// // Apple iOS 27: ఐఓఎస్ 27 టాప్ ఫీచర్లు ఇవే.. ఐఫోన్ లుక్ మారిపోద్ది! -->
E-Paper
Advertisement

ఐఫోన్‌లో ఇకపై బిల్స్ స్ప్లిట్ చేయడం చాలా ఈజీ.. iOS 27 క్రేజీ ఫీచర్లు చూశారా?

ఐఫోన్‌లో ఇకపై బిల్స్ స్ప్లిట్ చేయడం చాలా ఈజీ.. iOS 27 క్రేజీ ఫీచర్లు చూశారా?
Advertisement

Apple iOS 27: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ తమ సరికొత్త iOS 27 అప్డేట్‌తో ఐఫోన్ యూజర్లను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. దీనిలో మరింత తెలివైన Siriతో పాటు Maps, Wallet, Music వంటి చాలా యాప్స్‌లో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చారు. ప్రస్తుతం డెవలపర్ బీటా వెర్షన్‌లో ఉన్న ఈ అప్డేట్.. జులైలో పబ్లిక్ బీటాగా అందుబాటులోకి వచ్చి, సెప్టెంబర్ కల్లా అందరికీ రిలీజ్ కానుంది. ఈ కొత్త అప్డేట్‌లో వచ్చే ముఖ్యమైన మార్పులేవో ఇప్పుడు చూసేద్దాం..

మ్యాప్స్‌లో సరికొత్త లోకం:

ఈ సరికొత్త అప్డేట్‌తో యాపిల్ మ్యాప్స్ వాడకం సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఎంపిక చేసిన కొన్ని నగరాల వైమానిక దృశ్యాలను చాలా స్పష్టంగా, విజువల్స్ అద్భుతంగా ఉండేలా డిజైన్ చేశారు. దీంతో పాటు అమెరికాలోని యూజర్ల కోసం Local Lists అనే ఫీచర్‌ను తీసుకొచ్చారు. తద్వారా చుట్టుపక్కల ఉండే మంచి రెస్టారెంట్లు, పిల్లలతో కలిసి వెళ్లదగ్గ ప్రదేశాల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

లోకేషన్ షేరింగ్‌పై పట్టు:

Advertisement

ఇకపై మన లోకేషన్‌ను ఇతరులతో పంచుకోవడం మరింత సులువవుతుంది. ఇప్పటివరకు ఉన్న పరిమిత సమయాల కాకుండా.. మనకు నచ్చినన్ని రోజులు, గంటల పాటు లోకేషన్ షేర్ చేసుకునేలా కస్టమ్ టైమ్ ఆప్షన్‌ను Find My యాప్‌లో జోడించారు. అంతేకాదు.. నిర్దిష్ట వ్యక్తులతో లోకేషన్ షేరింగ్‌ను ఆ రోజు చివరి వరకు తాత్కాలికంగా నిలిపివేసే (పాజ్) వీలు కూడా కల్పించారు.

Also Read: స్మార్ట్‌వాచ్‌తో షుగర్ టెస్ట్ సాధ్యమేనా? అసలు గుట్టు విప్పిన అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ!

ఈజీగా బిల్లులు, కార్డ్‌ల మేనేజ్‌మెంట్:

Advertisement

డబ్బుల లావాదేవీలను సులభతరం చేస్తూ వాలెట్, మెసేజెస్ యాప్స్‌లో యాపిల్ ఇంటెలిజెన్స్ సాయంతో బిల్లులను స్ప్లిట్ చేసుకునే సదుపాయం వస్తోంది. కెమెరాలోని కొత్త సిరి మోడ్ ద్వారా ఏదైనా బిల్లు రశీదును స్కాన్ చేస్తే, ఎవరి వాటా ఎంత అనేది ట్యాక్స్‌లతో సహా లెక్కించి చూపిస్తుంది. అలాగే మీ వద్ద ఉన్న ఫిజికల్ మెంబర్‌షిప్, లాయల్టీ కార్డ్‌లను కెమెరాతో స్కాన్ చేసి నేరుగా ఆపిల్ వాలెట్‌లో డిజిటల్ పాస్‌లుగా మార్చుకోవచ్చు.

మెరుగైన యాపిల్ పే, హోటల్ కీస్:

యాపిల్ పే చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కొత్త డిజైన్‌ను తీసుకొచ్చారు. ఇకపై జస్ట్ స్వైప్ చేయడం ద్వారా వేర్వేరు కార్డ్‌లను మార్చుకోవచ్చు. కార్డ్‌ల రివార్డ్ పాయింట్లు, బ్యాలెన్స్ వివరాలు కూడా ఇక్కడే కనిపిస్తాయి. అలాగే భాగస్వామ్య హోటళ్లలో డిజిటల్ కీ అనుభవాన్ని మెరుగుపరుస్తూ ట్రిప్ వివరాలు, బుకింగ్ అప్‌డేట్స్ వంటి సమాచారాన్ని వాలెట్ యాప్‌లోనే చూసుకునే సదుపాయం కల్పించారు. చిన్న వ్యాపారులకు మన వివరాలను సురక్షితంగా షేర్ చేయడానికి Tap to Share ఫీచర్ కూడా తోడైంది.

మ్యూజిక్, ఫొటోస్‌లలో వినోదం:

యాపిల్ మ్యూజిక్‌లో ఒక పాట తర్వాత మరో పాట వచ్చేటప్పుడు డీజే తరహాలో స్మూత్ ట్రాన్సిషన్స్ ఇచ్చేలా Automix ఫీచర్‌ను మరింత మెరుగుపరిచారు. అలాగే లిరిక్స్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌లో ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, కొరియన్ వంటి మరికొన్ని భాషల అనువాదాలను చేర్చారు. ఐక్లౌడ్ షేర్డ్ ఆల్బమ్స్‌లో ఇకపై యాపిల్ డివైజ్ లేని వారు కూడా వెబ్ ద్వారా ఫుల్ రిజల్యూషన్ ఫొటోలను పంచుకోవచ్చు. అలాగే పాడ్‌కాస్ట్ యాప్‌లో పర్టిక్యులర్ ఎపిసోడ్‌ల లోపల సెర్చ్ చేసుకునే వీలు కల్పించారు.

Also Read: ఇంత తక్కువ ధరకి ఇలాంటి ఫీచర్లా.. సూపర్ లుకింగ్ డిజైన్.. బిగ్ బ్యాటరీతో Vivo Y31s 5G లాంచ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×