E-Paper
Advertisement

Wi Fi Spy: ప్రజలపై నిఘా.. గూఢచర్యం చేస్తున్న వై ఫై రూటర్లు..

Wi Fi Spy: ప్రజలపై నిఘా.. గూఢచర్యం చేస్తున్న వై ఫై రూటర్లు..
Advertisement

Wi Fi Router Spy| మీ ఆఫీసులో, ఇంట్లో మీరు తరుచూ కాఫీ తాగడానికి వెళ్లే కేఫెలో ఉన్న సాధారణ Wi-Fi రూటర్ మిమ్మల్ని రహస్యంగా గమనిస్తోందనే విషయం మీకు తెలుసా? ఈ రూటర్ ఒక రహస్య కెమెరా లాగా పనిచేస్తుంది. మీరు ఎక్కడ నడిచినా, ఎలా కూర్చున్నా, ఏం చేస్తున్నా.. అన్నీ ట్రాక్ చేయగలదు. ఇవన్నీ చేయడానికి మీ ఫోన్, కంప్యూటర్ ఏమీ అవసరం లేదు!

జర్మనీలోని కార్ల్‌స్‌రూహే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. ఈ టీమ్‌ను డాక్టర్ థోర్‌స్టెన్ స్ట్రూఫ్ నడిపించారు. వాళ్లు రాసిన రీసెర్చ్ పేపర్ లోని విషయాలు ఆందోళనకరంగా ఉన్నాయి.

గూఢాచారిగా వైఫై రూటర్.. ఎలా పనిచేస్తుంది?

Advertisement

Wi-Fi రూటర్ నుంచి గాలిలో రేడియో తరంగాలు (radio waves) వ్యాపిస్తాయి. మీ శరీరం ఆ తరంగాలను అడ్డుకుంటుంది. దీని వల్ల ఆ తరంగాలు వంగిపోయి, బద్దలు అవుతాయి. మీరు కదిలినప్పుడల్లా ఈ మార్పులు జరుగుతాయి. రూటర్ ఆ మార్పులను గమనించి, మీ శరీర ఆకారాన్ని, కదలికలను డిజిటల్ ఇమేజ్‌గా తయారు చేస్తుంది.

ఈ ప్రక్రియ పేరు బీమ్ ఫామింగ్ ఫీడ్‌బ్యాక్ ఇన్‌ఫర్మేషన్ (Beamforming Feedback Information – BFI). సాధారణంగా ఈ టెక్నాలజీ రూటర్ సిగ్నల్‌ను బలోపేతం చేయడానికే ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు దీన్నే ప్రజలపై, లేదా టార్గెట్ వ్యక్తులపై గూఢచారి చేయడానికి ఉపయోగిస్తున్నారు. డాక్టర్ స్ట్రూఫ్ దీన్ని సులభంగా ఇలా వివరించారు.. “ఇది కాంతి (లైటింగ్) లేకుండా పనిచేసే రేడియో తరంగాల కెమెరా!”

ఎందుకు ఇంత ప్రమాదకరం?

Advertisement

మీ రూటర్‌కు యాక్సెస్ ఉన్న వారు ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడూ ట్రాక్ చేసే అవకాశం ఉంది. మీరు రోజూ వెళ్లే కేఫెలోని రూటర్ కూడా మీ కదలికలను రికార్డ్ చేయగలదు. ఆ డేటాను కేఫె యజమాని, ప్రభుత్వం, లేదా ఏదైనా బిజినెస్ కంపెనీ తీసుకోవచ్చు. మీ అనుమతి లేకుండా, మీకు తెలియకుండా ఇదంతా జరుగుతుంది. అందుకే మీ ఇంటి వైఫై రూటర్ యాక్సెస్ కొత్త వ్యక్తులతో షేర్ చేయకండి, కెఫె లాంటి పబ్లిక్ ప్లేస్ లో, ఆఫీసుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి గూఢచర్యం నుంచి తప్పించుకునేందుకు పూర్తి స్థాయిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పటివరకు నిపుణులు సూచనలు చేయలేదు.

ఇప్పుడు ప్రపంచమంతా స్పై నెట్‌వర్క్!

ప్రపంచంలో ఎప్పుడూ లేనంతగా Wi-Fi రూటర్లు పెరిగాయి. ఇల్లు, ఆఫీసు, షాపింగ్ మాల్, రోడ్ల పక్కన.. ఎక్కడ చూసినా రూటర్లే! ప్రతి రూటర్ ఒక గూఢచారి పరికరంగా మారిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్లినా, ఎప్పుడు కదిలినా ఎవరో ఒకరు మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు.

మీ ఇంటి రూటర్ కూడా మిమ్మల్ని గమనిస్తుందనే ఆలోచనే భయంకరంగా ఉంటుంది కదా! ఈ కొత్త టెక్నాలజీ ప్రజల ప్రైవెసీని పూర్తిగా నాశనం చేయగలదు. అందుకే ఇక మీదట మీ Wi-Fi రూటర్‌ను చూసేటప్పుడు జాగ్రత్త!

Also Read: ఇన్‌స్టామార్ట్‌ని మోసం చేసిన కస్టమర్.. ఏఐ ఫోటో చూపించి దోపిడీ

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×