E-Paper
Advertisement

Year-ender 2025 5: ఈ ఏడాది లాంచ్ అయిన 5 కూల్ గాడ్జెట్‌లు.. టెక్ లవర్స్ అస్సలు మిస్ కాకూడదు!

Year-ender 2025 5: ఈ ఏడాది లాంచ్ అయిన 5 కూల్ గాడ్జెట్‌లు.. టెక్ లవర్స్ అస్సలు మిస్ కాకూడదు!
Advertisement

Year-ender 2025 5: టెక్ ప్రపంచాన్ని ఊపేసిన సంవత్సరం 2025. ముఖ్యంగా హార్డ్‌వేర్ విషయంలో ఈ ఏడాది ఎన్నో కొత్త ప్రయోగాలు చూశాం. మామూలు అప్‌డేట్స్ కాకుండా, డిజైన్ నుంచి ఉపయోగించే విధానం వరకు గాడ్జెట్లు పూర్తిగా మారాయి. ఫోన్‌లు, వేరబుల్స్, కెమెరాలు.. అన్నీ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లాయి. అదే సమయంలో స్మార్ట్ గ్లాసెస్, రికార్డర్స్ లాంటివి.. కేవలం ఫిట్‌నెస్ ట్రాకింగ్‌కే కాకుండా.. రోజూ మనతో ఉండే AI సహచరుల్లా దగ్గరయ్యాయి. ఇక కెమెరా బ్రాండ్లు కూడా ఎక్కడా తగ్గేదేలే అంటూ.. మాడ్యులర్ కెమెరా కాన్సెప్ట్‌తో మన ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో 2025లో ట్రెండ్ సెట్ చేసిన 5 కూల్ గ్యాడ్జెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Samsung Galaxy Z TriFold

శాంసంగ్ తొలిసారిగా ట్రిపుల్‌ ఫోల్డింగ్ డిజైన్‌తో Galaxy Z TriFoldను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. డ్యూయల్ హింజ్ మెకానిజం కారణంగా దీనిని 6.5 అంగుళాల ఫోన్‌లా ఉపయోగించవచ్చు. దీంతోపాటు అవసరమైనప్పుడు పూర్తిగా ఓపెన్ చేస్తే 10.2 అంగుళాల పెద్ద టాబ్లెట్‌గా మారుతుంది. టైటానియం ఫ్రేమ్ ఫోన్‌కు బలాన్ని అందిస్తే, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్ పనితీరును కొత్త స్థాయికి తీసుకెళ్లింది. మూడు భాగాలుగా ఉన్న 5,600mAh బ్యాటరీ ఎక్కువ స్క్రీన్ ఉన్నా కూడా డే లాంగ్ యూజ్‌కు సహాయపడుతుంది. ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో ఇది నిజంగా గేమ్ ఛేంజర్‌ అనే చెప్పాలి.

Apple iPhone Air

Advertisement

యాపిల్ 2025 చివర్లో లాంచ్ చేసిన iPhone Air మినిమలిజం వైపు తీసుకున్న పెద్ద అడుగు. కేవలం 5.6mm మందం, 165 గ్రాముల బరువుతో ఇది ఇప్పటివరకు వచ్చిన అతి పలుచని ఐఫోన్‌గా గుర్తింపు పొందింది. లోపల A19 Pro చిప్ ఉండటంతో పెర్ఫార్మెన్స్‌లో ఎలాంటి రాజీ లేదు. 48MP కెమెరా డే లైట్ నుంచి లో లైట్ వరకు అద్భుతమైన ఫొటోలు అందిస్తుంది. ప్రీమియం టైటానియం బాడీ దీనికి స్టైల్‌తో పాటు స్ట్రెంగ్త్‌ను కూడా ఇస్తుంది.

Ray-Ban Meta 

2025లో రే-బాన్ మెటా డిస్‌ప్లే గ్లాసెస్ మరింత అద్భుతమైన ఫీచర్స్‌తో వచ్చాయి. వీటిలో లెన్స్ పై నేరుగా ప్రొజెక్ట్ అయ్యే మైక్రో-LED డిస్‌ప్లే ఉంది, దీని 20-డిగ్రీల వీక్షణ కోణం, 5,000 నిట్ బ్రైట్‌నెస్ కారణంగా బయట సూర్యరశ్మిలో కూడా స్పష్టంగా అక్షరాలను చదవవచ్చు. దీని ద్వారా వినియోగదారులు నోటిఫికేషన్లు, నావిగేషన్‌లు స్పష్టంగా చూడవచ్చు.

NeoSapian Neo 1

Advertisement

పెండెంట్‌లా ధరించే NeoSapian Neo 1 ఒక AI మెమరీ అసిస్టెంట్. ఇది రోజువారీ సంభాషణలను రికార్డ్ చేసి, ట్రాన్స్‌క్రైబ్ చేసి భద్రపరుస్తుంది. తరువాత అవసరమైనప్పుడు ఆ సమాచారాన్ని తిరిగి గుర్తు చేసే విధంగా దీనిని తయారు చేశారు. మీ రోజువారీ పనులు, మీటింగ్స్, ముఖ్యమైన విషయాలు మర్చిపోకుండా ఉండేందుకు ఇది ఒక వ్యక్తిగత డిజిటల్ మెమరీలా ఉపయోగపడుతుంది.

Vivo X300 Pro, Oppo Find X9 Ultra

వివో X300 Pro, ఒప్పో Find X9 Ultra ఫోన్ల కోసం వచ్చిన ఎక్స్‌టర్నల్ లెన్స్ కిట్స్ మొబైల్ ఫోటోగ్రఫీకి కొత్త డైమెన్షన్ ఇచ్చాయి. జూమ్, కలర్ అక్యూరసీ, ఆప్టికల్ క్లారిటీ విషయంలో ఈ ఫోన్లు స్పష్టమైన మెరుగుదల చూపిస్తున్నాయి. ప్రొఫెషనల్ కెమెరా అనుభవాన్ని స్మార్ట్‌ఫోన్‌తోనే అందించడం వల్ల ఇవి నిజంగా గేమ్ ఛేంజర్లుగా మారాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×