E-Paper
Advertisement

Windows Free Antivirus: విండోస్‌లో పవర్‌ఫుల్ యాంటి వైరస్ టూల్.. ఫ్రీగా ఇలా ఉపయోగించండి

Windows Free Antivirus: విండోస్‌లో పవర్‌ఫుల్ యాంటి వైరస్ టూల్.. ఫ్రీగా ఇలా ఉపయోగించండి
Advertisement

Windows Free Antivirus MSRT| ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించబడే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్. అయితే కంప్యూటర్లలో ఎక్కువ యాప్స్, వెబ్ బ్రైజింగ్, ఫైల్ డౌన్‌లోడింగ్ సమయంలో వైరస్, మాల్వేర్ ఫైల్స్ మీ సిస్టమ్‌లో చొరబడతాయి. వాటి వల్ల సిస్టమ్ పనితీరు తగ్గిపోతుంది. అనుకోని సమస్యలు తలెత్తుత్తాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం యాంటి వైరస్ తప్పనిసరిగా కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అయితే ఈ యాంటీ వైరస్ కోసం పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. కానీ విండోస్ లోనే ఇప్పుడు ఒక పవర్‌ఫుల్ యాంటివైరస్ టూల్ అందుబాటులో ఉంది.

మీ విండోస్ కంప్యూటర్‌లో ఒక ఉచిత సెక్యూరిటీ టూల్ దాగి ఉంది. దీని పేరు మలిషియస్ సాఫ్ట్‌వేర్ రిమూవల్ టూల్ (Malicious Software Removal Tool – MSRT). ఇది వైరస్‌లు, ట్రోజన్స్, వార్మ్స్ లాంటి సాధారణ మాల్వేర్‌లను వెతికి తొలగిస్తుంది. మైక్రోసాఫ్ట్ ప్రతి నెలా దీన్ని అప్‌డేట్ చేస్తుంది. ఇది విండోస్ అప్‌డేట్ ద్వారా ఆటోమాటిక్‌గా వచ్చేస్తుంది.

ఈ టూల్ ఎలా పని చేస్తుంది?

Advertisement

ప్రతి నెలా విండోస్ అప్‌డేట్ వచ్చినప్పుడు ఈ టూల్ బ్యాక్‌గ్రౌండ్‌లో సైలెంట్‌గా స్కాన్ చేస్తుంది. కానీ మీరు కావాలంటే ఎప్పుడైనా మాన్యువల్‌గా స్కాన్ చేయొచ్చు. ఇది పూర్తి యాంటీవైరస్ కాదు కానీ ఒక ఎక్స్‌ట్రా సెక్యూరిటీ లేయర్ లాంటిది.

మాన్యువల్ స్కాన్ ఎలా చేయాలి?

కీబోర్డ్‌లో విండోస్ కీ + R నొక్కండి. Run బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో mrt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. UAC ప్రాంప్ట్ వస్తే Yes క్లిక్ చేయండి. వెంటనే MSRT టూల్ ఓపెన్ అవుతుంది.

స్కాన్ ఎలా రన్ చేయాలి?

Advertisement

MSRT ఓపెన్ అయ్యాక “Next” ప్రెస్ చేయండి. మూడు ఆప్షన్స్ వస్తాయి:

  • క్విక్ స్కాన్ (Quick Scan) – సాధారణ ప్లేస్‌లు మాత్రమే చెక్ చేస్తుంది
  • ఫుల్ స్కాన్ (Full Scan) – పూర్తి కంప్యూటర్ స్కాన్ చేస్తుంది (కొన్ని గంటలు పడుతుంది)
  • కస్టమ్ స్కాన్ (Custom Scan) – మీరు ఏ ఫోల్డర్స్ చెక్ చేయాలో ఎంచుకోవచ్చు
  • మీకు నచ్చిన స్కాన్ ఎంచుకొని “Next” నొక్కండి. స్కాన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది.

స్కాన్ రిజల్ట్స్ ఎలా చూడాలి?

స్కాన్ పూర్తయ్యాక వైరస్ కనిపించగానే ఆటోమాటిక్‌గా తొలగిస్తుంది లేదా రిపేర్ చేస్తుంది. “View Detailed Results” ప్రెస్ చేస్తే వైరస్ పేరు, దాన్ని ఫిక్స్ ఎలా చేశారో పూర్తి రిపోర్ట్ కనిపిస్తుంది. Emotet, WannaCry లాంటి పెద్ద వైరస్‌లు కూడా గుర్తిస్తుంది.

ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి

MSRT పూర్తి యాంటీవైరస్ కాదు. ఇది కేవలం ఎక్స్‌ట్రా సెక్యురిటీ మాత్రమే. మైక్రోసాఫ్ట్ డిఫెండర్ లేదా మరో మంచి యాంటీవైరస్ తప్పనిసరిగా ఉపయోగించండి. ప్రతి నెలా విండోస్ అప్‌డేట్స్ చేసుకోండి. దీని ద్వారానే MSRT కొత్త వైరస్ డేటా పొందుతుంది.
ఇప్పుడే కంప్యూటర్ ఓపెన్ చేసి “mrt” టైప్ చేసి స్కాన్ రన్ చేయండి.. ఫ్రీగా మీ PCని సురక్షితంగా ఉంచుకోవచ్చు!

Also Read: సైబర్ దొంగలు మీ డబ్బు దోచుకున్నారా? ఇలా చేస్తే మీ డబ్బు తిరిగి వస్తుంది

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×