E-Paper
Advertisement

3-Drum Washing Machine: 3 డ్రమ్ముల కొత్త వాషింగ్ మెషీన్ లాంచ్.. ఒకేసారి ఎన్ని బట్టలైనా ఉతికేస్తుంది

3-Drum Washing Machine: 3 డ్రమ్ముల కొత్త వాషింగ్ మెషీన్ లాంచ్.. ఒకేసారి ఎన్ని బట్టలైనా ఉతికేస్తుంది
Advertisement

Xiaomi 3-Drum Washing Machine| చైనా ఎలెక్ట్రానిక్స్ బ్రాండ్ షావోమీ ఇటీవలే కొత్త స్మార్ట్ వాషింగ్ మెషిన్ లాంచ్ చేసింది. దీని పేరు మీజియా త్రీ జోన్ వాషింగ్ మెషీన్ ప్రో (Mijia Three-Zone Washing Machine Pro). ఈ కొత్త మెషీన్ చాలా స్పెషల్. పెద్ద కుటుంబాలకు, ఎక్కువ బట్టలు ఉతికే వారికి అనువైనది ఈ పెద్ద వాషింగ్ మెషీన్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మూడు డ్రమ్‌లు కలిగిన వాషింగ్ మెషీన్ ఇదే. ఒకేసారి మొత్తం 14 కేజీల బట్టలు ఇందులో వాష్ చేయొచ్చు.

ధర, ఎక్కడ దొరుకుతుంది?

ప్రస్తుతం చైనాలో విడుదలైన ఈ మెషీన్ ధర 6,499 యువాన్.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.83,213. ఇప్పుడు చైనాలోనే ప్రీ-ఆర్డర్ మొదలైంది, షావోమీ (Xiaomi Youpin) ప్లాట్‌ఫామ్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇండియాలో కూడా మరి కొన్ని నెలల్లో విడుదల కాబోతోంది.

మూడు డ్రమ్‌లు ఎందకు?

Advertisement

పెద్ద డ్రమ్ – 12 కేజీల సామర్థ్యం
చిన్న రెండు డ్రమ్‌లు – ఒక్కొక్కటి 1 కేజీ చొప్పున కెపాసిటీ కలిగి ఉన్నాయి.
వైట్ బట్టలు, కలర్ బట్టలు, ఇన్నర్ వేర్, బేబీ బట్టలు.. అన్నీ వేర్వేరుగా ఉతకడానికి సౌలభ్యం కోసం ఈ మూడు డ్రమ్‌లు ఉన్నాయి. ఒక డ్రమ్ నుంచి ఇంకో డ్రమ్‌కి నీళ్లు కలవడం జరగదు. మురికి బట్టల బ్యాక్టీరియా ప్రమాదం కూడా అసలు ఉండదు.

ఎంత వేగంగా వాష్ చేస్తుంది

12 నిమిషాల లైట్నింగ్ వాష్, 36 నిమిషాల ఎసెన్స్ వాష్ చేయగలదు. వాష్ చేసే సమయంలో నీళ్లు, కరెంట్ 45 శాతం వరకు ఆదా అవుతాయి.

బ్యాక్టీరియా, వైరస్‌లు పూర్తిగా పోతాయా?

Advertisement

ప్రతి డ్రమ్‌లో స్పెషల్ స్టెరిలైజేషన్ సిస్టమ్ ఉంది. 99.99% బ్యాక్టీరియా, వైరస్‌లు (HPV16, H1N1, ఈ.కోలి, స్టాఫిలోకాకస్) స్టెరిలైజేషన్ ప్రక్రియ ద్వారా చంపేస్తుంది. అలర్జీ, దుమ్ము లాంటివి కూడా తొలగిస్తుంది. చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లకి సూపర్ సేఫ్ మెషీన్

మరకలు ఎలా పోతాయి?

ఇందులో సూపర్ ఎలెక్ట్రాలసిస్ (Super Electrolysis) టెక్నాలజీ ఉంది. ఇది యాక్టివ్ ఆక్సిజన్ తయారు చేసి 20 రకాల మురికిని పూర్తిగా తొలగిస్తుంది. తెలుపు రంగు బట్టలకు పసుపు బారిపోవడం ఆగిపోతుంది. ఇదంతా ఎటువంటి కెమికల్స్ రసాయనాలు లేకుండానే వాష్ చేస్తుంది.

స్మార్ట్ ఫీచర్స్

  • 4 రకాల లిక్విడ్ డిటర్జెంట్ ఆటోమాటిక్‌గా స్టోర్ చేసుకుంటుంది
  • బట్టల రకం, బరువు, వాతావరణం చూసి సరిపోయే డిటర్జెంట్ మాత్రమే ఉపయోగిస్తుంది. వృథా చేయదు.
  • ఈ మెషీన్ లో HyperOS Connect ఫీచర్ ఉండడంతో మొబైల్ యాప్‌తో రిమోట్ కంట్రోల్ చేస్తుంది.
  • ఇందులో ఏఐ (Xiao Ai )వాయిస్ అసిస్టెంట్ పని చేస్తుంది
  • పెద్ద డ్రమ్‌లో లో-టెంపరేచర్ డ్రైయింగ్, చిన్న డ్రమ్‌లలో 42°C జెంటిల్ డ్రైయింగ్ ఫీచర్స్ ఉన్నాయి.
  • ఇంట్లోకుక్కు, పిల్లి వంటి పెంపుడు జంతువుల జుట్టు బట్టలకు అంటుకుంటే వాటిని తొలగించే స్పెషల్ మోడ్ (92.8% వరకు పోతుంది) కూడా ఉంది.

Also Read: స్వయంగా పనులన్నీ చేసే ఫోన్ లాంచ్.. టచ్ చేయాల్సిన అవసరం లేదు

పెద్ద ఫ్యామిలీలు, స్మార్ట్ హోమ్ ఇష్టపడేవాళ్లకి ఇది పర్ఫెక్ట్ వాషింగ్ మెషిన్. ఒకేసారి అన్ని రకాల బట్టలు వేర్వేరుగా, సూపర్ క్లీన్‌గా ఉతికేస్తుంది.

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×