E-Paper
Advertisement

పెద్ద మనుసు చాటుకున్న ఎంపీ మల్లు రవి.. ఏం చేశారంటే..?

పెద్ద మనుసు చాటుకున్న ఎంపీ మల్లు రవి.. ఏం చేశారంటే..?
Advertisement

MP Mallu Ravi: స్వేచ్ఛ బ్యూరో: ఎంపీ నిధులతో సంక్షేమం, విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు నాగర్‌కర్నూల్:ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా 9 మందికి 12 లక్షల 31 వేల రూపాయలతో దివ్యాంగులకు ఉపయుక్తమయ్యే ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లను, ఈ సందర్భంగా దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్సీ కుచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు ట్రైసైకిళ్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ..

ఎంపీ నిధులను సంక్షేమానికి మరియు విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు దివ్యాంగుల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత గల అంశమని ఆయన పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందాలంటే దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. వారి దైనందిన జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.

Advertisement

Also Read: దుమ్మురేపే ప్లాన్.. ఏడాది పాటు రోజూ 2GB డేటా.. ఫ్రీగా హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్!

దివ్యాంగులలో ఆత్మవిశ్వాసం..

ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లు వంటి సహాయక పరికరాలు దివ్యాంగుల స్వతంత్ర జీవనానికి ఎంతో తోడ్పడతాయని ఆయన తెలిపారు. ఇలాంటి పరికరాల పంపిణీ ద్వారా దివ్యాంగులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, వారు ఇతరులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగగలరని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా డిడబ్ల్యూఓ రాజేశ్వరి వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: బీఆర్ఎస్ కథ ఒడిసిన ముచ్చట: టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×