E-Paper
Advertisement

Xiaomi 18లో 4 ఇంచ్ బ్యాక్ డిస్‌ప్లే.. Vivo X500లో కాంపాక్ట్ డిజైన్.. లీకైన రెండు క్రేజీ ఫోన్ల ఫీచర్లు!

Xiaomi 18లో 4 ఇంచ్ బ్యాక్ డిస్‌ప్లే.. Vivo X500లో కాంపాక్ట్ డిజైన్.. లీకైన రెండు క్రేజీ ఫోన్ల ఫీచర్లు!
Advertisement

Xiaomi 18 and Vivo X500: స్మార్ట్‌ఫోన్ ప్రియుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతూ షావోమి, వివో సంస్థలు తమ తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. షావోమి 18 సిరీస్, వివో X500 లైనప్ సరికొత్త, అత్యంత శక్తివంతమైన చిప్‌సెట్లతో రానున్నట్లు లీకులు అందుతున్నాయి. ఇవి కేవలం స్పీడ్‌నే కాకుండా, అద్భుతమైన ఏఐ (AI) ఫీచర్లు, మెరుగైన బ్యాటరీ లైఫ్, అదిరిపోయే కెమెరా పెర్ఫార్మెన్స్‌ను అందించనున్నాయి.

నెక్స్ట్ లెవెల్ ప్రాసెసర్లు:

షావోమి తమ పాత బంధాన్ని కొనసాగిస్తూ క్వాల్కమ్ కంపెనీకి చెందిన సరికొత్త ‘స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6’ ప్రాసెసర్‌తో షావోమి 18 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. దీనిలో ప్రీమియం మోడల్స్ కోసం ‘ప్రో’ వెర్షన్ చిప్‌సెట్‌ను కూడా వాడే అవకాశం ఉంది. మరోవైపు వివో తమ X500 సిరీస్‌లో మీడియాటెక్ ‘డైమెన్సిటీ 9600’, ‘డైమెన్సిటీ 9600 ప్రో’ ప్రాసెసర్లను పరిచయం చేయబోతోంది. ఇవి అత్యాధునిక 2nm టెక్నాలజీతో రూపుదిద్దుకోవడం వల్ల ఫోన్ వేడెక్కకుండా, బ్యాటరీ చాలా తక్కువగా ఖర్చవుతుంది.

Advertisement

Also Read: మార్కెట్లోకి సరికొత్త రెడ్‌మీ కొత్త ఫోన్.. 50MP OIS కెమెరా, ఆండ్రాయిడ్ 16తో అరాచకం!

మునుపెన్నడూ లేని ఏఐ ఫీచర్లు:

ఈ కొత్త ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషించనుంది. క్లౌడ్ సపోర్ట్ అవసరం లేకుండా నేరుగా డివైజ్‌లోనే పనిచేసేలా ఈ చిప్‌సెట్లను డిజైన్ చేశారు. దీనివల్ల ఫొటో ఎడిటింగ్, వాయిస్ అసిస్టెన్స్, సిస్టమ్ ఆప్టిమైజేషన్ వంటి పనులు చాలా వేగంగా, స్మార్ట్‌గా సాగిపోతాయి. మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్ ఆడేవారికి ఈ ఫోన్లు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.

Xiaomi 18 Pro Max కెమెరా మ్యాజిక్:

Advertisement

లీకుల ప్రకారం షావోమి 18 ప్రో మాక్స్ మోడల్‌లో లీకా (Leica) భాగస్వామ్యంతో కూడిన డ్యూయల్ 200 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ రానుంది. లో-లైట్ ఫోటోగ్రఫీ కోసం ఇందులో LOFIC HDR 3.0 టెక్నాలజీని వాడుతున్నారు. అంతేకాదు.. ఈ ఫోన్ వెనుక భాగంలో నోటిఫికేషన్లు చూసుకోవడానికి, సెల్ఫీల కోసం ఒక చిన్న 4 ఇంచుల సెకండరీ డిస్‌ప్లే కూడా ఉండబోతుండటం విశేషం.

Xiaomi 18 Pro Max కాంపాక్ట్ డిజైన్:

వివో తమ X500 ప్రో మోడల్‌ను కెమెరాకు పెద్ద పీట వేస్తూనే, చేతిలో పట్టుకోవడానికి వీలుగా 6.37 ఇంచుల కాంపాక్ట్ స్క్రీన్‌తో తెస్తోంది. ఇందులో 50MP మెయిన్ కెమెరాతో పాటు 64MP సెకండరీ కెమెరా ఉండనున్నాయి. పెద్ద సెన్సార్, LOFIC టెక్నాలజీ వల్ల ప్రొఫెషనల్ క్వాలిటీ ఫొటోలను ఈజీగా తీసుకోవచ్చు. ఈ రెండు సిరీస్‌ల అధికారిక వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

Also Read: ఎట్టకేలకు శాంసంగ్ లవర్స్ కల నెరవేరింది.. క్రేజీ కెమెరా, భారీ బ్యాటరీతో వస్తోన్న Galaxy S27 Ultra!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×