E-Paper
Advertisement

FD Laddering: చిన్న మొత్తాల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు.. ల్యాడరింగ్ టెక్నిక్ తెలుసా?

FD Laddering: చిన్న మొత్తాల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు.. ల్యాడరింగ్ టెక్నిక్ తెలుసా?
Advertisement

FD Laddering: పెద్దగా రిస్క్ లేకుండా రిటర్న్స్ ఇచ్చేది FD ఇన్వెస్ట్మెంట్. పరిమిత కాలానికి మీ పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎఫ్డీలో ఒక చిన్న చిట్కా ఫాలో అయితే ప్రతి సంవత్సరం రిటర్న్స్ తో మనకు కావాల్సినప్పుడు అమౌంట్ తీసుకోవచ్చు. దీనినే ఎఫ్డీ ల్యాడరింగ్ అంటారు. మొత్తం అమౌంట్ ను ఒకే ఎఫ్డీలో కాకుండా.. చిన్న మొత్తాల్లో డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేయండి.

మూడు లక్షలు పెట్టుబడి ఇలా

మీ దగ్గర రూ.3 లక్షలు ఉన్నాయనుకోండి. ఆ మొత్తాన్ని ఒకే ఎఫ్డీలో కాకుండా లక్ష చొప్పున మూడు మొత్తాలుగా డివైడ్ చేసి మూడు ఎఫ్డీలు వేసుకోండి. అదీ కూడా మూడు వేర్వేరు కాల పరిమితికి ఎఫ్డీ చేయండి. అంటే లక్ష రూపాయలను ఒక సంవత్సరానికి ఎఫ్డీ చేయండి. మరో లక్షను రెండేళ్లకు, మరో లక్ష రూపాయలను మూడేళ్లకు ఎఫ్డీ చేయండి. ఫస్ట్ ఇయర్ మెచ్యూరిటీ అయిన మొత్తాన్ని మూడేళ్లకు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయండి. దీంతో మీ ఎఫ్డీ ప్రతి సంవత్సరం మెచ్యూరిటీ అవుతుంది. మీకు కావాల్సినప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. ఒకవేళ అమౌంట్ అవసరం లేకపోతే రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు.

ఇలా చేస్తే ఇన్సూరెన్స్ కూడా

Advertisement

బ్యాంకులు మూడేళ్ల ఎఫ్డీలపై కాస్త ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తుంటాయి. ఎఫ్డీ ల్యాడరింగ్ చేస్తూ పెట్టుబడి పెడితే మీకు మంచి రిటర్న్స్ తో పాటు కావాల్సినప్పుడు అమౌంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో ఎఫ్డీ చేస్తే లాక్ ఇన్ సమస్య ఉంటుంది. అదే చిన్న మొత్తంలో ఎఫ్డీ చేస్తే బ్రేక్ చేసుకున్నా పెద్దగా సమస్య ఉండదు. రూ. 5 లక్షల కంటే తక్కువ మొత్తాల్లో FD చేస్తే.. బ్యాంకులు నష్టాల్లో ఉన్నా.. మీ పెట్టుబడికి ఎలాంటి ఢోకా ఉండదు. మీ మొత్తం పెట్టుబడికి DICGC నిబంధనల మేరకు ఇన్సూరెన్స్ కూడా వస్తుంది.

Also Read: పోస్ట్ ఆఫీస్ స్కీంలో పెట్టుబడి..ఐదేళ్లలోనే ఐదు లక్షలకుపైగా లాభం

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×