// // Fastest Electric Scooters: ఓలా To ఏథర్.. దేశంలో టాప్ 5 ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే! -->
E-Paper
Advertisement

ఓలా To ఏథర్.. దేశంలో టాప్ 5 ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

ఓలా To ఏథర్.. దేశంలో టాప్ 5 ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
Advertisement

Fastest Electric Scooters in India 2026: ఒకప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు అంటే తక్కువ వేగంతో నడిచే, తక్కువ దూర ప్రయాణాలకు మాత్రమే ఉపయోగపడే వెహికల్స్ గా భావించే వాళ్లు. కానీ, ఇప్పుడు పరిస్థితి కంప్లీట్ గా మారిపోయింది. న్యూ జెనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అధిక వేగం, మంచి రేంజ్, అత్యాధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి వస్తున్నాయి. కొన్ని మోడళ్లు ఏకంగా పెట్రోల్ స్కూటర్ల కంటే వేగంగా పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో ఉన్న టాప్ 5 ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవనేది ఇప్పుడు చూద్దాం..

5.రివర్ ఇండి: 90 కి.మీ  

రివర్ ఇండి స్పెషల్ డిజైన్‌ తో మంచి గుర్తింపు పొందింది. చాలా మంది దీన్ని స్కూటర్లలో SUVగా పిలుస్తారు. మంచి బిల్డ్ క్వాలిటీ, ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, సుమారు 160 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.1.54 లక్షలు.

4.ఏథర్ 450 అపెక్స్: 100 కి.మీ

Advertisement

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇదీ ఒకటి. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. స్పోర్టీ డిజైన్, మంచి యాక్సిలరేషన్ ఆకట్టకుంటుంది. ఏథర్ 450 అపెక్స్ ధర రూ.1.95 లక్షలు.

3.టీవీఎస్ ఎక్స్: 105 కి.మీ

టీవీఎస్ ఎక్స్ భారత మార్కెట్లో ఎక్కువ మంది ఇష్టపడే స్కూటర్. దీని డిజైన్ ఫ్యూచరిస్టిక్ గా ఉండటం వల్ల యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్ గంటకు 105 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 159 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. టీవీఎస్ ఎక్స్ ధర రూ.2.66 లక్షలు.

2.సింపుల్ వన్ జెన్ 2: 05 కి.మీ

Advertisement

సింపుల్ వన్ జెన్ 2 పనితీరు, రేంజ్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 105 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 265 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. కొత్త అల్ట్రా వేరియంట్‌ లో ఈ రేంజ్ 400 కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ స్కూటర్ ధర రూ.1.90 లక్షలు.

1.ఓలా S1 ప్రో ప్లస్ జెన్ 3: 130 కి.మీ

ప్రస్తుతం దేశంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఓలా S1 ప్రో ప్లస్ జెన్ 3 గుర్తింపు తెచ్చుకుంది. ఈ స్కూటర్ గంటకు 130 కిలోమీటర్ల గరిష్ట వేగంతో  ప్రయాణిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 320 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇందులో డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, కనెక్టెడ్ టెక్నాలజీ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.1.24 లక్షలు.

Read Also: అడ్వెంచర్ బైక్ లవర్స్ కు పండుగే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 4 క్రేజీ బైక్స్ ఎంట్రీ!

Related News

డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. డ్రైవర్ ప్రాణాలు కాపాడిన టెస్లా ఫీచర్లు!

వాగన్ ఆర్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

హోండా SP125 స్పెషల్ ఎడిషన్‌ కు గుడ్‌ బై.. వెబ్‌ సైట్ నుంచి మాయం!

కొత్త స్టైల్.. సరికొత్త కలర్స్.. రివోల్ట్ RVX వచ్చేసింది!

రూ.10.99 లక్షలకే క్రెటా ఎలక్ట్రిక్.. హ్యుందాయ్ షాకింగ్ ఆఫర్!

టాటా సియెర్రా ఈవీ vs MG విండ్సర్ ఈవీ.. రెండింటిలో ఏ SUV బెస్ట్ అంటే..?

180 కి.మీ రేంజ్.. రిమూవబుల్ బ్యాటరీ.. కీవే క్రేజీ స్కూటర్ వచ్చేసింది!

పల్సర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. N125 ఉత్పత్తి నిలిపివేత!

Big Stories

Advertisement
×