E-Paper
Advertisement

Xiaomi Smart Camera 3: మనిషి ముఖాన్ని గుర్తుపట్టే కొత్త సెక్యూరిటీ కెమెరా.. 3K రికార్డింగ్, 5MP సెన్సర్.. ధర?

Xiaomi Smart Camera 3: మనిషి ముఖాన్ని గుర్తుపట్టే కొత్త సెక్యూరిటీ కెమెరా.. 3K రికార్డింగ్, 5MP సెన్సర్.. ధర?
Advertisement

Xiaomi Smart Camera 3| చైనా టక్ కంపెనీ షావోమీ కంపెనీ కొత్త స్మార్ట్ కెమెరా 3 3Kను లాంచ్ చేసింది. ఈ కెమెరా స్మార్ట్ హోమ్స్‌కు సెక్యూరిటీ కల్పించడానికి తయారు చేయబడింది. ఇందులో హై క్వాలిటీ వీడియో, స్మార్ట్ AI ఫీచర్లు ఉన్నాయి.

హై క్వాలిటీ 3K వీడియో రికార్డింగ్

ఈ కెమెరా 2960 × 1666 రిజల్యూషన్‌తో వీడియో తీస్తుంది. సాధారణ 1080p కెమెరాల కంటే మూడు రెట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
ఇందులోని 5MP సెన్సార్ వల్ల వీడియోలు చాలా క్లియర్‌గా ఉంటాయి.

తక్కువ లైట్ ఉన్నప్పుడు కూడా రంగురంగుల ఫుటేజ్

Advertisement

కెమెరాలో అల్ట్రా లో-లైట్ ఫుల్ కలర్ టెక్నాలజీ ఉంది. సాయంత్రం లేదా తక్కువ లైట్ ఉన్నప్పుడు కూడా వీడియో డీటైల్స్ బాగా కనిపిస్తాయి. అలాగే పూర్తి చీకట్లో బ్లాక్ అండ్ వైట్ నైట్ విజన్‌కు మారుతుంది.

ఇన్ఫ్రారెడ్ నైట్ విజన్ సపోర్ట్

ఎనిమిది ఇన్ఫ్రారెడ్ లైట్లు ఉన్నాయి. వీటి సాయంతో రాత్రివేళ స్పష్టమైన వీడియోలు వస్తాయి. ఎర్రటి కాంతి లేకుండా పనిచేస్తుంది కాబట్టి ఎవరికీ ఇబ్బంది కలగదు.

స్మార్ట్ ప్యాన్, టిల్ట్ మూవ్‌మెంట్ ఫీచర్

Advertisement

డ్యూయల్ మోటార్ వల్ల 360 డిగ్రీలు తిరుగుతుంది. 109 డిగ్రీలు పైకి కిందికి కదులుతుంది. గది మొత్తం కవర్ అవుతుంది, బ్లైండ్ స్పాట్లు ఉండవు.

AI ఆధారిత హ్యూమన్ ట్రాకింగ్ సౌకర్యం

మనుషుల కదలికలను ఆటోమాటిక్‌గా ఫాలో చేస్తుంది. భద్రత మరింత కచ్చితంగా ఉంటుంది. అనవసర అలర్ట్‌లు రావు.

ఫేస్ రికగ్నిషన్, స్మార్ట్ అలర్ట్‌లు

ఈ కెమెరా ఏఐ టెక్నాలజీ సాయంతో తెలిసిన ముఖాలను గుర్తిస్తుంది, గుర్తుపెట్టుకుంటుంది. అపరిచితులు వచ్చినప్పుడు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంటి సెక్యూరిటీ మరింత బలపడుతుంది.

బలమైన ప్రైవసీ, డేటా భద్రత

ఈ కెమెరాలో మిజియా సెక్యూరిటీ చిప్ ఉంది. వీడియో ట్రాన్స్‌మిషన్ పూర్తిగా ఎన్‌క్రిప్టెడ్. డేటా సురక్షితంగా ఉంటుంది.

టూ-వే వాయిస్ కమ్యూనికేషన్ సౌకర్యం

బలమైన స్పీకర్, మైక్రోఫోన్ ఉన్నాయి. 8 మీటర్ల దూరం వరకు సౌండ్ స్పష్టంగా వినిపిస్తుంది. కెమెరా ద్వారా మాట్లాడే సౌకర్యం కూడా ఉంది.

Also Read: ఆన్‌లైన్‌లో కొత్త ఐఫోన్ కొంటే పాత ఫోన్ డెలివరీ.. ఎలా గుర్తుపట్టాలంటే

మంచి స్టోరేజ్ ఆప్షన్లు

కెమెరాలో మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంది, 256 GB వరకు. క్లౌడ్ స్టోరేజ్ కూడా ఆప్షనల్‌గా ఉంది. వీడియోలు సేఫ్‌గా బ్యాకప్ చేసుకోవచ్చు.

షావోమీ స్మార్ట్ కెమెరా 3 3K ధర

ఈ అడ్వాన్స్ ఏఐ ధర సుమారు 169 చైనా యువాన్‌లు. అంటే దాదాపు భారత కరెన్సీలో రూ.2,200. లాంచ్ ఆఫర్‌లో ఈ ధర ఉంది.
షావోమీ యూపిన్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

ఈ కెమెరా స్మార్ట్ హోమ్ సెక్యూరిటీ కోసం బెస్ట్ ఆప్షన్. క్వాలిటీ, AI ఫీచర్లు ఉండి ధర కూడా చవకగా ఉంది. ఇంటి భద్రత కోసం చాలా మంచి ఛాయిస్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×