E-Paper
Advertisement

Xiaomi Mi Home AC Ultra 2026: షావోమీ కొత్త సరుకు.. ఫోన్‌తోనే ఆపరేట్ చేయొచ్చు, కరెంటు బిల్లు కూడా తక్కువే!

Xiaomi Mi Home AC Ultra 2026: షావోమీ కొత్త సరుకు.. ఫోన్‌తోనే ఆపరేట్ చేయొచ్చు, కరెంటు బిల్లు కూడా తక్కువే!
Advertisement

Xiaomi Mi Home AC Ultra 2026: ప్రముఖ టెక్ సంస్థ షావోమీ నుంచి తాజాగా సరికొత్త స్మార్ట్ ఎయిర్ కండీషనర్ మార్కెట్లోకి వచ్చింది. 2026 ఎడిషన్‌గా విడుదలైన ‘షావోమీ మీ హోమ్ ఎయిర్ కండీషనర్ అల్ట్రా ఎనర్జీ సేవింగ్ ప్రో 1.5 హెచ్‌పి’ మోడల్ పాత వెర్షన్ కంటే మెరుగైన ఫీచర్లతో చైనాలో లాంచ్ అయింది. దీనిలో ముఖ్యంగా గాలి వీచే వేగాన్ని పెంచడమే కాకుండా, విద్యుత్ ఆదా చేసేందుకు ప్రత్యేక టెక్నాలజీని కూడా ఉపయోగించారు.

కరెంట్ బిల్లు తక్కువే:

గత ఏడాది విడుదలైన మోడల్‌తో పోలిస్తే.. ఈ కొత్త ఏసీలో గాలి వేగం చాలా బాగుంది. ఇది గంటకు 900 క్యూబిక్ మీటర్ల ఎయిర్ ఫ్లోను అందిస్తుంది. దీంతో గది మూలమూలలా చల్లదనం త్వరగా వ్యాపిస్తుంది. ఈ ఏసీలో అమర్చిన డబుల్ రో కండెన్సర్, ఎవపరేటర్ వల్ల కూలింగ్, హీటింగ్ సామర్థ్యం పెరిగింది. దీని ఎనర్జీ రేటింగ్ కూడా మెరుగుపడటంతో కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనే టెన్షన్ ఉండదు.

Advertisement

Also Read: కొత్త మానిటర్ కొంటున్నారా? ఈ చిన్న లాజిక్ మిస్సయ్యారో మీ పనైపోయినట్టే!

సెల్ఫ్ క్లీనింగ్ ఆప్షన్:

చాలా ఏసీలు ఆన్‌లో ఉన్నప్పుడు విపరీతమైన శబ్దం చేస్తుంటాయి. కానీ ఈ షావోమీ ఏసీ కేవలం 16 డెసిబుల్స్ శబ్దంతో చాలా సైలెంట్‌గా పనిచేస్తుంది. రాత్రిపూట హాయిగా నిద్రపోవాలనుకునే వాళ్లు ఈ ఏసీని కొనుగోలు చేయొచ్చు. అలాగే దీనిలో సెల్ఫ్ క్లీనింగ్ ఆప్షన్ ఉండటం వల్ల ఏసీ లోపలి భాగాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం సులభమవుతుంది.

ఫోన్‌కే సర్వీస్ నోటిఫికేషన్స్:

Advertisement

ఇక స్మార్ట్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇది షావోమీ సరికొత్త హైపర్ ఓఎస్ కనెక్ట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతో యూజర్లు తమ ఫోన్‌లోని యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా ఏసీని కంట్రోల్ చేయొచ్చు. ఫిల్టర్ క్లీన్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు లేదా కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఉన్నప్పుడు ఫోన్‌కే నోటిఫికేషన్లు వస్తాయి. ఏసీపై ఉండే చిన్న డిస్‌ప్లేలో టెంపరేచర్ వివరాలను నేరుగా చూసుకోవచ్చు.

ధర ఎంతంటే?

చైనా మార్కెట్లో ఈ షావోమీ మీ హోమ్ ఎయిర్ కండీషనర్ అల్ట్రా ఎనర్జీ సేవింగ్ ప్రో 1.5 హెచ్‌పి మోడల్ ధర సుమారు 45.000లోపే ఉంది. అయితే ఇతర దేశాల్లో ఈ మోడల్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Also Read: బడ్జెట్ ధరే కానీ ఫీచర్లు మాత్రం నెక్ట్స్ లెవల్.. త్వరలో లాంచ్ కానున్న టాప్-5 ల్యాప్‌టాప్స్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×