E-Paper
Advertisement

Dum Aloo: ధాబా స్టైల్ దమ్ ఆలూ రెసిపీ, బగారా రైస్ తో తింటే అదిరిపోతుంది

Dum Aloo: ధాబా స్టైల్ దమ్ ఆలూ రెసిపీ, బగారా రైస్ తో తింటే అదిరిపోతుంది
Advertisement

దమ్ ఆలూ అనేది భారతీయులకి ఎంతో ఇష్టమైన కర్రీ. ముఖ్యంగా ఢాబాల్లో దొరికే దమ్ ఆలూ రుచి ప్రత్యేకంగా ఉంటుంది. గట్టిగా ఉండే గ్రేవీ, ఆలూలోకి మసాలా బాగా పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ చాలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వంట పెద్దగా రాని వారు కూడా దీన్ని అరగంటలో వండేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

దమ్ ఆలూ కర్రీ రెసిపీ
చిన్న సైజ్ బంగాళాదుంపలు – అర కిలో
ఉల్లిపాయలు – రెండు
టమాటాలు – మూడు
పెరుగు – అరకప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక పెద్ద చెంచా
నూనె – సరిపడా
ఉప్పు – రుచికి తగినంత
పసుపు – పావు స్పూను
కారం – ఒక స్పూను
ధనియాల పొడి – ఒక స్పూను
గరం మసాలా – పావు స్పూను
జీలకర్ర – పావు స్పూను
లవంగాలు – రెండు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
కసూరి మేథీ – కొద్దిగా
కొత్తమీర తరుగు – రెండు స్పూన్లు

Advertisement

దమ్ ఆలూ కర్రీ రెసిపీ
1. ముందుగా చిట్టి బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పూర్తిగా మెత్తగా కాకుండా ఉండేలా చూసుకోవాలి.
2.చల్లారిన తరువాత తొక్క తీసి ప్రతి దుంపకు టూత్‌పిక్ సహాయంతో చిన్న చిన్న రంధ్రాలు చేయాలి. ఇలా చేయడం వల్ల మసాలా లోపలికి బాగా చేరుతుంది.
3. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి వేడి చేయాలి. అందులో దుంపలను వేసి వేయించాలి.అవి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
4. అదే బాణలిలో మళ్లీ కొద్దిగా నూనె వేసి జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క వేయాలి. మంచి వాసన వచ్చాక ఉల్లి తరుగు వేసి లేత బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాలి.
5. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసి బాగా కలపాలి.
6. టమాటా పూర్తిగా ఉడికిపోయి నూనె పైకి తేలే వరకు మెల్లగా వేయించాలి. తరువాత పసుపు, కారం, ధనియాల పొడి వేసి రెండు నిమిషాలు కలపాలి.
7. మంట తగ్గించి పెరుగును కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ నిరంతరం కలపాలి. పెరుగు మసాలాతో కలిసిపోయి గట్టిగా మారే వరకు ఉడికించాలి.
8. ఇప్పుడు వేయించిన దుంపలను ఈ గ్రేవీలో వేసి ఉప్పు కలపాలి. కావాలంటే కొద్దిగా నీరు పోసి గ్రేవీ గట్టిగా ఉండేలా చూసుకోవాలి.
9. పైన మూత పెట్టి మంట చాలా తక్కువగా పెట్టి పది నిమిషాలు ఉడికించాలి.చివర్లో కసూరి మేథి, అలాగే కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి.

ఈ కూర వండుతున్నప్పుడే నోరూరిపోతుంది. దీన్ని తెల్ల అన్నంతో తిన్నా లేక బగారా రైస్ తిన్నా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని కేవలం చిట్టి ఆలూతో మాత్రమే కాదు, సాధారణ బంగాళాదుంపలతో కూడా వండుకోవచ్చు. వీటిని ముక్కలుగా కోసుకుని వండుకోవాలి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×