E-Paper
Advertisement

Woman loses job: గర్భవతినంటూ మేనేజర్‌కు మెసేజ్.. మూడు గంటల్లో పోయిన ఉద్యోగం, అసలేం జరిగింది?

Woman loses job: గర్భవతినంటూ మేనేజర్‌కు మెసేజ్..  మూడు గంటల్లో పోయిన ఉద్యోగం, అసలేం జరిగింది?
Advertisement

Woman loses job: తాను గర్భవతిని అంటూ మేనేజర్‌కు మెసేజ్ పంపిన కేవలం మూడు గంటల్లో ఓ మహిళను ఉద్యోగం నుండి తొలగించారు. ఈ వ్యవహారంపై సదరు మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు నెటిజన్లు. అసలు ఏమి జరిగింది?

గర్భవతినంటూ మేనేజర్‌కు మెసేజ్-మహిళ పేరు.. సిటీ.. కంపెనీ విషయాలను కాసేపు పక్కనబెడదాం. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ తాను  గర్భవతి నంటూ తన  మేనేజర్‌కు మెసేజ్ పెట్టింది. ఆ మేసేజ్ పెట్టిన మూడు గంటల్లో సదరు మహిళను ఉద్యోగం నుండి తొలగించారు. వెంటనే షాకైన సదరు మహిళ, తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది.

Advertisement

మూడు గంటల్లో ఉద్యోగం నుంచి తొలగింపు-ఇప్పుడు ఆ మహిళ పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్స్ ఆన్‌లైన్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తాను గర్భవతినని తెలిసిందని, ప్రెగ్నెన్సీ సమయంలో వాంతులు, అలసట కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు ప్రస్తావించింది. ఖాళీ కడుపుతో ఉంటే నీరసంగా ఉంటుందని, డ్యూటీ సమయంలో కొన్ని బిస్కెట్లు లేకుంటే క్రాకర్స్ తినేందుకు అనుమతి ఇవ్వాలని మేనేజర్‌కు మెసేజ్ పెట్టింది.

మహిళలకు మద్దతుగా నెటిజన్లు-సదరు మహిళకు అధికారికంగా కంపెనీ నుంచి ఉద్యోగ తొలగింపు లేఖ వచ్చింది. అది చూసి ఒక్కసారిగా షాకైంది. సకాలంలో అండగా ఉంటాడనుకున్న మేనేజర్, కోలుకోలేని దెబ్బ కొట్టాడని ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ చేదు అనుభవం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

Advertisement

ఆఫీసులో కొద్దిరోజుల కిందట కఠినమైన రూల్స్ వల్ల 6 గంటల షిఫ్ట్ ముగిసే వరకు సిబ్బంది ఏమీ తినకూడదని, ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు మేనేజర్ అనుమతి కోరింది. మెసేజ్ చూసి మానవత్వంతో మేనేజర్ ఆలోచిస్తాడని ఆశించింది. ఆ మెసేజ్ పంపిన మూడు గంటల తర్వాత సదరు మహిళకు ఈ- మెయిల్‌కు వచ్చింది.

ALSO READ: త్వరలోనే Samsung Galaxy Tab S12 Ultra లాంచ్.. ముందే లీకైన ఆ సీక్రెట్ ఫీచర్స్ ఇవే!

దాని సారాంశం చూసి షాక్‌కు గురైంది ఆమె. మీరు ప్రొబేషన్ పీరియడ్‌ను విజయవంతంగా పూర్తి చేయలేదని, అందుకే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని రాసుంది. కంపెనీ మేనేజర్ పంపిన ఈ-మెయిల్ స్క్రీన్ షాట్స్‌ తీసి సోషల్ మీడియాలో పెట్టి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. డ్యూటీ సమయంలో చిన్న సాయం చేయమని కోరానని, తాను సెలవులు కోరలేదని రాసుకొచ్చింది.

నా జీవితంలో మార్గదర్శకత్వం వహించే పెద్దలు లేరని, మేనేజర్ అర్థం చేసుకుంటారని నమ్మి మోసపోయానని తన ఆవేదనను బయటపెట్టింది.  పోస్ట్ చూసిన నెటిజన్స్ సదరు మేనేజర్ పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  ఇది ప్రెగ్నెన్సీ వివక్ష కిందకు వస్తుందని అంటున్నారు. ఆ కంపెనీపై లీగల్ యాక్షన్ తీసుకుని కోర్టుకు లాగాలంటూ బాధితురాలికి మద్దతు పలుకుతున్నారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×