E-Paper
Advertisement

షావోమీ కత్తిలాంటి టీవీ.. దీని ఫీచర్లు ఉన్నాయ్ భయ్యా.. చూస్తే ఇప్పుడే కొనేస్తారు!

షావోమీ కత్తిలాంటి టీవీ.. దీని ఫీచర్లు ఉన్నాయ్ భయ్యా.. చూస్తే ఇప్పుడే కొనేస్తారు!
Advertisement

Xiaomi TV: ప్రముఖ చైనీస్ కంపెనీ షావోమీ.. ఎలక్ట్రానిక్ పరికరాలకు నమ్మదగిన బ్రాండ్ గా భారత్ లో ఎదుగుతోంది. ఈ కంపెనీ విడుదల చేసే స్మార్ట్ ఫోన్లు, ఏసీలు, టీవీలకు మార్కెట్ లో గుడ్ విల్ రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా స్మార్ట్ టీవీ రంగంలో షావోమీ తన మార్క్ చూపిస్తూ సత్తా చాటుతోంది. అత్యాధునిక సాంకేతికత కలిగిన టీవీలను.. తక్కువ బడ్జెట్ లో అందిస్తూ తన ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. అదే సమయంలో వినియోగదారుల మన్ననలు అందుకుంటోంది. ప్రస్తుతం మార్కెట్లో మోస్ట్ సెల్లింగ్ టీవీగా ఉన్న.. షావోమీ 55 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ 4 ఎక్స్ (Mi 55 Inch Ultra HD TV -4X) ప్రధాన ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

నాణ్యమైన 4K డిస్ ప్లే

ఈ షావోమీ టీవీ.. 4K అల్ట్రా హెచ్ డీ (3840 x 2160) రిజల్యూషన్‌తో రూపొందింది. ఇది సాధారణ HD టీవీల కంటే 4 రెట్లు ఎక్కువ స్పష్టతను కలిగి ఉంటాయి. ఇందులో షావోమి ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన Vivid Picture Engine (VPE) అందుబాటులో ఉంచారు. ఇది రంగులను మరింత సహజంగా కాంట్రాస్ట్‌ను అద్భుతంగా చూపిస్తుంది. అలాగే డాల్బీ విజన్ (Dolby Vision), HDR10+, హెచ్ఎల్జీ వంటి ఫార్మాట్‌లకు ఇది సపోర్ట్ చేస్తుంది.

సౌండ్ క్వాలిటీ (Sound Quality)

Advertisement

ఈ టీవీ ఆడియో విషయానికి వస్తే.. ఇందులో 30W నుండి 40W వరకు శబ్దాన్ని ఇచ్చే శక్తివంతమైన స్పీకర్లు ఉన్నాయి. ఇవి డాల్బీ అట్మాస్, టీటీఎస్ హెచ్ డీ (DTS HD) టెక్నాలజీకి సపోర్ట్ చేస్తాయి. గదిలో అత్యంత నాణ్యమైన శబ్దాన్ని పెద్దగా వినిపిస్తూ.. థియేటర్ లో ఉన్న ఫీలింగ్ ను ఈ షావోమీ స్మార్ట్ టీవీ అందిస్తుంది.

పవర్ ఫుల్ ప్రాసెసర్..

ఈ షావోమీ స్మార్ట్ టీవీలో క్వాడ్ కోర్ ఏ55 (Quad core A55) అనే పవర్ ఫుల్ ప్రాసెసర్ ను అందించారు. అదే విధంగా 2GB ర్యామ్, 8 – 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. దీనివల్ల టీవీలోని ఎంటర్ టైన్ మెంట్ యాప్స్ త్వరగా ఓపెన్ అవ్వడమే కాకుండా.. ఎలాంటి ల్యాగ్ లేకుండా వీడియోలను స్ట్రీమ్ చేస్తాయి. మరోవైపు గేమింగ్ ప్రియుల కోసం ఇందులో ఆటో లో లాటెన్సీ మోడ్ (Auto Low Latency Mode) ఫీచర్ కూడా ఫిక్స్ చేశారు.

టీవీలోని స్మార్ట్ ఫీచర్లు

Advertisement

ఇది ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. షావోమి ప్రత్యేకంగా అందించే ప్యాచ్ వాల్ ఇంటర్‌ఫేస్ ద్వారా 30కి పైగా ఓటీటీ యాప్స్ (నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ వంటి) ఈజీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ అసిస్టెంట్ (Google Assistant) ద్వారా వాయిస్ కమాండ్స్‌తో టీవీని ఈజీగా కంట్రోల్ చేయవచ్చు.

కనెక్టివిటీ ఆప్షన్లు

ఈ షావోమీ టీవీలో కనెక్టివిటీ కోసం అనేక పోర్ట్‌లు అందించారు. గేమింగ్ కన్సోల్స్, సౌండ్ బార్స్ కోసం HDMI Ports సమకూర్చారు. అలాగే పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయడానికి 2 యూఎస్ బీ పోర్ట్స్ ఫిక్స్ చేశారు. ఇవి కాకుండా బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, ఫోన్ ను టీవీకి కనెక్ట్ చేసే క్యాస్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Also Read: Tamil Nadu Elections: బాబు ఏమో అటు.. ఆ పార్టీతో జతకట్టిన రోజా.. జగన్ రూటు ఎటు?

ధర ఎంతంటే?

షావోమీకి చెందిన ఈ అల్ట్రా హెచ్ డీ 4K టీవీ.. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో రూ.38,626కి అందుబాటులో ఉంది. 23 శాతం డిస్కౌంట్ లో ఫ్లిప్ కార్ట్ ఈ టీవీని అందిస్ోతంది. బ్యాంక్ ఆఫర్లు ద్వారా రూ.2000 రాయితీని సైతం ఫ్లిప్ కార్ట్ లో పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐని సైతం ఈ టీవీకి ఆఫర్ చేస్తున్నారు.

Also Read: మోస్ట్ ట్రెండింగ్ ఫోన్.. HD+ స్క్రీన్, 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. బడ్జెట్‌లో ది బెస్ట్ భయ్యా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×