// // Xiaomi 32 inch Fire TV price: ఆఫర్‌లో.. 32 ఇంచుల టీవీ -->
E-Paper
Advertisement

రూ.12 వేలకే షియోమీ స్మార్ట్ టీవీ.. తక్కువ ధరలో ఇంతకంటే ఏం కావాలి బ్రో!

రూ.12 వేలకే షియోమీ స్మార్ట్ టీవీ.. తక్కువ ధరలో ఇంతకంటే ఏం కావాలి బ్రో!
Advertisement

Xiaomi 32 inch Fire TV Price: మీ బెడ్‌రూమ్ లేదా చిన్న హాల్ కోసం ఒక పవర్‌ఫుల్ స్మార్ట్ టీవీ చూస్తున్నారా? తక్కువ బడ్జెట్‌లో థియేటర్ లాంటి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలా? అయితే మీ కోసమే వచ్చింది Xiaomi 80 cm (32 inch). అమెజాన్ ఫైర్ ఓఎస్ సపోర్ట్‌తో వచ్చే ఈ టీవీ.. క్రిస్టల్ క్లియర్ పిక్చర్ క్వాలిటీ, అదిరిపోయే సౌండ్, వేలాది యాప్స్ యాక్సెస్‌తో మార్కెట్లో హాట్ కేక్‌లా అమ్ముడవుతోంది. తక్కువ ధరలో ప్రీమియం స్మార్ట్ టీవీ ఫీచర్స్ కావాలనుకునే వారికి ఇదొక అల్టిమేట్ ఆప్షన్.

ఈ రోజుల్లో స్మార్ట్ టీవీ అనేది ప్రతి ఇంట్లోనూ కామన్ అయిపోయింది. ముఖ్యంగా 32 ఇంచుల సైజ్ టీవీలకు మార్కెట్లో ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ కేటగిరీలో షియోమీ (Xiaomi) సరికొత్త ప్రయోగం చేసి సక్సెస్ అయింది. సాధారణంగా ఆండ్రాయిడ్ టీవీలను ఇచ్చే షియోమీ, ఈ మోడల్‌లో అమెజాన్ ఫైర్ టీవీ సాఫ్ట్‌వేర్‌ను ఇచ్చింది. మరి ఈ Xiaomi F Series 32-inch (L32MB-FIN) టీవీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, దీని ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

Xiaomi 32 inch Fire TV ఫీచర్ల వివరాలు:

1.బెజెల్-లెస్ డిజైన్:

Advertisement

ఈ టీవీని చూడగానే ప్రీమియం ఫీల్ వస్తుంది. దీనికి మూడు వైపులా బెజెల్-లెస్ డిజైన్ (Premium Bezel-less Design) ఇచ్చారు. అంటే.. స్క్రీన్ చుట్టూ ఫ్రేమ్ చాలా సన్నగా ఉంటుంది. దీని వల్ల మనం సినిమాలు చూసేటప్పుడు పెద్ద స్క్రీన్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. హాల్‌లో లేదా బెడ్‌రూమ్ గోడకు తగిలిస్తే ఇల్లు చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

2.పిక్చర్ క్వాలిటీ:

ఇది HD Ready (1366×768) రిజల్యూషన్ ఉన్న ఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో.. షియోమీ వారి సిగ్నేచర్ వివిడ్ పిక్చర్ ఇంజిన్ (Vivid Picture Engine) టెక్నాలజీని వాడారు. ఇది కలర్స్‌ను చాలా రిచ్‌గా, బ్రైట్‌గా చూపిస్తుంది. మీరు కేబుల్ టీవీ ఛానెల్స్ చూసినా లేదా ఓటీటీలో సినిమాలు చూసినా పిక్చర్ చాలా క్లియర్‌గా, రియలిస్టిక్‌గా ఉంటుంది.

3.అమెజాన్ ఫైర్ ఓఎస్ :

Advertisement

ఈ టీవీకి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని సాఫ్ట్‌వేర్.ఇందులో ఇన్-బిల్ట్ Fire TV OS ఉంటుంది. ఇది చాలా స్మూత్‌గా, ల్యాగ్ లేకుండా రన్ అవుతుంది. మీ హోమ్ స్క్రీన్‌పైనే ప్రైమ్ వీడియో,నెట్‌ఫ్లిక్స్,డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్, జీ5 వంటి పాపులర్ యాప్స్ అన్నీ కనిపిస్తాయి. దీంతో పాటు వచ్చే స్మార్ట్ రిమోట్‌లో అలెక్సా వాయిస్ కంట్రోల్ (Alexa Voice Control)ఉంది. “అలెక్సా.. సాహో సినిమా ప్లే చెయ్” అని చెబితే చాలు.. క్షణాల్లో సినిమా స్టార్ట్ అయిపోతుంది.

4.సౌండ్ క్వాలిటీ:

చిన్న టీవీ కదా.. సౌండ్ తక్కువ ఉంటుందేమో అనుకుంటే పొరపాటే.. ఇందులో 20W పవర్‌ఫుల్ స్పీకర్స్ ఇచ్చారు. దీనికి తోడు Dolby Audio, DTS-HD, DTS Virtual:X టెక్నాలజీ సపోర్ట్ ఉండటం వల్ల సౌండ్ చాలా బేస్‌తో, క్లియర్‌గా వినిపిస్తుంది. ఎక్స్‌ట్రా హోమ్ థియేటర్ లేకుండానే.. చిన్న రూమ్‌లో సినిమా హాల్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది.

5.కనెక్టివిటీ , పర్ఫార్మెన్స్:

ఈ టీవీలో.. కనెక్టివిటీ కోసం 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, బ్లూటూత్ 5.0, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై (2.4GHz/5GHz) ఇచ్చారు. దీని వల్ల ఇంటర్నెట్ చాలా స్పీడ్‌గా కనెక్ట్ అవుతుంది. 1GB ర్యామ్ , 8GB స్టోరేజ్ ఉండటం వల్ల యాప్స్ చాలా ఫాస్ట్‌గా ఓపెన్ అవుతాయి.

Also Read: రూ.549 కే సోనీ బ్రాండ్ హెడ్‌ఫోన్స్! ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు బాస్

ధర ఎంత?

ఫీచర్లు ఇంత భారీగా ఉన్నా, మిడిల్ క్లాస్ బడ్జెట్‌కు సరిపోయేలా షియోమీ దీని ధరను నిర్ణయించింది.

ప్రస్తుత ఆన్‌లైన్ ఆఫర్ ధర.. మీ కామ్ (Mi.com) లో సుమారు రూ.11,999 నుంచి రూ. 12,999 మధ్య లభిస్తోంది. బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లు ఉంటే ఇంకా తక్కువకే సొంతం చేసుకోవచ్చు.

రూ.12వేల బడ్జెట్‌లో అలెక్సా వాయిస్ సపోర్ట్, ఫైర్ ఓఎస్ స్మార్ట్‌నెస్, అదిరిపోయే పిక్చర్ & సౌండ్ క్వాలిటీ కావాలనుకుంటే.. Xiaomi F Series 32-inch Fire TV కళ్ళు మూసుకుని కొనేయొచ్చు. ఇదొక పక్కా వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ టీవీ.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×