E-Paper
Advertisement

అమరవీరుల కుటుంబీకుల దుఃఖం మనందరిదీ: రాహుల్ గాంధీ

అమరవీరుల కుటుంబీకుల దుఃఖం మనందరిదీ: రాహుల్ గాంధీ
Advertisement

Rahul Gandhi: గతేడాది పహల్గామ్‌లో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రదాడికి ఏడాది పూర్తయిన సందర్భంగా, కాంగ్రెస్ అగ్రనేత.. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అమాయక బాధితులకు నివాళులర్పించారు. ఈ పిరికిపంద దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులను స్మరిస్తూ, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్‌ (X) ఖాతాలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఈ దాడి భారతీయ ఆత్మను కలిచివేసిందని, ఆ అమాయకుల ప్రాణత్యాగం దేశం ఎప్పటికీ మరువదని ఆయన పేర్కొన్నారు.

ఈ ఉగ్రదాడి వల్ల ఆయా కుటుంబాలు అనుభవిస్తున్న తీరని వేదన దేశం మొత్తానిదని రాహుల్ వ్యాఖ్యానించారు. అకస్మాత్తుగా తమ ఆత్మీయులను కోల్పోయిన ఆ కుటుంబాల కన్నీరు నేటికీ ప్రజల హృదయాలను కలచివేస్తోందన్నారు. భారతదేశం తన బిడ్డల బలిదానాన్ని ఎన్నడూ విస్మరించదని అలాగే ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని, అందుకు కారణమైన శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదని ఆయ‌న ఉద్ఘాటించారు.

Advertisement

ఉగ్రవాదం, విద్వేషం వ్యాప్తి చేసే శక్తుల ముందు భారతదేశం ఎన్నటికీ తలవంచబోదని రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉన్నారని, భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యతతో, మరింత సంకల్పంతో అటువంటి శక్తులను ఎదుర్కొంటామని ఆయన పిలుపునిచ్చారు. హింస ద్వారా భయాన్ని నింపాలనుకునే వారి ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని, భారతదేశం తన ఐక్యతతోనే వారిని ఓడిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా భారతదేశం అప్పుడు ఎలాగైతే ఐక్యంగా నిలిచిందో, ఇప్పుడు కూడా అదే దృఢ నిశ్చయంతో ఉందన్నారు రాహుల్.

Read Also: కాళేశ్వరం పై హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు, BRS నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు: మహేష్ కుమార్ గౌడ్

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×