E-Paper
Advertisement

Mijia Split AC: షావోమీ పవర్‌ఫుల్ ఏసీ లాంచ్.. 15 సెకన్లలోనే కూలింగ్.. నెక్ట్స్ లెవెల్ ఫీచర్లు భయ్యా!

Mijia Split AC: షావోమీ పవర్‌ఫుల్ ఏసీ లాంచ్.. 15 సెకన్లలోనే కూలింగ్.. నెక్ట్స్ లెవెల్ ఫీచర్లు భయ్యా!
Advertisement

Mijia Split AC: ప్రముఖ చైనీస్ బ్రాండ్ షావోమీ (Xiaomi).. మార్కెట్ లోకి సరికొత్త స్ప్లిట్ ఏసీని లాంచ్ చేసింది. చైనా మార్కెట్లో ‘Mijia Strong Air Super 1.5 HP’ పేరుతో దీనిని విడుదల చేసింది. ఏప్రిల్ 28 నుంచి ఈ ఏసీ సేల్స్ మెుదలుకానుండగా.. ఇప్పటినుంచే దీనిపై బజ్ ఏర్పడింది. త్వరలోనే భారత్ లోనూ ఈ ఏసీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో.. దీనిలోని ప్రధాన ఫీచర్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మెరుపు వేగంతో కూలింగ్

షావోమీ తన మిజియా స్ప్లిట్ ఏసీని.. పవర్ ఫుల్ కూలింగ్ టెక్నాలజీతో లాంచ్ చేసింది. ఇది కేవలం 15 సెకన్లలోనే గదిని చల్లబరచడం (Cooling) ప్రారంభిస్తుంది. అదేవిధంగా చలికాలంలో కేవలం 30 సెకన్లలోనే గదిని వేడి చేస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో అమర్చిన శక్తివంతమైన కంప్రెసర్, 118mm పెద్ద డయామీటర్ గల ఫ్యాన్ వల్ల గాలి చాలా వేగంగా గది అంతటా వ్యాపిస్తుంది.

కఠిన పరిస్థితుల్లోనూ గ్రేట్ పనితీరు

Advertisement

బయటి వాతావరణం ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ ఏసీ సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఎండలు 55°C కు చేరినప్పటికీ మెరుగైన కూలింగ్‌ను అందించనుంది. అలాగే మైనస్ డిగ్రీల చలిలో అంటే దాదాపు -15 డిగ్రీల వద్ద కూడా ఇది గదిని వెచ్చగా ఉంచగలదు.

ఎయిర్ ఫ్లో టెక్నాలజీ

సాధారణ ఏసీల్లా కాకుండా ఇందులో గాలి ప్రసరణ కోసం ప్రత్యేక మోడ్‌లు అందుబాటులో ఉంచారు. కానోపీ కూలింగ్ (Canopy Cooling) మోడ్ ద్వారా చల్లటి గాలి నేరుగా శరీరంపై పడకుండా పైనుంచి కిందకు జల్లులాగా పడుతుంది. కార్పెట్ హీటింగ్ (Carpet Heating) మోడ్ ద్వారా వేడి గాలి కింద నుండి పైకి వ్యాపించి పాదాలను కూడా వెచ్చగా ఉంచుతుంది.

ఏసీలోని స్మార్ట్ ఫీచర్లు

Advertisement

ఈ స్ప్లిట్ ఏసీ షావోమీ సరికొత్త HyperOS Connectతో పనిచేయనుంది. దీని సాయంతో యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా ఏసీని కంట్రోల్ చేయవచ్చు. అలాగే ‘షావో ఏఐ’ (Xiao AI) వాయిస్ అసిస్టెంట్ ద్వారా కేవలం మాటలతోనే ఉష్ణోగ్రతను మార్చుకోవచ్చు. అలాగే ఏసీని ఆన్, ఆఫ్ చేయడం వంటివి కూడా ఈజీగా చేయవచ్చు.

పవర్ సేవింగ్, సెల్ఫ్ క్లీనింగ్

షావోమీ నయా ఏసీ 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ ను కలిగి ఉంది. ఇతర ఏసీలతో పోలిస్తే దీనిపై ఏడాదికి 344 యూనిట్ల వరకూ విద్యుత్ ను ఆదా చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులోని హై-టెంపరేచర్ సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్.. ఏసీ లోపల పేరుకుపోయిన దుమ్ము, బ్యాక్టీరియాను 56 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద శుభ్రం చేసి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది.

Also Read: Viral News: ప్రియుడి కోసం భర్త, కొడుకుని వదిలేసింది.. ఆ తర్వాత కారులో ప్రియుడితో మూడుముళ్లు

ధర ఎంతంటే?

మిజియా స్ప్లిట్ ఏసీ ధరను షావోమీ 2,699 యువాన్లుగా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీ ప్రకారం దీని విలువ దాదాపు రూ.36,853కి సమానం. ఏప్రిల్ 28వ తేదీ నుంచి చైనా మార్కెట్ లో దీనిని కొనుగోలు చేయవచ్చు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకొని రావాలని షావోమీ కసరత్తు చేస్తోంది.

Also Read: కెమికల్స్, పొగ లేకుండా దోమలను ఇంటి నుంచి తరిమేయండి.. ఆరోగ్యానికి మేలు చేసే నేచురల్ టెక్నిక్

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×