E-Paper
Advertisement

షావోమీ కొత్త ఏసీ లాంచ్.. ప్రకృతిలో ఉన్నంత చల్లదనం.. అదిరిపోయింది భయ్యా!

షావోమీ కొత్త ఏసీ లాంచ్.. ప్రకృతిలో ఉన్నంత చల్లదనం.. అదిరిపోయింది భయ్యా!
Advertisement

Xiaomi Mijia AC: ప్రస్తుత సమ్మర్ ను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ కంపెనీలు అధునాతన ఏసీలను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనీస్ బ్రాండ్ షావోమీ (Xiaomi) సంస్థ ప్రకృతి సిద్ధమైన గాలి (Natural Breeze) అనే అనుభూతినిచ్చే సరికొత్త స్మార్ట్ ఎయిర్ కండీషనర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనికి మిజియా ఎయిర్ కండిషనర్ నేచురల్ విండ్ వర్టికల్ 3హెచ్‌పీ (Mijia Air Conditioner Natural Wind Vertical 3HP) అని పేరు కూడా పెట్టింది. ఇంతకీ ఈ వర్టికల్ ఏసీ ప్రధాన ఫీచర్లు, ధర వివరాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

నేచురల్ బ్రీజ్ అనుభూతి

మిజియా వర్టికల్ ఏసీ.. 13 మీటర్ల దూరం వరకూ చల్లటి గాలిని ప్రసారం చేస్తుంది. అయితే ఈ గాలి కృత్రిమంగా కాకుండా ప్రకృతి నుంచి సహజసిద్దంగా వస్తున్న అనుభూతిని కలిగిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. రెండు జోన్ల నుండి గాలిని ఇది విడుదల చేస్తుందని పేర్కొన్నాయి.

3D ఎయిర్ ఫ్లో

Advertisement

ఈ సరికొత్త షావోమీ ఏసీలో రెండు రకాల ఎయిర్ ఫ్లో మోడ్స్ ఉన్నాయి. మెుదటి మోడ్ (Canopy Airflow).. చల్లటి గాలి నేరుగా శరీరంపై పడకుండా పైకప్పు (Ceiling) వైపుగా ప్రవహించి గదిని చల్లబరుస్తుంది. రెండో మోడ్ (Carpet Airflow) వేడి గాలిని గది కింద భాగానికి (Floor) పంపి గదిని వెచ్చగా ఉంచుతుంది. కాబట్టి అన్ని కాలాల్లోనూ ఇది ప్రయోజనకరంగా ఉండనుంది.

115° వైడ్ యాంగిల్

ఈ షావోమీ వర్టికల్ ఏసీ.. గది మూలమూలకూ చల్లదనం అందేలా 115 డిగ్రీల వెడల్పుతో గాలిని వెదజల్లుతుంది. ఇది నిమిషానికి 1,752 క్యూబిక్ మీటర్ల గాలిని ప్రసరింపజేస్తుంది. కాబట్టి దూరంగా ఉన్నవారికి సైతం చల్లదనాన్ని ఆస్వాదిస్తారు. ఇది ‘లెవల్ 1’ ఎనర్జీ ఎఫిషియెన్సీ రేటింగ్‌ను కలిగి ఉన్నందున విద్యుత్ వినియోగాన్ని చాలా వరకూ ఆదా చేస్తుంది.

స్మార్ట్ టెక్నాలజీ

Advertisement

ఈ ఏసీ.. షావోమీ సరికొత్త HyperOS సపోర్ట్‌తో వస్తోంది. కాబట్టి ఈ ఏసీని ఫోన్ ద్వారా లేదా వాయిస్ కమాండ్స్ తో ఏసీని కంట్రోల్ చేయవచ్చు. మరోవైపు ఇది సెల్ఫ్ డయాగ్నసిస్ ఫీచర్ ను కలిగి ఉంది. ఏసీలో ఏదైనా సమస్య ఉన్నా లేదా ఫిల్టర్లలో దుమ్ము పేరుకుపోయినా ఇది వెంటనే గుర్తించి ఫోన్ కు నోటిఫికేషన్ పంపుతుంది. సుమారు 120 రకాల సమస్యలను ఇది స్వయంగ గుర్తించగలదని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read: దుమ్మురేపే ప్లాన్.. ఏడాది పాటు రోజూ 2GB డేటా.. ఫ్రీగా హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్!

ధర ఎంతంటే?

షావోమీ తన వర్టికల్ ఏసీని తాజాగా చైనాలో లాంచ్ చేసింది. ఏప్రిల్ 10 నుంచి ఆ దేశ మార్కెట్ లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. చైనాలో దీని ధర సుమారు 4,599 యువాన్లుగా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.53,000కు సమానం. త్వరలోనే భారత మార్కెట్ లోనూ దీనిని అందుబాటులోకి తీసుకొని రావాలని షావోమీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. పాచి పోయినది వేడి వేడిగా డెలివరీ..!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×