిక్సెల్ 10 ప్రో XL సుమారు 719 డాలర్లు (దాదాపు రూ.65,000). ఈ ధరలన్నీ 40 డిస్కౌంట్ తరువాత లెక్కించినవి.

ట్రేడ్-ఇన్ ఆఫర్‌తో అదనపు సేవింగ్స్ ?

గూగుల్ ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లను కూడా జత చేయవచ్చు. ట్రేడ్-ఇన్ వాల్యూ డివైస్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. రెండింటినీ కలిపితే ధర మరింత తగ్గుతుంది. కొందరు చాలా తక్కువ ధరకు ఫోన్ పొందవచ్చు.

ఆఫర్ వాలిడిటీ

ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ మాత్రమే. డిస్కౌంట్ డిసెంబర్ 31 వరకు వాలిడ్. గూగుల్ ఈ డెడ్‌లైన్ తర్వాత ఎక్స్‌టెండ్ చేయకపోవచ్చు. మీకు ఈ మెయిల్ వస్తే త్వరగా పిక్సెల్ సిరీస్ ఫోన్స్ సొంతం చేసుకోండి.

ఇంతకుముందు పిక్సెల్ డిస్కౌంట్స్‌తో సంబంధం లేదు

ఇంతకుముందు గూగుల్ ప్లే పాయింట్స్ మెంబర్లకు పిక్సెల్ 10 ప్రోపై 200 డాలర్లు తగ్గింపు ఇచ్చింది. కానీ ఈ కొత్త డీల్ మరింత డైరెక్ట్ సేవింగ్స్ ఇస్తుంది.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

ఈ డీల్ ఎందుకు ముఖ్యం?

యూట్యూబ్ ప్రీమియం యూజర్లు ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ పే చేస్తున్నారు. ఈ ఆఫర్ అదనపు వాల్యూ యాడ్ చేస్తుంది. పిక్సెల్ ఫోన్‌లు మరింత అఫోర్డబుల్ అవుతాయి. హాలిడే సీజన్‌లో అప్‌గ్రేడ్‌లను ప్రోత్సహిస్తుంది.

భారతీయులు వేచి ఉండాల్సిందే

ప్రస్తుతం ఈ డీల్ అమెరికా వరకే పరిమితం. ఇండియాలో గూగుల్ కన్ఫర్మ్ చేయలేదు. ఇండియన్ యూట్యూబ్ ప్రీమియం యూజర్లు అప్‌డేట్స్ కోసం వేచి ఉండాలి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×