E-Paper
Advertisement

YouTube వాడుతున్నారా? ఇలా చేస్తే డేటా అయిపోదు.. రోజంతా హ్యాపీగా చూడొచ్చు!

YouTube వాడుతున్నారా? ఇలా చేస్తే డేటా అయిపోదు.. రోజంతా హ్యాపీగా చూడొచ్చు!
Advertisement

YouTube Data Saver: స్మార్ట్ ఫోన్ వాడే ప్రతీ ఒక్కరూ రోజులో కనీసం ఒక్కసారైనా యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటారు. ఖాళీ సమయం దొరికినా, ఏదైనా నేర్చుకోవాలన్నా యూట్యూబ్ వైపే మొగ్గు చూపుతుంటారు. అయితే యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నప్పుడు మొబైల్ డేటా నీళ్లలా కరిగిపోతుంటుంది. రోజుకు వచ్చే 1.5 GB లేదా 2 GB డేటా క్షణాల్లో ఆవిరైపోతోందన్న అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వారికోసం యూట్యూబ్‌ ఒక అద్భుతమైన హిడెన్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజూ భారీ ఎత్తున డేటాను ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటి? ఎలా ఎనేబుల్ చేసుకోవాలి? దాని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏవి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

డేటా కరగడానికి కారణాలు..

యూట్యూబ్‌లో ఏదైనా వీడియో ప్లే చేసినప్పుడు అది బై-డిఫాల్ట్‌గా ‘ఆటో’ (Auto) మోడ్‌లో ఉంటుంది. అంటే మీ ఇంటర్నెట్ స్పీడ్‌ని బట్టి వీడియో క్వాలిటీ దానంతట అదే మారిపోతుంది. మీ ఏరియాలో 5G లేదా మంచి స్పీడ్ ఉన్న 4G నెట్‌వర్క్ ఉంటే యూట్యూబ్ ఆటోమేటిక్‌గా వీడియోను HD లేదా 4K క్వాలిటీలో ప్లే చేస్తుంది. దీనివల్ల వీడియో చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ మొబైల్ డేటా మాత్రం చాలా వేగంగా ఖర్చయిపోతుంది.

డేటా కాపాడే ‘హిడెన్ ఫీచర్’

Advertisement

యూట్యూబ్ యాప్‌లోనే ‘డేటా సేవర్’ (Data Saver) అనే ఆప్షన్ ఉంటుంది. చాలా మంది దీని గురించి పట్టించుకోరు. ఈ ఫీచర్‌ను ఆన్ చేయడం ద్వారా వీడియో క్వాలిటీని కాస్త తగ్గించి డేటా వినియోగాన్ని భారీగా తగ్గించుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ లో ఉండే చిన్న స్క్రీన్‌పై వీడియోలు చూసేటప్పుడు క్వాలిటీలో వచ్చే మార్పులో పెద్దగా తేడా తెలియదు. కాబట్టి డేటా ఆదా అవ్వడంతో పాటు ఎక్కువ వీడియోలు చూసేందుకు వీలు కలుగుతుంది.

ఎలా యాక్టివేట్ చేయాలి?

డేటా సేవర్ ఫీచర్ ను ఆన్ చేయడానికి యూట్యూబ్ యాప్ లో కొన్ని స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ముందుగా యాప్ లోకి వెళ్లి ప్రొఫెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అనంతరం సెట్టింగ్స్ లోకి వెళ్లి.. వీడియో క్వాలిటి ప్రిఫరెన్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. అనంతరం అక్కడ ఉన్న డేటా సేవర్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకొని ఎనేబుల్ చేయండి. ఇలా చేస్తే యూట్యూబ్ లో వీడియోలు చూసిన ప్రతీసారి మీ డేటా చాలా పొదుపుగా ఖర్చవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Also Read: క్రోమా ఫ్లాష్ సేల్ ధమాకా.. గూగుల్ పిక్సెల్ 10 మెుబైల్‌పై.. ఏకంగా రూ.14,091 తగ్గింపు!

మరో సూపర్ ఫీచర్..

డేటాను పొదుపు చేసే మరో సీక్రేట్ ఫీచర్ సైతం యూట్యూబ్ లో ఉంది. అదే ‘డేటా లిమిట్’ ఆప్షన్. దీని ద్వారా మీరు ఎంత డేటాను యూట్యూబ్ పై ఖర్చు చేయాలో ముందుగానే డిసైడ్ చేయవచ్చు. ఇందుకోసం యూట్యూబ్ సెట్టింగ్స్ లో జనరల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ ‘మెుబైల్ డేటా యూసేజ్ లిమిట్’ అనే ఫీచర్ ను ఎంచుకోవాలి. దాన్ని క్లిక్ చేసి నిర్దేశిత డేటా (500 MB) ఎంచుకుంటే.. ఆ పరిమితి దాటి పోయాక యాప్ మీకు అలర్ట్ ఇస్తుంది. కాబట్టి ఈ ఫీచర్ ను ఉపయోగించి.. రోజూవారీ డేటా మెుత్తం యూట్యూబ్ కే అయిపోకుండా అడ్డుకోవచ్చు.

Also Read: ఎయిర్‌టెల్ ఫన్ ప్లాన్.. నెట్ ఫ్లిక్స్, యాపిల్ టీవీ, హాట్‌స్టార్ ఫ్రీ.. 3.3TB డేటాతో మీ ఇష్టం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×