E-Paper
Advertisement

Smartphone Metal Detector: మీ స్మార్ట్‌ఫోన్‌లోనే మెటల్ డిటెక్టర్, మీటర్ టేప్.. ఈ రహస్య ఫీచర్స్ ఎలా ఉపయోగించాలంటే?

Smartphone Metal Detector: మీ స్మార్ట్‌ఫోన్‌లోనే మెటల్ డిటెక్టర్, మీటర్ టేప్.. ఈ రహస్య ఫీచర్స్ ఎలా ఉపయోగించాలంటే?
Advertisement

Smartphone Metal Detector| మీరు రోజువారీగా ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి? వాటిని పూర్తిస్థాయిలో ఎలా ఉపయోగించాలి? అనేది చాలా మందికి ఇప్పటికీ తెలియదు.
ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో చాలా రహస్య ఫీచర్లు ఉన్నాయి. చాలా మంది వినియోగదారులు వీటిని గమనించరు. ఈ ఫీచర్లు ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో సైలెంట్‌గా పని చేసి రోజువారీ జీవితంలో అనుకోకుండానే సహాయపడతాయి. ఈ రహస్య ఫీచర్స్‌లో మెటల్ డిటెక్టర్ అంటే లోహాలను గుర్తించే సెన్సార్, కొలతలు చేయడానకి డిజిటల్ టేప్ అంటే టైలర్లు ఉపయోగించే మీటర్ టేప్ వంటి రెండు పవర్‌ఫుల్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి బయటి గాడ్జెట్ల అవసరాన్ని తగ్గిస్తాయి. సరైన యాప్ లేదా ఫీచర్ ఆన్ చేస్తే మీ ఫోన్‌తోనే ఈ పనులు సులభంగా చేయవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లో దాగి ఉన్న సెన్సార్లు

స్మార్ట్‌ఫోన్‌లలో వివిధ రకాల సెన్సార్లు ఉంటాయి. స్క్రీన్ రొటేషన్ కోసం జైరోస్కోప్, బ్రైట్‌నెస్ కోసం లైట్ సెన్సార్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ చాలా మందికి మాగ్నెటోమీటర్ సెన్సార్ గురించి తెలియదు. ఇది డిజిటల్ కంపాస్‌లా పని చేస్తుంది. భూమి యొక్క మాగ్నెటిక్ (అయస్కాంత) ఫీల్డ్‌ను కొలుస్తుంది. దీని సాయంతో ఫోన్ సమీపంలో ఉన్న లోహపు వస్తువులను (ఇనుము, స్టీల్) కూడా గుర్తిస్తుంది.

స్మార్ట్‌ఫోన్ లో మెటల్ డిటెక్టర్ ఎలా పనిచేస్తుంది?

Advertisement

ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ మాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంటుంది. ఇది భూమి మాగ్నెటిక్ ఫీల్డ్‌ను మూడు దిశల్లో కొలుస్తుంది. దీని సాయంతో ఉత్తరం, దక్షిణం దిశలు చూపిస్తుంది. దగ్గరకు లోహం వచ్చినప్పుడు మాగ్నెటిక్ ఫీల్డ్ ఆకస్మికంగా మారుతుంది. ఈ మార్పును సెన్సార్ గుర్తిస్తుంది. నిజమైన మెటల్ డిటెక్టర్లలా తరంగాలు పంపదు, కేవలం చుట్టుపక్కల మాగ్నెటిక్ ఫీల్డ్ మార్పులను గమనిస్తుంది. పెద్ద లోహ వస్తువులను బాగా గుర్తిస్తుంది. చిన్న వస్తువులు ఎల్లప్పుడూ కచ్చితంగా గుర్తించకపోవచ్చు.

మెటల్ డిటెక్టర్‌గా మారే యాప్స్

చాలా ఉచిత మెటల్ డిటెక్టర్ యాప్‌లు మాగ్నెటోమీటర్ సెన్సార్‌ను ఉపయోగిస్తాయి. ఈ యాప్‌లు రియల్ టైమ్‌లో మాగ్నెటిక్ ఫీల్డ్ బలాన్ని చూపిస్తాయి. లోహం అంటే స్టీల్ లేదా ఐరన్ తో తయారై వస్తువు దగ్గరకు వచ్చినప్పుడు రీడింగ్ పెరుగుతుంది. పైప్‌లు, స్క్రూలు, లోపల మెటల్ దాచిఉన్న వస్తువులు కనుగొనడానికి సహాయపడతాయి. ఫోన్ కేస్ లేదా మాగ్నెటిక్ యాక్సెసరీలు తీసేసి ఉపయోగిస్తే మరింత కచ్చితంగా పని చేస్తాయి.

టేప్ లేకుండా వస్తువులను కొలవడం

Advertisement

ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో AR ఆధారిత కొలత ఫీచర్లు ఉన్నాయి. అంటే ఒక డిజిటల్ టేప్ లాంటి. దీన్ని ఉపయోగిస్తే.. కొలతలు చేయడానికి ఫిజికల్ టేప్ అవసరం లేదు. కెమెరా, సెన్సార్ల సాయంతో దూరం, పరిమాణం కొలుస్తాయి. ఫర్నిచర్, గోడలు, టేబుల్, బాక్స్‌లు సులభంగా కొలవవచ్చు.

AR కొలత యాప్స్ ఎలా పని చేస్తాయి?

చాలా ఆధునిక ఫోన్లలో బిల్ట్-ఇన్ మెజర్ యాప్ ఉంటుంది. ఐఫోన్‌లలో Measure యాప్ డిఫాల్ట్‌గా ఉంటుంది. ఆండ్రాయిడ్‌లో Google AR Measure ఫీచర్ ఉంటుంది. యాప్ ఓపెన్ చేసి కెమెరాకు పర్మిషన్ ఇవ్వాలి. కొలవాలనుకున్న వస్తువు వైపు కెమెరాను చూపించాలి.

సర్ఫేస్ స్కాన్ చేసి కచ్చితత్వం పెంచడం

ఫోన్‌ను నెమ్మదిగా తరలించి సర్ఫేస్ స్కాన్ చేయాలి. నేల, గోడ వంటి ఫ్లాట్ ఉపరితలాలను యాప్ గుర్తిస్తుంది. స్కాన్ పూర్తయ్యాక చిన్న డాట్స్ లేదా గ్రిడ్ లైన్లు కనిపిస్తాయి. ఇది కచ్చితమైన కొలతలకు సహాయపడుతుంది.

Also Read: స్మార్ట్ గ్యాడ్జెట్స్ యుగంలో స్మార్ట్ పిల్.. కడుపులో క్యాప్సుల్ రూపంలో ప్రవేశించే ఎలెక్ట్రానిక్ చిప్

డిజిటల్‌గా స్టార్ట్, ఎండ్ పాయింట్లు మార్క్ చేయడం

స్క్రీన్‌పై ట్యాప్ చేసి స్టార్టింగ్ పాయింట్ మార్క్ చేయాలి. ఫోన్‌ను నెమ్మదిగా తరలించి వస్తువు చివరి వరకు తీసుకెళ్లాలి. డిజిటల్ లైన్ కనిపిస్తుంది. మళ్లీ ట్యాప్ చేస్తే ఎండ్ పాయింట్ లాక్ అవుతుంది. ఫలితం తక్షణమే చూపిస్తుంది. ఎత్తు, వెడల్పు కొలవడానికి ఇలాగే చేయవచ్చు.

కొలతలను సేవ్ చేసుకోవడం

చాలా యాప్‌లలో కొలతలను ఫోటోలతో సేవ్ చేయవచ్చు. స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. ఫర్నిచర్ కొనుగోలు, రూమ్ ప్లానింగ్ సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఈ ఫీచర్లు రోజువారీ జీవితంలో ఉపయోగకరం

స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు మెటల్ డిటెక్టర్లు, టేప్ మెజర్‌ల బదులు పని చేస్తున్నాయి. సమయం ఆదా అవుతుంది. అదనపు గాడ్జెట్ల అవసరం తగ్గుతుంది. ఈ దాగి ఉన్న ఫీచర్లు రోజూ సౌకర్యం, ప్రొడక్టివిటీని పెంచుతాయి. చాలా మంది వినియోగదారులకు ఈ టూల్స్ ఇప్పటికే ఫోన్‌లో ఉన్నాయని తెలియదు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×